Jio World Garden : అంబానీయా మజాకా.. ‘జియో వరల్డ్ గార్డెన్’ విశేషాలివీ
Jio World Garden : ముకేష్ అంబానీ ఏది చేసినా పెద్ద రేంజులోనే ఉంటుంది !!
- By Pasha Published Date - 09:10 AM, Fri - 22 March 24

Jio World Garden : ముకేష్ అంబానీ ఏది చేసినా పెద్ద రేంజులోనే ఉంటుంది !! ఆయన అడుగుపెట్టని బిజినెస్ అంటూ ఏదీ లేదు. ఇప్పుడు ఫంక్షన్ హాళ్ల బిజినెస్‌లోకి కూడా ఎంటరైపోయారు. ముంబైలో జియో వరల్డ్ గార్డెన్ పేరిట పేద్ద ఫంక్షన్ హాల్ కట్టేశారు. ముకేష్ అంబానీ పెద్ద కుమారుడు ఆకాష్ అంబానీ పెళ్లి అందులోనే జరిగింది. ఇషా అంబానీ పిల్లల మొదటి పుట్టినరోజును ఇక్కడే జరుపుకున్నారు. ఆనాటి నుంచి ముంబైలోని లగ్జరీ ఈవెంట్లకు ఇది(Jio World Garden) కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఈ ఫంక్షన్ హాల్ నుంచి అంబానీ కుటుంబం లక్షల్లో సంపాదిస్తోంది. దీని విశేషాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం..
We’re now on WhatsApp. Click to Join
- జియో వరల్డ్ గార్డెన్ ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో ఉంది.
- దాదాపు 5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇది విస్తరించి ఉంది. ఈ గార్డెన్ మొక్కలు, పూలతో కనుల పండువగా ఉంటుంది.
- పశ్చిమ ముంబైలోని అతిపెద్ద ఓపెన్ ఎయిర్ సెంటర్ ది జియో వరల్డ్ గార్డెన్.
- చెట్లు, వాటర్ ఫౌంటెన్స్ వంటి ఏర్పాట్లు ఇందులో ఉన్నాయి.
- ఇందులో థియేటర్, హోటళ్లు, షాపింగ్ మాల్స్, ఆడిటోరియమ్స్, కార్యాలయాలు, 2000 వాహనాలకు విశాలమైన పార్కింగ్ వంటి సదుపాయాలు ఉన్నాయి.
- లాక్మే ఫ్యాషన్ వీక్, అరిజిత్ సింగ్ కచేరీ, ఎడ్ షీరన్ కచేరీ వంటి అంతర్జాతీయ ఈవెంట్‌లను ఇందులో నిర్వహించారు.
- జియో వరల్డ్ గార్డెన్‌లో ఈవెంట్‌ల కోసం రోజుకు రూ.15 లక్షలు చార్జ్ చేస్తారు. పన్నులు ఎక్స్‌ట్రా కట్టాల్సిందే.
- జియో గార్డెన్‌లో ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించని రోజుల్లో ప్రజలు రూ.10 రుసుముతో ప్రవేశించి మొత్తం చూసి వెళ్లొచ్చు.
Also Read :World Water Day 2024 : జలం ఉంటేనే జనం.. ‘బెంగళూరు సంక్షోభం’ నేర్పుతున్నది అదే!
ఆ లోన్లు కట్టేసిన అనిల్ అంబానీ
అనిల్ అంబానీ.. ఒకప్పుడు తన సోదరుడు ముకేశ్ అంబానీ కంటే అత్యంత ధనవంతుడు. అయితే కాలం గడుస్తున్న కొద్దీ అనిల్ అంబానీ తన సంపద కోల్పోతూ వచ్చారు. బ్యాంకుల వద్ద అప్పులు ఎక్కువగా తీసుకొని వాటిని చెల్లించలేకపోయారు. వ్యాపారాల్లో నష్టాలు వచ్చాయి. దీంతో అంబానీ ఒక దశలో దివాలా తీసినట్లు స్వయంగా ప్రకటించారు. వేల కోట్లుగా ఉన్న ఆస్తులు వందల కోట్లకు చేరాయి. అనిల్ అంబానీకి ఇక ఇప్పుడు మంచి రోజులు వచ్చినట్లే కనిపిస్తోంది. ఇన్ని రోజులు మీడియాకు దూరంగా ఉన్న ఆయన కొద్ది రోజుల కిందట ముకేశ్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ ప్రీవెడ్డింగ్ కార్యక్రమంలో కనిపించారు. తాజాగా అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ పవర్ కంపెనీ.. ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, డీబీఎస్ బ్యాంకులకు చెల్లించాల్సిన రుణాల్ని సెటిల్ చేసినట్లు తెలిసింది.