Gold Price : మహిళలకు శుభవార్త. భారీగా తగ్గనున్న బంగారం ధరలు..ఎంత తగ్గుతుందో తెలుసా.?
- By hashtagu Published Date - 08:47 AM, Wed - 2 November 22
మహిళలకు ఇది ఖచ్చితంగా శుభవార్తే. ఎందుకంటే బంగారం అంటే మహిళలకు ఎంతో ఇష్టమో తెలిసిందే. చేతిలోనాలుగు పైసలు ఉంటే చాలు బంగారం కొనేందుకు రెడీ అవుతుంటారు. ముఖ్యంగా పెళ్లిలు, పండగల్లో అయితే ప్రత్యేకంగా కొంటుంటారు. కొన్నాళ్లుగా బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఈ సమయంలో బంగారం కొనేందుకు కొంతమంది వెనకడుగు వేస్తున్నారు. ఇప్పుడు బంగారం కొనాలనుకునేవారు కొంతకాలం వేచి ఉండటం మంచిదంటున్నారు నిపుణులు. ఎందుకంటే కొన్నినెలల్లో బంగారం ధరలు భారీగా పతనం అయ్యే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. ఆగస్టు 2020లో పది గ్రాముల బంగారం ధర 56వేలకు చేరుకుని రికార్డు క్రియేట్ చేసింది. ఆ తర్వాత కొద్దిగా తగ్గుతూ వచ్చింది.
వాస్తవానికి గ్లోబల్ మాంధ్యం కారణంగా బంగారం ధరలు మరింత తగ్గుతాయని అంచనా వేస్తున్నారు. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రకారం..అక్టోబర్, డిసెంబర్ మధ్య భారత్ లో బంగారం వినియోగం గత ఏడాదితో పోలిస్తే పావు వంతు తగ్గిందని పేర్కొంది. అయితే పండగ సీజన్లో అమ్మకాలు పెరిగాయి. కానీ ఆశించిన స్థాయిలో బంగారం కొనేలేదు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో బంగారానికి డిమాండ్ తగ్గినట్లు తెలిపింది.
ప్రపంచంలో అత్యధికంగా బంగారం కొనుగోలు చేసేది…వినియోగించేది భారత్ లోనే. బంగారం వినియోగంలో చైనా మొదటిస్థానంలో ఉంటే, భారత్ రెండో స్థానంలో ఉంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం రానున్న రోజుల్లో బంగారం ధరలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. రెండేళ్ల కంటే కనిష్ట స్థాయి ధరలకు బంగారం పడిపోయే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. కాబట్టి బంగారం కొనుగోలు చేయాలనుకునేవారు కొన్ని రోజులు వేచి చూస్తే బాగుంటుంది.
Tags
Related News
Silver Price: లక్ష రూపాయలకు చేరువలో కిలో వెండి ధర..?
వెండి తన ఆల్టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుంది. ఇండియా బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ (ఐబీజేఏ) ప్రకారం కిలో వెండి రూ.85,700కి చేరింది.