HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Life Style
  • >Want To Lose Weight Quickly During Winter

Weight Loss: చలికాలంలో త్వరగా బరువు తగ్గాలనుకుంటున్నారా?

శీతాకాలం (Winter) చల్లటి వాతావరణం మనల్ని లేజీగా మారుస్తుంది. ఉదయం బెడ్‌ మీద నుంచి లేవడానికి మన బాడీ సహకరించదు.

  • Author : Maheswara Rao Nadella Date : 07-12-2022 - 6:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Weight Loss in Winter
Fruits

శీతాకాలం (Winter) చల్లటి వాతావరణం మనల్ని లేజీగా మారుస్తుంది. ఉదయం బెడ్‌ మీద నుంచి లేవడానికి మన బాడీ సహకరించదు. దీనికి తోడు జలుబు (Cold), దగ్గు (Cough), కీళ్లు (Bones) పట్టేయడం, శ్వాసకోశ (Respiratory) సంబంధిత సమస్యలూ ఈ కాలంలో ఎక్కువగా ఉంటాయి. దీంతో రోజు ఫిట్‌నెస్‌ (Fitness) రొటీన్‌ దెబ్బతింటుంది. ఈ కారణంగా శరీరంలోకి క్యాలరీ ఇన్‌ టేక్‌ ఎక్కువ అయ్యి కొవ్వుగా మారి, మనం త్వరగా బరువు (Weight) పెరుగుతాం. ఈ కాలంలో వర్క్‌వుట్స్‌ (Work outs)ను నిర్లక్ష్యం చేసే వారు, వారి డైట్‌ మీద శ్రద్ధ వహించాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా శీతాకాలంలో కొన్ని పండ్లు తీసుకుంటే, మన బరువు (Weight) కంట్రోల్‌లో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ కాలంలో మీ బరువు (Weight)ను అదుపులో ఉంచే పండ్లు ఏమిటో తెలుసుకుందాం.

ఆరెంజ్‌:

Orange definition and meaning | Collins English Dictionary

ఆరెంజ్‌లో విటమిన్‌ సీ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలోని కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. విటమిన్‌ సీ శరీరంలో జీవక్రయను మెరుగుపరుస్తుంది. బరువు (Weight) తగ్గడానికి ఆరెంజ్‌ బెస్ట్‌ ఆప్షన్‌. ఆరెంజ్‌లో వాటర్‌ కెంటెంట్‌ కూడా ఎక్కువగా ఉంటుంది. శీతాకాలంలో (Winter) ఆరెంజ్‌ తరచుగా తింటే ఆకలు కంట్రోల్‌లో ఉంటుంది.

జామకాయ:

What Is a Guava-and How Do You Eat It? | MyRecipes

శీతాకాలంలో (Winter) జామకాయ బెస్ట్‌ స్నాక్‌ అని చెప్పొచ్చు. జామలో కాల్షియం, పొటాషియం, ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ – ఎ, విటమిన్ – బి, ఫైబర్, విటమిన్ – సి ఉంటాయి. ముఖ్యంగా తాజా జామ కాయల్లో ఆరెంజ్‌లో కంటే 6 రెట్లు ఎక్కువ విటమిన్ – సి ఉంటుంది. ఇది ఇమ్యూనిటీని పెంచుతుంది. ఈ కాలంలో తరచుగా ఇబ్బంది పెట్టే జలుబు, ఫ్లూ, ఇన్ఫెక్షన్ల నుంచి జామకాయ రక్షిస్తుంది. జామలో ఫైబర్‌ అధికంగా ఉంటుంది. ఇది బరువును కంట్రోల్‌లో ఉంచుతుంది.

అంజీర్‌:

Fig Fruits, varieties, production, seasonality | Libertyprim

అంజీర్‌లో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది తింటే కడుపు నిండుగా అనిపిస్తుంది, ఆహారం ఎక్కువగా తినకుండా అదుపులో ఉంటాం. దీనిలో ఉండే ఫిసిన్‌‌‌ అనే ఎంజైమ్‌ జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. ఈ కాలంలో అంజీర్‌ తరచుగా తింటే బెల్లీ ఫ్యాట్‌ కరుగుతుంది. అంజీర్‌లో పొటాషియం, సోడియం, ఫాస్పొరిక్ ఆమ్లం, ఐరన్, విటమిన్లు వంటి అనేక పోషకాలు ఉంటాయి. ఈ పండల్లో కేలరీలు తక్కువగా ఉంటాయి. శరీరానికి కావాల్సిన ఆరోగ్యకరమైన శక్తిని అందిస్తాయి. అలా బరువును కంట్రోల్‌లో ఉంచుతాయి.

అనాసపండు:

How Pineapples Can Help Your Skin and Hair

ఆనాసపండులో ఫైబర్‌ అధికంగా ఉంటుంది. ఇది కడుపును ఫిల్లింగ్‌గా ఉంచుతుంది. పైనాపిల్‌లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఎంజైమ్ బ్రోమెలైన్ ఉంటుంది. ఈ ఎంజైమ్ ప్రోటీన్ల జీవక్రియలో సహాయపడుతుంది. ఇది బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. తక్షణ శక్తిని అందించడంలో పైనాపిల్ ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే విటమిన్‌ సీ, యాంటీ ఆక్సీడెంట్లు, ఫైబర్‌ శరీర పనితీరును మెరుగుపరిచేందుకు తోడ్పడుతాయి.

దానిమ్మ:

Benefits of pomegranate for weight loss and glowing skin | HealthShots

దానిమ్మ బరువు తగ్గించడంలో సూపర్‌ ఫ్రూట్‌ అని చెప్పొచ్చు. దానిమ్మలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ పాలీఫెనాల్స్ శరీరంలోని జీవక్రియను పెంచుతాయి. ఇది ధమనుల లిపిడ్ల నిర్మాణాన్ని నిరోధిస్తుంది, చెడు కొలెస్ట్రాల్‌, హానికరమైన టాక్సిన్‌లను తగ్గిస్తుంది. శరీరం అంతటా రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది.

సీతాఫలం:

Health benefits of Custard Apple | Narayana Health

సీతాఫలం పండు టేస్ట్‌లోనే కాదు, పోషకాలూ అద్భుతంగా ఉంటాయి. దీనిలో విటమిన్‌ – సి తోపాటు ఎ, బి, కె విటమిన్లూ, ప్రొటీన్లూ, కాల్షియం, ఫాస్ఫరస్‌, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్‌ వంటి మినరల్స్‌ పుష్కలంగా ఉంటాయి. సీతాఫలంలో ఉండే విటమిన్‌ బి6 కడుపుబ్బరం, అజీర్తి, అల్సర్లు వంటి సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుంది.

స్టార్‌ ఫ్రూట్‌:

Kamrakh | कमरख (Star Fruit in Hindi) के फायदे और नुकसान - 1mg

స్టార్‌ ఫ్రూట్‌లో కేలరీలు తక్కువగా ఉంటాయి, ఫైబర్‌ అధికంగా ఉంటుంది. స్టార్ ఫ్రూట్‌ లోని ఫైబర్ జీవక్రియను మెరుగుపరుస్తుంది. మన కడుపు సంతృప్తిగా ఉంటుంది, ఆకలిని తగ్గిస్తుంది. దీంతో బరువు తగ్గడంలో సహాయపడుతుంది. స్టార్ ఫ్రూట్‌ లోని సహజమైన డైటరీ ఫైబర్ కంటెంట్ ఉబ్బరం, ఎసిడిటీ, ఇన్ఫ్లమేషన్‌, అతిసారం, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.

ద్రాక్ష:

All About Grapes - How to Pick, Prepare & Store | Healthy Family Project

ద్రాక్షలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి, కరిగే ఫైబర్‌ అధికంగా ఉంటుంది. ఇది బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. శీతాకాలంలో (Winter) షుగర్‌ పేషెంట్స్‌ ఈ పండు తింటే షుగర్‌ కంట్రోల్‌లో ఉంటుంది. దీనిలో విటమిన్‌ – సీ మెండుగా ఉంటుంది. ఇమ్యూనిటీని పెంచడంలో ఇది సహాయపడుతుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • benefits
  • food
  • health
  • healthy food
  • Life Style
  • weight loss
  • winter

Related News

7 Tips to Curb Insomnia for Stress Management

Stress Management Tips: స్ట్రెస్ మేనేజ్‌మెంట్ కోసం.. నిద్రలేమిని అరికట్టే 7 టిప్స్

Stress Management: “ఒత్తిడి” అనేది మనం చేసే రోజువారీ కార్యకలాపాలకు శరీరం యొక్క సహజ ప్రతిస్పందన. రోజూ సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల కూడా ఒత్తిడి పెరుగుతుంది. నిద్రలేమి వల్ల కలిగే అలసట మిమ్మల్ని ఒత్తిడిలోకి నెట్టేస్తుంది. నిద్రలేమి సమస్యకు గల ప్రధాన కారణాల్లో ముఖ్యమైనది ఫోన్‌కు అడిక్ట్ కావడం. నిద్రపోవడానికి ముందు వరకు ఫోన్‌లో మునిగిపోవడం అనేది మీ నిద్ర నాణ్యతను దెబ్బతీస్తుంది.

  • Don't worry about low sperm count... follow these Ayurvedic tips and you'll be at the peak of virility...!!

    Sperm Count In Men: స్పెర్మ్ కౌంట్ తగ్గిందని బాధపడకండి… ఆయుర్వేదంలో ఈ చిట్కాలు పాటిస్తే మీరే మగమహారాజు…!!

Latest News

  • Revanth Reddy: “తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటాను”

  • Bandi Bhageerath: బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు

  • BSNL శాటిలైట్ ఫోన్‌ను విడుదల చేసింది

  • Musi Riverfront: మూసీ పునరుజ్జీవనానికి గ్రీన్ సిగ్నల్.. రూ.7 వేల కోట్లతో ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం

  • Buggana Rajendranath: సీఎం చంద్రబాబు వల్లే వర్షాలు పడడం లేదు మాజీ మంత్రి

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd