HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Life Style
  • >To Increase Your Bodys Stamina Eat These Foods

Stamina Boosters : మీ శరీరం యొక్క స్టామినా పెంచుకోవాలంటే…

చాలా మందికి, కొంత దూరం పరిగెట్టిన వెంటనే ఆయాసం (Fatigue) వస్తుంది, పరిగెట్టలేక ఒక చోట కూర్చుండి పోతారు.

  • Author : Maheswara Rao Nadella Date : 25-12-2022 - 9:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Stamina Boosters
Stamina Boosters

వెయిట్‌ లాస్‌కు ప్రయత్నిస్తున్న వాళ్లకు రన్నింగ్‌ చాలా ముఖ్యమైన వ్యాయామం. చాలా మంది వేరే వర్క్‌ అవుట్స్‌‌ కంటే రన్నింకే‌ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఎందుకంటే దీనికో పెద్ద క్యాలిక్యులేషన్స్, పెద్ద పెద్ద ఎక్విప్మెంట్‌ అవసరం లేదు. చక్కగా ఏ పార్కులోనే, ఖాళీగా ఉండే రోడ్డు పక్కన హాయిగా రన్నింగ్‌ చేయవచ్చు. కానీ చాలా మందికి, కొంత దూరం పరిగెట్టిన వెంటనే ఆయాసం వస్తుంది, పరిగెట్టలేక ఒక చోట కూర్చుండి పోతారు. వాళ్ల స్టామినా (Stamina) కొంతసేపటికే పూర్తైపోతుంది. పరిగెత్తడానికే కాదు, మనం ఏపని పూర్తి చేయడానికైనా స్టామినా అవసరం. మనకు స్టామినా సరిగ్గా లేకపోతే అనుకున్న ఏ ఒక్క పని సంతృప్తిగా, సంపూర్తిగా అవ్వదు. మనకు స్టామినా (Stamina) ఎక్కువగా ఉండాలంటే మన డైట్‌లో పోషకాహారం తీసుకుంటూ, క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ ఉండాలి.

స్టామినా (Stamina) అంటే ఏమిటి?

10 Simple Tips to Improve Your Running Stamina

ఎక్కువ సమయంపాటు శారీరక, మానసిక పనులు చేయడానికి మనకు సహకరించే బలం, శక్తిని స్టామినా అంటారు. మీకు పనిలో ఎదురయ్యే ఒత్తిడి, అసౌకర్యాన్ని ఎదుర్కోవడానికి, శక్తిని పెంచుకోవడానికి స్టామినా సహాయపడుతుంది. ఇది అలసట, నిస్సత్తువను దూరం చేస్తుంది. మరి స్టామినా పెరగాలంటే ఏం తినాలో తెలుసుకుందామా?

బీట్‌ రూట్‌ (Beetroot):

Health benefits of beetroot | Stamina Booster

NCBIలో ప్రచురించిన నివేదిక ప్రకారం, బీట్‌రూట్ అథ్లెట్‌కు సూపర్‌ ఫుడ్‌లా సహాయపడుతుంది. ఇందులో ఉండే నైట్రేట్లు గుండె ఆరోగ్యాన్ని రక్షిస్తాయి, రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. మీరు స్టామినా పెంచుకోవాలంటే.. మీ డైట్‌లో తరచుగా బీట్‌ రూట్‌ చేర్చుకుంటే మంచిది. దీనిలో శరీరానికి మేలు చేసే పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది మీరు వేగంగా, ఎక్కువ సేపు పరిగెత్తడానికి, ఏదైనా పని చేయడానికి సహాయపడతాయి. బీట్‌రూట్‌ మన శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్‌ను ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. బీట్‌ రూట్‌‌‌‌‌‌‌ వ్యక్తి పనితీరును మెరుగుపరుస్తుందని నిపుణులు చెబుతున్నారు. మీరు ప్రతి రోజూ బీట్‌ జ్యాస్‌ చేసుకుని తాగితే మంచిది.

ఓట్స్‌ (Oats):

How much protein is in oats? | White's Oats | White's Oats

మీరు ఉదయం పూట లాంగ్‌ రన్‌కు వెళ్తుంటే.. మంచి కార్బ్స్ ఉన్న ఓట్స్‌ను మీ డైట్‌లో చేర్చుకోండి. బరువు తగ్గాలనుకునేవారికి కార్బోహైడ్రైట్లు మంచివి కావని అందరూ అనుకుంటారు, కాని ఇది అన్ని సందర్భాల్లోనూ నిజం కాదు. అన్ని పిండి పదార్థాలు చెడ్డవి కాదని మీరు గుర్తుంచుకోవాలి. మీరు బరువు తగ్గడానికి, స్టామినా పెంచుకోవడానికి సరైన కార్బ్స్‌ ఉన్న ఆహార పదార్థాలను ఎంచుకోవాలి. ఓట్స్‌లో గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ తక్కువగా ఉంటుంది. బరువు తగ్గడానికి బెస్ట్‌ ఛాయిస్‌. ఓట్స్‌ రక్తంలోని చక్కెర స్థాయిలను కంట్రోల్‌లో ఉంచుతాయి. ఓట్స్ మిమ్మల్ని చాలా సమయం పాటు ఎనర్జీటిక్‌గా, ఫిల్లింగ్‌గా ఉంచుతాయి. మీరు తరచూ ఓట్స్‌ తీసుకుంటే, మీ స్టామినా పెరుగుతుంది.

అరటిపండు (Banana):

Banana benefits for male it increase stamina libido treat erectile  dysfunction shighrapatan and fat loos SMI

NIHలో ప్రచురించినఒక అధ్యయనం ప్రకారం, వ్యాయామానికి ముందు అరటిపండు తీసుకుంటే శక్తి లభిస్తుంది. అరటిలో ఫైబర్, కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. మీరు ఏదైనా రేస్‌లో, స్పోర్ట్‌ కాంపిటిషన్‌లో పాల్గొనే ముందు స్పోర్ట్స్ డ్రింక్ తీసుకోవడం కంటే అరటిపండు తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. అరటి శక్తిని పెంచడమే కాదు, శరీరానికి ఎన్నో పోషకాలు అందిస్తుంది. దీనిలో కొవ్వులు, కార్బ్స్‌, ఫైబర్‌‌, పొటాషియం, ఫాస్ఫరస్‌, పెప్టిన్‌, సుక్రోజ్‌, ఫ్రక్టోజ్‌, గ్లూకోజ్‌, విటమిన్‌-సి, విటమిన్‌-బి6 పుష్కలంగా ఉంటాయి. దీనిలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది, డీహైడ్రేషన్‌, నొప్పుల నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది.

బ్రౌన్‌ రైస్‌ (Brown Rice):

brown rice | Stock image | Colourbox

బ్రౌన్ రైస్‌లో స్టార్చ్ తక్కువగా ఉంటుంది, ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణం కావడానికి వైట్ రైస్ కంటే ఎక్కువ సమయం తీసుకుంటుంది. ఇది మీ కడుపుని చాలా కాలం పాటు నిండుగా ఉంచుతుంది. బ్రౌన్‌ రైస్‌ తీసుకుంటే.. మన బాడీ స్టామినా కూడా పెరుగుతుంది.

పాలకూర (Spinach):

Benefits of Spinach And Its Side Effects | Lybrate

నీరసం, అలసట, నిస్సత్తువకు ప్రాధాన కారణం పోషకాల లోపం. వేగంగా పరిగెత్తడానికి, పనులు చేయడానికి, దూర ప్రయాణాలు చేయడానికి పోషక ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. మీ స్టామినా పెంచడానికి పాలకూర అద్భుతంగా సహాయపడుతుంది. పాల కూరలో విటమిన్ ఎ, సి, ఇ, కె, ఐరన్‌ పుష్కలంగా ఉన్నాయి. ఇవి మిమ్మల్ని ఫిట్‌గా ఉంచడంలో తోడ్పడతాయి. మీరు తరచుగా పాలకూర తీసుకుంటే మీ స్టామినా పెరుగుతుంది.

Also Read;  Skin Health Tips : మీ స్కిన్ మెరిసిపోవాలంటే ఇలా చేయండి..


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • benefits
  • Body Stamina
  • exercise
  • food
  • Habits
  • health
  • Life Style
  • weight loss

Related News

Gut Health

Gut Health: పేగుల్లో మంచి బ్యాక్టీరియాను పెంచే ఆహారాలు ఇవే.. తినాల్సిన ఫుడ్స్

Gut Health మన పేగులు ఆహారాన్ని జీర్ణం చేయడంలో సాయపడటమే కాకుండా రోగనిరోధక శక్తిని పెంచడంలో, శరీర శక్తిని కాపాడుకోవడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఆరోగ్యకరమైన గట్ హెల్తీ లైఫ్‌స్టైల్‌కు సంకేతం. అయితే, కొన్నిసార్లు పేలవమైన ఆహారపు అలవాట్లు, అధిక ఒత్తిడి, అనారోగ్యకరమైన జీవనశైలి పేగు ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. అందుకే సరైన పోషకాహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం. ఆరోగ్యకరమైన పేగును

    Latest News

    • Dry Skin : మీరు పొడి చర్మం తో బాధపడుతున్నారా..? అయితే ఇలా చెయ్యండి !

    • ఐపీఎల్ 2026.. చెన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ విజ‌యం!!

    • సూర్యవంశీ శివతాండవం.. 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ!!

    • పెద్ది సినిమా వాయిదా? నిర్మాత ఏం చెప్పారంటే?!

    • వివాహిత స్త్రీ ద‌గ్గ‌ర ఎంత బంగారం ఉండొచ్చు?

    Trending News

      • రూ. 25.20 కోట్లకు కొనుగోలు.. బౌలింగ్‌కు దూరంగా ఆల్‌రౌండ‌ర్‌?!

      • Green S** : పర్యావరణ హిత శృంగారాన్ని కోరుకుంటున్న యువత ..ఏంటి పర్యావరణ హిత శృంగారం ?

      • నేడు సీఎస్కే- ఆర్ఆర్ మ‌ధ్య పోరు.. హెడ్-టు-హెడ్ రికార్డులివే!!

      • AP Assembly: అమరావతికి చట్టబద్ధత

      • Allahabad High Court: పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం తప్పు కాదు: అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd