HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Life Style
  • >Thyroid Patients Lose Weight Only If They Eat These

Thyroid Patients: ఇవి తింటేనే థైరాయిడ్‌ పేషెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బరువు తగ్గుతారు

హైపోథైరాయిడిజం పేషెంట్స్‌ బరువును కంట్రోల్‌లో ఉంచుకోవడానికి.. లైఫ్‌స్టైల్‌లో మార్పులు చేసుకోవాలి, పోషకాహారం తీసుకోవాలి,

  • Author : Maheswara Rao Nadella Date : 25-02-2023 - 8:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Thyroid Issues
Thyroid Issues

ఒక దశాబ్దకాలంగా థైరాయిడ్‌ సమస్య (Thyroid Patients) ఎక్కువుతోంది. అంచనా ప్రకారం, భారతదేశంలో దాదాపు 42 మిలియన్ల మంది ప్రజలు థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారు. పురుషుల కంటే స్త్రీలలో థైరాయిడ్‌ సమస్య ఎక్కువగా ఉంటుంది. జీవనశైలి మార్పులు, చెడు ఆహార అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం వల్ల థైరాయిడ్‌ సమస్య ఎక్కువైంది. కొన్నిసార్లు ఈ సమస్య వంశపారంపర్యంగా రావచ్చు. శరీర జీవక్రియల్ని నియంత్రించే అతి ముఖ్యమైన గ్రంథి థైరాయిడ్‌ (Thyroid). శ్వాసవ్యవస్థ, గుండె, నాడీ, జీర్ణవ్యవస్థ, సంతానోత్పత్తి వ్యవస్థ.. ఇలా చాలా వాటిపై థైరాయిడ్ హార్మోన్‌ ప్రభావం ఉంటుంది. హైపోథలామస్, పిట్యూటరీ, థైరాయిడ్ వ్యవస్థలలో మార్పులు రావడం వల్ల థైరాయిడ్ గ్రంథి పనితీరులో మార్పులు వచ్చి.. హైపర్ థైరాయిడిజమ్, హైపోథైరాయిడిజం వంటి సమస్యలు వస్తాయి.

హైపోథైరాయిడిజం (Hypothyroidism):

హైపోథైరాయిడిజంలో శరీరానికి కావాల్సిన దానికంటే తక్కువ మోతాదులో థైరాయిడ్ గ్రంథి థైరాక్సిన్‌ను ఉత్పత్తి చేయడం వల్ల ఈ సమస్య వస్తుంది. టి3, టి4 హార్మోన్లు తగ్గుతాయి. టీఎస్‌హెచ్ పెరుగుతుంది. ఈ మార్పులతో జీవక్రియ పనితీరు మందగిస్తుంది. శరీరంలో చురుకుదనం తగ్గుతుంది. మలబద్ధకం, గుండె కొట్టుకునే వేగం తగ్గడం, విపరీతమైన ఒళ్లు నొప్పులు, గోళ్లు విరిగిపోయినట్లు కనిపించడం, డిప్రెషన్.. పిల్లలు కలగకపోవడం, రక్తహీనత, నెలసరి సమయంలో రక్తస్రావం ఎక్కువ కావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. హైపోథైరాయిడిజం కారణంగా.. వేగంగా బరువు పెరుగుతారు. హైపోథైరాయిడిజం పేషెంట్స్‌ (Thyroid Patients) బరువును కంట్రోల్‌లో ఉంచుకోవడానికి.. లైఫ్‌స్టైల్‌లో మార్పులు చేసుకోవాలి, పోషకాహారం తీసుకోవాలి, క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. మీ డైట్‌లో కొన్ని ఆహారం పదార్థాలు చేర్చుకుంటే.. బరువును కంట్రోల్‌లో ఉంచుకోవచ్చు.

నట్స్‌ (Nuts):

NCBI నివేదిక ప్రకారం,నట్స్‌ బరువు తగ్గడానికి సహాయపడతాయి. నట్స్‌లో సెలీనియం, జింక్ పుష్కలంగా ఉంటాయి. సెలీనియం.. థైరాయిడ్‌ గ్రంధి పనితీరుకు అవసరమైన సూక్ష్మపోషకం. T4ని T3గా మార్చడానికి సెలీనియం అవసరం. ముఖ్యంగా బ్రెజిలియన్ బీటెల్‌ నట్‌లో సెలీనియం మెండుగా ఉంటుంది. రోజుకు మూడు బ్రెజిలియన్‌ బీటెల్‌ నట్ తీసుకుంటే థైరాయిడ్ గ్రంధి పనితీరు మెరుగుపడుతుంది. బ్రెజిలియన్ బీటెల్‌ నట్‌లో మెగ్నీషియం కూడా పుష్కలంగా ఉంటుంది. చియా సీడ్స్‌, గుమ్మడి గింజల్లోనూ జింక్‌ సమృద్ధిగా ఉంటుంది. ఇవి థైరాయిడ్‌ గ్రంథి పనితీరు మెరుగుపరుస్తుంది.

బీన్స్‌, పప్పుధాన్యాలు:

బీన్స్‌, పప్పుధాన్యాలలో.. ప్రోటీన్లు, యాంటీఆక్సిడెంట్లు, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు, మినరల్స్‌ పుష్కలంగా ఉంటాయి. ఇవి థైరాయిడ్‌ గ్రంధి మెరుగైన పనితీరుకు సహాయపడతాయి. శరీరంలో జీవక్రియను కూడా మెరుగుపరుస్తాయి. ఇవి బరువు తగ్గే ప్రక్రియను వేగవంతం చేస్తాయి. మీ డైట్‌లో పెసరల్లు, శనగాలు, బీన్స్‌, చిక్కుళ్లు వంటి ఆహారం ఎక్కువగా చేర్చుకోండి.

గుడ్లు (Eggs):

పబ్మెడ్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం, మీరు హైపోథైరాయిడిజంతో బాధపడుతుంటే.. బరువును కంట్రోల్‌లో ఉంచుకోవడానికి గుడ్లు బెస్ట్‌ ఆప్షన్‌. గుడ్డు పచ్చసొనలో.. జింక్‌ సెలీనియం, ప్రోటీన్‌ పుష్కలంగా ఉంటాయి. ఇవి థైరాయిడ్‌ పనితీరును మెరుగుపరచడంతో పాటు.. బరువును నియంత్రణలో ఉంచుతాయి.

తాజా ఆకుకూరలు, తాజా కూరగాయలు:

తాజా ఆకుకూరలు, తాజా కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో విటమిన్ సి, ప్రోటీన్, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి థైరాయిడ్ పనితీరును మెరుగుపరుస్తాయి. దీంతోపాటు, బరువు పెరగడం వంటి లక్షణాలను నియంత్రిస్తాయి. మీ డైట్‌లో టమాటా, క్యాప్సికమ్, ముల్లంగి, క్యాబేజీ, ఆకుకూరలు చేర్చుకుంటే.. బరువు కంట్రోల్‌లో ఉంటుంది.

కొబ్బరి (Coconut):

పచ్చి కొబ్బరి లేదా కొబ్బరి నూనె థైరాయిడ్ రోగులకు ఉత్తమ ఆహారం. ఇది జీవక్రియను మెరుగుపరుస్తుంది. కొబ్బరిలో ఫ్యాటీ యాసిడ్స్, ట్రైగ్లిజరాయిడ్‌లు సమృద్ధిగా ఉంటాయి, ఇవి జీవక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి.

నీరు ఎక్కువగా తాగండి:

మీరు త్వరగా బరువు తగ్గాలనుకుంటే, నీరు ఎక్కువగా తీసుకోండి. నీరు ఎక్కువగా తీసుకుంటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది, శరీరం నుంచి టాక్సిన్స్‌ తొలగుతాయి. నీరు ఎక్కువగా తాగితే మీ ఆకలి కూడా తగ్గుతుంది. ఇది దీర్ఘకాలంలో బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

Also Read:  Blood: ఈ ఆహార పదార్థాలు తింటే మీ రక్తం శుద్ధి అవుతుంది, హిమోగ్లోబిన్ లెవెల్ కూడా పెరుగుతుంది


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • benefits
  • Eat
  • Eating
  • exercises
  • health
  • Life Style
  • Patients
  • Thyroid
  • tips
  • Tricks
  • weight loss

Related News

7 Tips to Curb Insomnia for Stress Management

Stress Management Tips: స్ట్రెస్ మేనేజ్‌మెంట్ కోసం.. నిద్రలేమిని అరికట్టే 7 టిప్స్

Stress Management: “ఒత్తిడి” అనేది మనం చేసే రోజువారీ కార్యకలాపాలకు శరీరం యొక్క సహజ ప్రతిస్పందన. రోజూ సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల కూడా ఒత్తిడి పెరుగుతుంది. నిద్రలేమి వల్ల కలిగే అలసట మిమ్మల్ని ఒత్తిడిలోకి నెట్టేస్తుంది. నిద్రలేమి సమస్యకు గల ప్రధాన కారణాల్లో ముఖ్యమైనది ఫోన్‌కు అడిక్ట్ కావడం. నిద్రపోవడానికి ముందు వరకు ఫోన్‌లో మునిగిపోవడం అనేది మీ నిద్ర నాణ్యతను దెబ్బతీస్తుంది.

  • Don't worry about low sperm count... follow these Ayurvedic tips and you'll be at the peak of virility...!!

    Sperm Count In Men: స్పెర్మ్ కౌంట్ తగ్గిందని బాధపడకండి… ఆయుర్వేదంలో ఈ చిట్కాలు పాటిస్తే మీరే మగమహారాజు…!!

Latest News

  • Medicines Prices: సామాన్యుడికి భారీ ఉపశమనం.. 39 మందుల ధరలను నిర్ణయించిన ప్రభుత్వం

  • Kadapa: బ్రహ్మణి స్టీల్స్ భూములు పై ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం

  • H-1B: హెచ్-1 బీ, గ్రీన్ కార్డ్ అభ్యర్థులకు అలర్ట్.. ఇకపై కొత్త రూల్స్..!

  • CM Chandrababu: బీసీలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..

  • Ram Temple: రామమందిర ట్రస్ట్.. కార్పొరేట్ తరహా ప్రక్షాళనపై దృష్టి

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd