HashtagU Telugu
HashtagU Telugu Telugu HashtagU Telugu
  • English
  • हिंदी
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
News
CloseIcon
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # CM Jagan
  • # Business
  • # Jobs
  • # Telangana Formation Day

  • Telugu News
  • ⁄Life Style
  • ⁄Sleep Tourism Is Calling

Sleep Tourism: స్లీప్ టూరిజం పిలుస్తోంది..

ఏ మనిషికైనా కావలసింది రెండు అవసరాలు. ఒకటి మంచి విశ్రాంతి. రెండు మంచి నిద్ర. ఆరోగ్యమే మహా భాగ్యం అన్నారు.

  • By Maheswara Rao Nadella Published Date - 08:00 PM, Wed - 1 March 23
  • daily-hunt
Sleep Tourism: స్లీప్ టూరిజం పిలుస్తోంది..

ఏ మనిషికైనా కావలసింది రెండు అవసరాలు. ఒకటి మంచి విశ్రాంతి. రెండు మంచి నిద్ర. ఆరోగ్యమే మహా భాగ్యం అన్నారు. మంచి నిద్ర (Sleep) వల్లే మంచి ఆరోగ్యం ఉంటుంది. నిద్ర పట్టకపోవడం కంటి నిండా నిద్ర లేదనే బాధ ఉండటం మంచిది కాదు. స్థలం మారిస్తే ఆరోగ్యం బాగుపడినట్టు స్థలం మారిస్తే మంచి నిద్ర పట్టొచ్చు. అంతే కాదు పోటీ ప్రపంచానికి దూరంగా ఒత్తిడి లేకుండా విశ్రాంతి కూడా తీసుకోవచ్చు.కాబట్టి ఈ కొత్త ట్రెండ్‌కు స్వాగతం చెప్పండి. మీకు నిద్రలేమి బాధ ఉంటే గనుక వెంటనే బ్యాగ్‌ సర్దుకోండి.

టూరిజం రూపు రేఖలు మారుతున్నాయి. సస్టెయినబుల్ టూరిజం, ఫుడ్ టూరిజం, ఎక్స్‌పరిమెంటల్ టూరిజం, వెల్‌నెస్ టూరిజం ఇలా ఎన్నో వచ్చాయి. ఇప్పుడు స్లీప్ టూరిజం (Sleep Tourism) పై చర్చ జరుగుతోంది. ఎక్కడికైనా టూర్ కు వెళ్లి ప్రశాంతంగా నిద్రపోవడమే స్లీప్ టూరిజం. దీనివల్ల గజిబిజి లైఫ్‌ నుంచి కాస్త రిలాక్సేషన్‌ లభిస్తుంది. ఈ మధ్య యువత ప్రధానంగా ఈ స్లీప్ టూరిజంపై ఆసక్తి చూపుతోంది. మన దేశంలో స్లీప్ టూరిజం (Sleep Tourism) సేవలు పొందే ప్రదేశాల గురించి తెలుసుకుందాం.

పెల్లింగ్

సిక్కిం రాజధాని గ్యాంగ్‌టాక్‌కు 120 కిలోమీటర్ల దూరంలో ఉండే పెల్లింగ్ హ్యాపీగా నిద్రపోడానికి అనుకూలంగా ఉంటుంది. చుట్టూ పచ్చదనం, అందమైన కొండలు, లోయలు, అద్భుతమైన లొకేషన్లు పెల్లింగ్‌ని ప్రత్యేకంగా నిలుపుతాయి.

దువార్స్

పశ్చిమ బెంగాల్‌లోని దువార్స్ అనే పట్టణం అత్యంత రమణీయంగా ఉంటుంది. అక్కడ ఉండే తేయాకు తోటలు ఈ ప్రాంతంలోని అందాలను రెట్టింపు చేస్తాయి. ఇక్కడ మంచి రిసార్టులు కూడా ఉంటాయి. దీంతో స్లీప్ టూరిజాన్ని కోరుకునేవారికి అది సరైన గమ్యస్థానం.

నాకో

హిమాచల్ ప్రదేశ్‌లోని పిన్ డ్రాప్ సైలెన్స్ ప్రాంతంగా గుర్తింపు పొందిన నాకో అనే హిల్‌స్టేషన్ కూడా స్లీప్ టూరిజానికి అనువుగా ఉంటుంది. ఇక్కడ ఎంత చిన్న శబ్దమైనా చాలా దూరం వినిపిస్తుందని అంటారు. ఇక్కడ హాయిగా నిద్రపోవచ్చు.

అలెప్పీ

కేరళలోని అలెప్పీ అందమైన పర్యాటక ప్రదేశం. ఇక్కడి బ్యాక్ వాటర్స్ అందాల కారణంగా కేవలం రొమాంటిక్ ట్రిప్‌లకే కాకుండా ప్రకృతి ఒడిలో సేదతీరేందుకు కూడా ఇది అనువైన ప్రదేశం. అలాంటి చోట హౌస్‌బోట్లలో హాయిగా నిద్రపోవచ్చు.

లేహ్, లద్ధాఖ్

కేంద్రపాలిత ప్రాంతమైన లేహ్, లద్ధాఖ్ చూడాలని కోరుకోని పర్యాటకులు ఉండరు. అక్కడి కొండలు, లోయలు, అందమైన సరస్సులు, ప్రశాంతమైన వాతావరణం ఇట్టే మంత్రముగ్ధులను చేస్తాయి. అలాంటి చోట టూర్ కు వెళ్లి హాయిగా నిద్రపోవచ్చు.

Also Read:  Fruit Juice: ఫ్రూట్ జ్యూస్ ఆరోగ్యానికి హాని చేస్తుందా? 5 సందర్భాలలో దాన్ని తాగొద్దు

Telegram Channel

Tags  

  • Calling
  • Life Style
  • sleep
  • tips
  • tourism
  • travel
  • Tricks
  • wild life
https://d31dai02dmgobf.cloudfront.net/wp-content/uploads/2022/03/divis-ad.jpeg

Related News

Eye View : ఒక్క లుక్ లో సిటీ మొత్తం చూడొచ్చు.. మహానగరంలో జెయింట్ వీల్

Eye View : ఒక్క లుక్ లో సిటీ మొత్తం చూడొచ్చు.. మహానగరంలో జెయింట్ వీల్

ఎన్ని విమానాలు వచ్చినా.. ఎన్ని పారచూట్లు వచ్చినా.. మానవుడి ఆ ఒక్క కోరిక నెరవేరలేదు. ఆకాశంలో పక్షిలా ఎగరగలిగితే  బాగుండు అని మనిషి అనుకుంటూ ఉంటాడు !! మనకు రెక్కలు రావడం ..మనం గగన వీధిలో రివ్వున ఎగరడం జరిగే పని కాదు !!కానీ రెక్కల పక్షిలా.. ఆకాశ వీధి నుంచి ఒక సిటీ వ్యూని(Eye View) చూసే అవకాశం ఒకటి ఉంది. 

  • Summer Car Tips: వేసవిలో కార్ లోపల చల్లగా మార్చుకోండిలా!

    Summer Car Tips: వేసవిలో కార్ లోపల చల్లగా మార్చుకోండిలా!

  • Workouts @ Home: ఇంటి దగ్గరే చేసుకోగలిగే 15 ఈజీ బైసెప్ వర్కౌట్స్ ఇవిగో..

    Workouts @ Home: ఇంటి దగ్గరే చేసుకోగలిగే 15 ఈజీ బైసెప్ వర్కౌట్స్ ఇవిగో..

  • Keto Diet: “కీటో డైట్” ఏం తినాలి.. ఏం తినొద్దు?

    Keto Diet: “కీటో డైట్” ఏం తినాలి.. ఏం తినొద్దు?

  • Diabetes Patients Be-Careful: షుగర్ రోగులూ.. కండ్లు పోతాయ్! తస్మాత్ జాగ్రత్త..

    Diabetes Patients Be-Careful: షుగర్ రోగులూ.. కండ్లు పోతాయ్! తస్మాత్ జాగ్రత్త..

Latest News

  • MS Dhoni Tears: ధోనీ కళ్ళలో నీళ్లు.. వీడియో వైరల్

  • Dhoni Autograph: ధోని ఆటోగ్రాఫ్ కోసం చాహర్ చిన్నపిల్లాడి చేష్టలు

  • Manipur Violence: మణిపూర్ హింసాకాండ…రంగంలోకి దిగిన అమిత్ షా

  • WTC 2023 Final: ఇంగ్లిష్ గడ్డపై అడుగుపెట్టిన టీమిండియా

  • Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధానికి టిక్ టాకర్ ప్రపోజల్.. నాలుగో భార్యనవుతా అంటూ?

Trending

    • Netaji Grandson Vs Savarkar Movie : సావర్కర్ మూవీపై నేతాజీ ముని మనవడు ఫైర్

    • Drugs In Soap Cases : వామ్మో.. సబ్బు పెట్టెల్లో కోట్ల డ్రగ్స్

    • Shocking: పెళ్లి కొడుకుకు షాక్ ఇచ్చిన పెళ్లికూతురు.. బంగారం, డబ్బుతో పరార్

    • Condoms-Wedding Kit : ప్రభుత్వ వెడ్డింగ్ కిట్ లో.. కండోమ్స్, గర్భనిరోధక మాత్రలు

    • Medals In Ganga : గంగలో మెడల్స్..నిమజ్జనానికి బయలుదేరిన రెజ్లర్లు

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd
  • Follow us on:
Go to mobile version