Parenting Tips: మీ పిల్లలు బుద్ధిమంతులుగా ఉండాలా? అయితే ఈ టిప్స్ మీకోసమే!
నేటి సమజాంలో ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు మంచిగా పెరిగి పెద్దవారవ్వాలని కోరుకుంటారు. కానీ, పిల్లల పెంపకంలో చాలా తప్పిదాలు జరుగుతుంటాయి. ఇవి పిల్లలపై తీవ్రంగా ప్రభావం చూపే అవకాశం ఉంది.
- By Gopichand Published Date - 07:20 PM, Thu - 17 July 25

Parenting Tips: నేటి సమజాంలో ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు మంచిగా పెరిగి పెద్దవారవ్వాలని కోరుకుంటారు. కానీ, పిల్లల పెంపకంలో చాలా తప్పిదాలు జరుగుతుంటాయి. ఇవి పిల్లలపై తీవ్రంగా ప్రభావం చూపే అవకాశం ఉంది. పిల్లల మంచి పెంపకం కోసం తల్లిదండ్రులు అనేక పేరెంటింగ్ చిట్కాలను గమనించాలి. ఈ పేరెంటింగ్ విషయాలను గమనిస్తే మీరు అరవకుండా లేదా కేకలు వేయకుండానే పిల్లలను బాగా పెంచవచ్చు. ఈ ప్రభావవంతమైన పేరెంటింగ్ చిట్కాల (Parenting Tips) గురించి ఈరోజు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం!
పిల్లల కోసం పేరెంటింగ్ చిట్కాలు
వివరించండి, సరైన దిశను చూపండి
తల్లిదండ్రులు తరచూ పిల్లల విజయం కోసం తహతహలాడుతారు. కానీ అలా చేయడం వల్ల పిల్లవాడు విజయవంతం కాడు. మీరు పిల్లవాడికి సంబంధిత విషయంపై పూర్తిగా వివరించాలి. సరైన దిశను చూపించాలి. ఆ తర్వాత అతను తన కృషితో విజయం సాధిస్తాడు.
ఆంక్షలు పెట్టకండి
చాలా మంది తల్లిదండ్రులు పిల్లలపై అనేక ఆంక్షలు విధిస్తారు. కానీ అలా చేయడం చాలా పెద్ద తప్పు. మీరు పిల్లలను స్వయం సంరక్షణలో సమర్థులుగా తీర్చిదిద్దాలి. వారికి ఫ్రీడమ్ ఇవ్వండి. అలాగే వారు చేస్తున్న కార్యకలాపాలపై దృష్టి ఉంచండి.
Also Read: BCCI Pension Policy: టీమిండియా ఆటగాళ్లు బీసీసీఐ నుంచి పెన్షన్ పొందడానికి అర్హతలీవే!
పిల్లల పట్ల ప్రేమను చూపండి
తల్లిదండ్రులు పిల్లలను ప్రేమిస్తారు. కానీ ఆ ప్రేమను వ్యక్తపరచరు. ఇలాంటి సందర్భాలలో పిల్లలు ఒంటరిగా భావిస్తారు. మీరు పిల్లలను ప్రేమతో సంరక్షించాలి. రోజులో కొంతసమయం పిల్లలపై మీ ప్రేమను చూపించండి. వారితో సమయం గడుపుతూ వారిని నవ్వించండి.
పిల్లలకు తప్పులను వివరించండి
పిల్లలు ఏదైనా తప్పు చేస్తే ఆ విషయాన్ని వారికి ప్రేమతో వివరించాలి. కేకలు వేయడం లేదా కొట్టడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. మీరు అలా చేస్తే పిల్లలు తమ తప్పును ఒప్పుకోవడం మానేసి, అబద్ధం చెప్పడం ప్రారంభిస్తారు.