Paneer Fried Rice: వెరైటీగా ఉండే పన్నీర్ ఫ్రైడ్ రైస్.. సింపుల్ గా ఇంట్లోనే చేసుకోండిలా?
మామూలుగా మనం పన్నీర్ ని ఎన్నో రకాల వంటల్లో ఉపయోగిస్తూ ఉంటాం. ఈ మధ్యకాలంలో పన్నీర్ లేకుండా చాలా రకాల వంటకాలను అస్సలు చేయడం
- By Nakshatra Published Date - 06:30 PM, Sun - 17 December 23
మామూలుగా మనం పన్నీర్ ని ఎన్నో రకాల వంటల్లో ఉపయోగిస్తూ ఉంటాం. ఈ మధ్యకాలంలో పన్నీర్ లేకుండా చాలా రకాల వంటకాలను అస్సలు చేయడం లేదు. అయితే ఎప్పుడైనా కూడా పన్నీర్ ఫ్రైడ్ రైస్ తిన్నారా. వినడానికి కాస్త వెరైటీగా ఉంది కదూ. మరి ఈ రెసిపీని ఇంట్లోనే సింపుల్ ఎలా తయారు చేసుకోవాలి? అందుకు ఏ ఏ పదార్థాలు కావాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
పన్నీర్ ఫ్రైడ్ రైస్ కి కావలసిన పదార్థాలు:
బాస్మతీ బియ్యం – 1 కప్పు
పన్నీర్ తురుము – 1 కప్పు
క్యాప్సికమ్ ముక్కలు – పావుకప్పు
క్యారెట్ ముక్కలు – పావుకప్పు
బీన్స్ ముక్కలు – పావుకప్పు
ఉల్లిపాయ – 1
ఉల్లికాడలు – 3
తరిగిన వెల్లుల్లి – 1 చెంచా
నూనె – 2 చెంచాలు
చిల్లీ సాస్ – 2 చెంచాలు
సోయా సాస్ – 2 చెంచాలు
వెనిగర్ – 2 చెంచాలు
మిరియాల పొడి – 1 చెంచా
ఉప్పు – తగినంత
పన్నీర్ ఫ్రైడ్ రైస్ తయారీ విధానం:
బాస్మతీ బియ్యాన్ని శుభ్రంగా కడిగి, అన్నం వండి పెట్టుకోవాలి. అన్నం ముద్దగా కాకుండా కాస్త పొడిపొడిగా ఉండేలా చూసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ, ఉల్లికాడల్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. స్టౌ మీద కడాయి పెట్టి నూనె వేయాలి. వేడెక్కాక వెల్లుల్లి తురుము వేసి వేయించాలి. రంగు మారిన తర్వాత ఉల్లిపాయ, క్యాప్సికమ్, బీన్స్, క్యారెట్ ముక్కలు వేయాలి. ముక్కలు మెత్తబడే వరకు వేయించి పన్నీర్ తురుము వేసి బాగా కలపాలి. సన్నని మంట మీద ఐదు నిమిషాల పాటు వేయించాక చిల్లీ సాస్, సోయా సాస్, వెనిగర్, ఉప్పు వేసి మరో నిమిషం పాటు వేయించాలి. ఆపైన అన్నం కూడా వేసి బాగా కలిపి మూత పెట్టాలి. ఒక నిమిషం పాటు సిమ్ లో ఉంచి, ఆ తరువాత మిరియాల పొడి వేయాలి. అన్నింటినీ బాగా కలుపుతూ ఒక ఐదు నిమిషాల పాటు వేయించాలి. అంతే పన్నీర్ ఫ్రైడ్ రైస్ రెడీ.
Related News
Paneer Fried Rice: ఎంతో స్పైసీగా ఉండే పన్నీర్ ఫ్రైడ్ రైస్ ను సింపుల్ గా టేస్టీగా తయారు చేసుకోండిలా?
మామూలుగా పన్నీర్ ను మనం ఎన్నో రకాల వంటలలో ఉపయోగిస్తూ ఉంటాం. ఈ మధ్యకాలంలో భారతీయ వంటకాలలో ఈ పన్నీర్ వాడకం విపరీతంగా పెరి