Mohammed Siraj : కొత్త బిజినెస్‌లొకి మహ్మద్ సిరాజ్
‘జోహార్ఫా’ అనే ఈ మల్టీ క్యూసిన్ డైనింగ్ స్పేస్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3లో నెలకొనబోతుంది. ఇటీవల ఇండియన్ క్రికెటర్లలో వ్యాపార రంగంలోకి అడుగుపెడుతున్న అభిరుచి పెరుగుతోంది. విరాట్ కోహ్లీ 'వన్8 కమ్యూన్', శిఖర్ ధవన్, యుజ్వేంద్ర చహల్ వంటి ఆటగాళ్లు తమ పేరుతో బ్రాండ్‌లను ప్రారంభించగా, ఇప్పుడు మహ్మద్ సిరాజ్ కూడా అదే బాటలో పయనిస్తున్నారు.
- By Latha Suma Published Date - 01:33 PM, Thu - 19 June 25

Mohammed Siraj : వేగవంతమైన బౌన్సర్లతో బ్యాట్స్‌మెన్‌ను భయపెట్టే టీమిండియా స్టార్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ ఇప్పుడు మరో రంగంలో తన ప్రతిభను పరిచయంచేసేందుకు సిద్ధమయ్యాడు. క్రికెట్‌లో తనదైన ముద్ర వేసిన సిరాజ్, ఇప్పుడు తన స్వస్థలమైన హైదరాబాద్‌లో విలాసవంతమైన రెస్టారెంట్‌ను ప్రారంభించనున్నాడు. ‘జోహార్ఫా’ అనే ఈ మల్టీ క్యూసిన్ డైనింగ్ స్పేస్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3లో నెలకొనబోతుంది. ఇటీవల ఇండియన్ క్రికెటర్లలో వ్యాపార రంగంలోకి అడుగుపెడుతున్న అభిరుచి పెరుగుతోంది. విరాట్ కోహ్లీ ‘వన్8 కమ్యూన్’, శిఖర్ ధవన్, యుజ్వేంద్ర చహల్ వంటి ఆటగాళ్లు తమ పేరుతో బ్రాండ్‌లను ప్రారంభించగా, ఇప్పుడు మహ్మద్ సిరాజ్ కూడా అదే బాటలో పయనిస్తున్నారు. అయితే, సిరాజ్ వ్యాపార రుచి కొంత ప్రత్యేకంగా ఉంది. ‘జోహార్ఫా’ అనేది కేవలం రెస్టారెంట్ మాత్రమే కాకుండా, అతని వ్యక్తిత్వాన్ని, ఊహను ప్రతిబింబించే ఒక ఆహార గమ్యం కావడం విశేషం.
Read Also: Israel : ఇజ్రాయెల్‌లోని మెడికల్ సెంటర్‌పై ఇరాన్ క్షిపణి దాడి..తీవ్ర ఉద్రిక్తతలు !
ఈ రెస్టారెంట్‌లో మొఘల్, పర్షియన్, అరేబియన్, చైనీస్ వంటకాల ప్రత్యేకతలతోపాటు, హైదరాబాదీ ఫ్లేవర్‌ను జోడించడం ద్వారా ఒక అరుదైన అనుభూతిని కలిగించనున్నట్లు తెలిసింది. “మియా భాయ్ టచ్” అనే పిలుపుతో, ఈ రెస్టారెంట్ స్థానికతను చెరగని ముద్రగా నిలిపేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. తన సోదరుడితో కలిసి ఈ వ్యాపారాన్ని ప్రారంభిస్తున్న సిరాజ్, సోషల్ మీడియాలో దీనిని అధికారికంగా ప్రకటిస్తూ మా ప్రత్యేకమైన ప్రీమియం మల్టీక్యూసిన్ రెస్టారెంట్‌ను ప్రారంభించడానికి ఉత్సాహంగా ఉన్నా. మీ అందరినీ అక్కడ స్వాగతించేందుకు ఎదురుచూస్తున్నా అని వెల్లడించాడు.
రెస్టారెంట్ ప్రారంభ తేదీ ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ, నగరంలోని ఫుడ్ లవర్స్, ఫ్యాన్స్ మాత్రం ఇప్పటికే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రత్యేకించి సిరాజ్ అభిమానులు ఈ కొత్త గమ్యాన్ని అనుభవించేందుకు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇటీవల తన దివంగత తండ్రికి అంకితంగా చేసిన భావోద్వేగపూరిత పోస్ట్‌తో మనసులను గెలుచుకున్న సిరాజ్ నాన్న పని అవమానం కాదు అది నా బలం. ఆయన నాకు శ్రమ విలువను నేర్పారు అని పేర్కొన్నాడు. ఇప్పుడు అదే ఆత్మవిశ్వాసం, సమర్పణతో అతను రెస్టారెంట్ రంగంలో అడుగుపెడుతున్నాడు. అందుకే క్రికెట్‌లో వికెట్లు పడగొట్టే సిరాజ్, ఇప్పుడు హైదరాబాద్ వంటకాలతో ఆహార ప్రియుడు మళ్లీ ఒక “విన్నింగ్ స్పెల్” వేయనున్నాడు.
Read Also: Peddi : రామ్‌చరణ్ ‘పెద్ది’ నుంచి ఇంట్రెస్టింగ్ ఆప్డేట్