HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Ram Charan Pedhi Divyenndu Role First Look

Peddi : రామ్‌చరణ్‌ ‘పెద్ది’ నుంచి ఇంట్రెస్టింగ్‌ ఆప్డేట్‌

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో, 'ఉప్పెన' ఫేం బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ నుంచి తాజాగా మరో కీలక అప్‌డేట్ వెలుగులోకి వచ్చింది.

  • Author : Kavya Krishna Date : 19-06-2025 - 1:07 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ram Charan, Peddi Movie
Ram Charan, Peddi Movie

Peddi : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో, ‘ఉప్పెన’ ఫేం బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ నుంచి తాజాగా మరో కీలక అప్‌డేట్ వెలుగులోకి వచ్చింది. గ్రామీణ నేపథ్యంలో రూపొందుతున్న ఈ స్పోర్ట్స్ డ్రామాలో బాలీవుడ్ నటుడు దివ్యేందు శర్మ ముఖ్య పాత్రలో నటిస్తున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.

ఈ రోజు దివ్యేందు పుట్టినరోజు సందర్భంగా, ఆయన పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేశారు. ఇందులో ఆయన చేతిలో క్రికెట్ బాల్ తిప్పుతూ, గంభీరమైన లుక్‌లో కనిపిస్తున్నారు. ఇందులో ఆయన పాత్ర పేరు ‘రామ్ బుజ్జి’గా మేకర్స్ ప్రకటించారు. ఈ పాత్ర మాస్‌లోకి వెళ్లేలా పవర్‌ఫుల్ గా ఉండనుందని సమాచారం.

‘మిర్జాపూర్’ సిరీస్‌లో మున్నా భాయ్‌గా ఆకట్టుకున్న దివ్యేందు శర్మ, ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులను కూడా మెప్పించబోతున్నారు. ఇప్పటికే ఆయన నటనకు ఉత్తరాది ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ఉండగా, ఇప్పుడు రామ్ చరణ్ సినిమాలో కనిపించబోతున్నారన్న వార్త ఫ్యాన్స్‌లో ఉత్కంఠను పెంచుతోంది.

వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రంలో శివరాజ్ కుమార్, జగపతి బాబు వంటి స్టార్లు కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం, మల్టీ లాంగ్వేజ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.

‘పెద్ది’ సినిమాను 2026 మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రం ఇప్పటికే భారీ అంచనాలు సృష్టించగా, దివ్యేందు శర్మ చేరికతో మరింత హైప్ ఏర్పడింది.

Health : సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉండాలంటే.. ఈ ఫుడ్స్ అలవాటు చేసుకోండి!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ar rahman
  • Buchi Babu Sana
  • divyenndu sharma
  • Divyenndu Telugu debut
  • Mirzapur actor
  • Pan India Film
  • Peddi First Look
  • Peddi Movie
  • Ram Bujji character
  • ram charan
  • Ram Charan 2026 release
  • Telugu Cinema

Related News

Papam Prathap Movie Review

Thiruveer Papam Prathap: పాపం ప్రతాప్ మూవీ రివ్యూ

తిరువీర్ సినిమాలకు, ఆయన చేసే పాత్రలకు ప్రేక్షకుల్లో ఓ మంచి గుర్తింపు ఉంది. సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా తిరువీర్ మీద ఆడియెన్స్ ఓ మోస్తరు అంచనాలతో ఉంటారు. అయితే తిరువీర్ పడే కష్టానికి తగ్గ ప్రతిఫలం మాత్రం రావడం లేదనే భావన ప్రేక్షకుల్లో ఉంది. ఈ క్రమంలోనే తిరువీర్ ‘పాపం ప్రతాప్’ అనే సినిమాతో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. ఈ చిత్రం నేడు విడుదలైంది. మరి ఈ మూవీ ఎలా ఉంది? ఆడియెన

  • Pawan Kalyan Marriage Danah Marks ?

    Anna Konidela: తీన్మార్ ఫంక్షన్ లో పవర్ పక్కన ఉన్నది.? ఆమె నేను కాదు : అన్నా కొణిదెల షాకింగ్ కామెంట్స్

Latest News

  • Bengal Elections : టూవీలర్స్ పై ఆంక్షలు

  • IPL 2026 – SRH vs DC : టాస్ గెలిచిన DC

  • IPL 2026 : CSK కు బిగ్ షాక్

  • Warning : పాక్ కు భారత్ ఆర్మీ వార్నింగ్..బౌండరీ దాటితే ఇక అంతే సంగతి !!

  • నెతన్యాహు హంగేరీ వస్తే అరెస్ట్ ఖాయం: కొత్త ప్రధాని

Trending News

    • అమెరికా-ఇరాన్ మధ్య రేపే రెండో రౌండ్ చర్చలు.. రంగంలోకి ట్రంప్?

    • పాత ఉద్యోగం పోయె.. కొత్త ఆఫర్ వెనక్కి తీసుకెళ్లె! సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆవేదన

    • మారుతున్న శాలరీ స్ట్రక్చర్.. ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

    • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

    • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd