Sleeping Position: మీరు నిద్రపోయే పొజిషన్ కరెక్టా.. ఈ విషయాలు తెలుసుకోండి!
మనిషికి నిద్ర ఎంత అవసరమో మనందరికీ తెలిసిందే. ప్రతి మనిషి రోజుకు సగటున ఎనిమిది గంటల పాటు నిద్రపోవాలి అని నిపుణులు సూచిస్తూ ఉంటారు.
- By Anshu Published Date - 06:15 AM, Fri - 8 July 22

మనిషికి నిద్ర ఎంత అవసరమో మనందరికీ తెలిసిందే. ప్రతి మనిషి రోజుకు సగటున ఎనిమిది గంటల పాటు నిద్రపోవాలి అని నిపుణులు సూచిస్తూ ఉంటారు. కానీ ఈ ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది నిద్రని సరిగా పట్టించుకోవడం లేదు. సరిగా నిద్రపోకపోవడంతో లేనిపోని రోగాలను కొని తెచ్చుకుంటున్నారు. నిద్ర అనేది శారీరక శ్రమపై ఆధారపడి ఉంటుంది అని నిపుణులు సూచిస్తున్నారు. అయితే అధిక శారీరక శ్రమ చేసే వారికి మంచి నిద్ర ఉంటుందని అంటున్నారు. అదే చాలా మంది ఇష్టానుసారంగా పడుకుంటూ ఉంటారు. అయితే మనం నిద్రపోయే విధానాలు భంగిమలు మన ఆరోగ్యం పై దుష్ప్రభావం చూపిస్తాయి అని అంటున్నారు నిపుణులు.
అయితే ఆ దుష్ప్రభాతం డైరెక్ట్ గా కాకపోయినా నిద్రపోయే తీరు కచ్చితంగా ఆరోగ్యం పై ప్రభావం చూపిస్తుంది అని పలు అధ్యయనాలు వెల్లడించాయి. కొన్ని కొన్ని సార్లు ఇబ్బందులు ఎక్కువ అయ్యే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది. మరి ముఖ్యంగా వెల్లకిలా పడుకోవడం కరెక్ట్ కాదు అని వైద్యులు సూచిస్తున్నారు. దీనివల్ల నడుము నొప్పి ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయట. అదేవిధంగా గురక పెట్టి నిద్రపోయే వాళ్ళు స్ట్రైట్ గా పడుకోవడం మంచిది కాదట. అలాగే భుజాలపై పడుకోవడం వెన్నెముక మెడ ఆరోగ్యానికి మంచిది కాదని, ఈ భంగిమ గురక సమస్యకు దారి తీయవచ్చు అని నిపుణులు సూచిస్తున్నారు.
అలాగే చాలామందికి బోర్ల పడుకునే అలవాటు ఉంటుంది. ఇలా పడుకోవడం వల్ల జీర్ణ క్రియ మెరుగుపడుతుంది కానీ ఇలా నిద్రపోవడం వల్ల ఎటువంటి సపోర్ట్ లేక బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే స్ట్రైట్ గా పడుకుని చేతులు స్ట్రైట్ గా పెట్టుకొని పడుకోవడం వల్ల వెన్నెముకకు చాలా మంచిది. ఈ సమయంలోనే వెన్నెముక చాలా న్యాచురల్ పొజిషన్ లో ఉంటుంది. ఇలా స్ట్రైట్ గా పడుకోవడం వల్ల చర్మం పై త్వరగా వయసు ఛాయలు కనిపిస్తాయి అంతేకాకుండా చెస్ట్ పై ముడతలు కూడా త్వరగా ఏర్పడతాయి. ఒకవైపు తిరిగి పడుకొని చేతులను అలా సైడ్ కి పెట్టుకుని పడుకోవడం వల్ల వెన్నెముక మంచిదే అయినప్పటికీ భుజాలు చేతులు నొప్పికి కారణం అవుతాయి. అలాగే ఎడమ వైపు లేదా కుడి వైపు తిరిగి పడుకోవడం వల్ల ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం ఉంటుంది. కుడి వైపు పడుకోవడం వల్ల హార్ట్ బర్న్ సమస్యతో పోరాడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా ఎడమ వైపు తిరిగి పడుకోవడం వల్ల కాలేయంపై ప్రజర్ పెరుగుతుంది. అదేవిధంగా ఊపిరితిత్తులు పొట్టపై కూడా ఒత్తిడి ఏర్పడుతుంది.