Tea: టీ టేస్ట్ అదిరిపోవాలంటే ఈ నాలుగు రకాల విషయాలు గుర్తు పెట్టుకోవాల్సిందే?
- By Sailaja Reddy Published Date - 01:30 PM, Mon - 19 February 24
ప్రస్తుత రోజుల్లో టీ కాఫీ ప్రియుల సంఖ్య గురించి మనందరికీ తెలిసిందే. ఉదయం లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునే వరకు రెండు మూడు సార్లు అంతకంటే ఎక్కువ సార్లు కూడా టీ కాఫీలు తాగే వారు ఉన్నారు. అయితే ఎక్కువ శాతం మంది టీలని తాగడానికి ఇష్టపడుతూ ఉంటారు. మనలో చాలామంది టీ తాగకుండా ఏ పని మొదలుపెట్టరు. టీ తాగితే ఎంతో ఉల్లాసంగా పనిచేస్తూ ఉంటారు. ప్రతిరోజు నీళ్ల తర్వాత ఎక్కువగా తాగేది టీ నే అలాంటి టీ ఎప్పుడు పెట్టిన ఒకే రుచి రావాలి అంటే ఈ విధంగా ట్రై చేయాలి. మరి ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తే టీ అద్భుతంగా వస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మసాలా టీ అంటే దాల్చిన చెక్క, అల్లం, లవంగాలు, మిరియాలు కలిపిన సుగంధ ద్రవ్యాలు ఉంటాయి.
మనం ఎప్పుడు చాయ్ పెట్టిన ఒకే రుచి రావాలి కదా.. ముందుగా మసాలా టీ ఎలా తయారు చేయాలి అన్న విషయంకు వస్తే. రెండు గ్లాసులు వాటర్ కి రెండు స్పూన్ల టీ పొడి వేసుకొని, మీరు ఏ బ్రాండ్ టీ పొడి అయిన సరే రెండు గ్లాసుల వాటర్ కి రెండు స్పూన్ల టీ పొడి వేసుకోవాలి. రెండు స్పూన్ల వరకు పంచదార వేయాలి. ఒకవేళ స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే తగినంతగా వేసుకోవాలి.ఇప్పుడు ఇందులో రెండు యాలకులను కొంచెం దంచి పక్కన ఉంచాలి. ఒకసారి బాగా కలిపి ఇప్పుడు ఇందులో రెండు లవంగాలను వేయాలి. ఇప్పుడు ఈ వాటర్ ని బాగా మరిగించాలి. వాటర్ కలర్ చేంజ్ అయ్యే వరకు మరిగించాలి. ఇప్పుడు మనం పాలు పోసి బాగా ఉడికించాలి ఇక్కడ మనం రెండు గ్లాసుల వాటర్ తీసుకున్నాం కాబట్టి రెండు గ్లాసులు పాలు వేసుకోవాలి.
అయితే పాలు కూడా ఫ్రిడ్జ్ లోంచి తీసిన వెంటనే టీ లో కలపకూడదు ఎందుకంటే ఈ టీ డికాషన్ బాగా వేడిగా ఉంటుంది. అందుకే ఇటువంటి పాలు వేసినప్పుడు పాలు ముందుగా మీరు ఫ్రిడ్జ్ లోంచి బయట పెట్టుకొని రూమ్ టెంపరేచర్లో కనీసం అరగంటైనా ఉంచాలి. అప్పుడు ఆ పాలను టీ లో పోయాలి. అలాగే గరిటతో అప్పుడప్పుడు కలుపుతూ మరగబెట్టుకోవాలి. 10 నిమిషాల పాటు చక్కగా మరిగించుకుని స్టవ్ ఆఫ్ చేసి కప్పు లోకి వడకట్టుకోవాలి. ఇలా చేస్తే ఎప్పుడు ప్రిపేర్ చేసిన ఒకే రుచి వస్తుంది.
Tags
Related News
Food Tips : టీ నుండి అన్నం వరకు.. మీరు మళ్లీ వేడి చేయకూడని 5 ఆహార పదార్థాలు..!
జీవితపు బిజీ ఎంతగా పెరిగిపోయిందంటే, మన ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడానికి కూడా సమయం దొరకడం లేదు. బ్రేక్‌ఫాస్ట్‌లో బ్రెడ్, బటర్, మ్యాగీ, శాండ్విచ్ మొదలైన రెడీమేడ్ ఫుడ్స్ తినడం ద్వారా రోజును ప్రారంభిస్తున్నాం.