Unwanted Hair : అమ్మాయిల్లో అవాంఛిత రోమాలు తొలగించుకోవడానికి చిట్కాలు..
టీనేజీ అమ్మాయిల్లో, మహిళల్లో(Women) హార్మోన్ల అసమతుల్యత వలన పెదవుల పైన, గడ్డం కింద అవాంఛిత రోమాలు వస్తుంటాయి.
- Author : News Desk
Date : 29-09-2023 - 9:20 IST
Published By : Hashtagu Telugu Desk
టీనేజీ అమ్మాయిల్లో, మహిళల్లో(Women) హార్మోన్ల అసమతుల్యత వలన పెదవుల పైన, గడ్డం కింద అవాంఛిత రోమాలు వస్తుంటాయి. అయితే వాటిని తొలగించడానికి ఇప్పుడు అందరు బ్యూటీ పార్లర్(Beauty Parlor) చుట్టూ తిరుగుతున్నారు కానీ మనం కొన్ని చిట్కాలను పాటించి తొలగించుకోవచ్చు.
నాలుగు స్పూన్ల శనగపిండి కొద్దిగా పెరుగును కలిపి దానిలో కొద్దిగా లావెండర్ నూనె లేదా బాదం నూనెను కలిపి మెత్తని పేస్ట్ లాగా చేయాలి. దానిని అవాంఛిత రోమాలు(Unwanted Hair
ఉన్నచోట రాసుకొని 15 నిముషాలు లేదా 20 నిముషాల తరువాత స్క్రబ్ చేసినట్లుగా చేస్తూ నీటిని పోసుకొని కడగాలి. ఇలా అప్పుడప్పుడు చేస్తూ ఉండడం వలన అవాంఛిత రోమాలు తొలగిపోతాయి.
కర్పూరం బిళ్ళలు కొన్నింటిని తీసుకొని పొడి చేసుకొని దానిలో రెండు స్పూన్ల తెల్ల మిరియాల పొడిని కలపాలి. దానిలో కొద్దిగా బాదం నూనెను కలిపి మెత్తని పేస్ట్ లాగా చేసుకొని దానిని అవాంఛిత రోమాలు ఉన్న చోట రాసుకోవాలి. 15 నిముషాలు అయిన తరువాత గోరువెచ్చని నీటితో కడగాలి ఇలా రెగ్యులర్ గా చేస్తూ ఉండడం వలన అవాంఛిత రోమాలు తొలగిపోతాయి.
అర కప్పు మొక్కజొన్న పిండిని తీసుకొని దానిలో కొద్దిగా పాలు కలిపి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. దానిని అవాంఛిత రోమాలు ఉన్నచోట రాసుకొని ఇరవై నిముషాలు తరువాత దాన్ని తీసేస్తే అప్పుడు అవాంఛిత రోమాలు దానితో పాటుగా ఊడిపోతాయి. అయితే వెంట్రుకలు బాగా గట్టిగా ఉన్నవారికి ఈ పద్దతి పనికి రాదు. తక్కువ మందం ఉన్న వెంట్రుకలు అయితే మొత్తం రాలిపోతాయి. ఈ విధంగా పైన చెప్పిన చిట్కాలను ఉపయోగించి అవాంఛిత రోమాలను తొలగించుకోవచ్చు.
గమనిక : పైన పేర్కొన్న అంశాలు ఇంటర్నెట్ సమాచారం నుంచి తీసుకోబడ్డవి. ఇలాంటివి పాటించేముందు నిపుణుల సలహా వాడటం మంచిది.
Also Read : Bubble Gum : బబుల్ గమ్స్‌ని తినడం వలన లాభమా లేక నష్టమా?