Beauty Tips: అమ్మాయిలు మేకప్ లేకపోయినా అందంగా కనిపించాలా.. అయితే ఇవి ట్రై చేయాల్సిందే!
Beauty Tips: అమ్మాయిలు అందంగా కనిపించడం కోసం మేకప్ వేసుకోవాల్సిన అవసరం లేదని ఇప్పుడు చెప్పబోయే టిప్స్ ని ఫాలో అయితే మేకప్ కి గుడ్ బాయ్ చెప్పేయడం ఖాయం అని చెబుతున్నారు.
- By Anshu Published Date - 08:00 AM, Tue - 2 December 25
Beauty Tips: మామూలుగా అమ్మాయిలు అందంగా కనిపించడం కోసం రకరకాల ఫేస్ క్రీములు ఫేస్ ప్యాక్ లు ఉపయోగించడంతోపాటు బ్యూటీ పార్లర్ కు వెళ్లి వేలకు వేలు డబ్బులు ఖర్చు చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు అందంగా కనిపించినా మరికొన్నిసార్లు సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. అయితే మేకప్ వేసినప్పుడు మాత్రమే అమ్మాయిలు అందంగా కనిపిస్తూ ఉంటారు. ఆ మేకప్ తీయగానే మామూలుగానే కనిపిస్తూ ఉంటారు. అయితే రసాయనాలతో కూడిన మేకప్ ఉత్పత్తులు చర్మానికి హాని కలిగిస్తాయి.
అందుకే ప్రతిరోజూ మీ ముఖంపై మేకప్ వేసుకోవడం అంత మంచిది కాదట. అటువంటి పరిస్థితిలో ఎటువంటి ఖర్చు లేకుండా ముఖం కాంతిని పెంచడానికి, మేకప్ లేకుండా అందంగా కనిపించడానికి ఇప్పుడు చెప్పబోయే చిట్కాలు పాటిస్తే చాలు అని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి.nపేలవమైన జీవనశైలి, ఆహారం మీ చర్మంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయట. చర్మాన్ని, దాని అందాన్ని కాపాడుకోవడానికి లోపలి నుంచి పోషించడం చాలా ముఖ్యం. కాబట్టి ప్రోటీన్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలని చెబుతున్నారు.
రోజూ సరిపడినంత నిద్రపోకపోతే దాని ప్రభావాలు ముఖంపై కనిపిస్తాయట. కాబట్టి రోజుకు కనీసం ఏడు గంటలు నిద్రపోవడానికి ప్రయత్నించాలట. ఇది మీ చర్మాన్ని తాజాగా, ప్రకాశవంతంగా చేస్తుందట. నిద్రపోతున్నప్పుడు చర్మం కొత్త కొల్లాజెన్ ను ఉత్పత్తి చేస్తుందని, ఇది ముఖాన్ని ప్రకాశవంతంగా, తాజాగా ఉంచుతుందని చెబుతున్నారు. అలాగే తగినంత నీళ్లు తాగితే శరీరంలోని ప్రతి వ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుందట. ఇది మొటిమలు, పొడి చర్మం నుంచి రక్షణ కల్పిస్తాయట. ముఖం ప్రకాశవంతంగా ఉండటానికి సహాయపడుతుందని, అలాగే శారీరక యోగాసనాలు కూడా చేయాలని చెబుతున్నారు. ఎల్లప్పుడూ సానుకూల దృక్పథంతో ఉండటానికి ప్రయత్నించాలట. ప్రతికూల వ్యక్తులకు దూరంగా ఉండాలని అప్పుడు మీ ముఖం సహజంగా ప్రకాశిస్తుందని, ఈ అలవాట్లను అలవర్చుకోవడం ద్వారా మేకప్ లేకుండా కూడా అందంగా కనిపించవచ్చని చెబుతున్నారు. సహజ సౌందర్యం కోసం ప్రతి రోజు రెండుసార్లు స్నానం చేయడం, మంచి మంచి ఆకుకూరలు కాయగూరలు పండ్లు తినడం, తగినంత నీరు తాగడం, కంటి నిండా నిద్రపోవడం ఇవ్వని కూడా అందాన్ని రెట్టింపు చేస్తాయని చెబుతున్నారు.