Control Anger : కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం ఎలాగో తెలుసా?
మనకు పని ఒత్తిడి, ఎవరన్నా మనల్ని ఓ మాట అన్నప్పుడు.. ఇలా రకరకాల కారణాలతో కోపం ఎక్కువగా వస్తుంటుంది.
- By News Desk Published Date - 09:55 PM, Wed - 20 December 23

తన కోపమే(Anger) తన శత్రువు అనేది ఒక నానుడి. మనకు పని ఒత్తిడి, ఎవరన్నా మనల్ని ఓ మాట అన్నప్పుడు.. ఇలా రకరకాల కారణాలతో కోపం ఎక్కువగా వస్తుంటుంది. మనం కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. కానీ మనం కోపం రాగానే వెంటనే అవతలి వ్యక్తి మీద మన కోపాన్ని మాటల ద్వారా వ్యక్తపరుస్తాము. అప్పుడు మనం మాట్లాడే మాటలు అవతలి వ్యక్తికి బాధను కలిగిస్తాయి. కాబట్టి మనం కోపంగా ఉన్నప్పుడు ఏమి మాట్లాడకుండా కాసేపు ఉండాలి తరువాత మాట్లాడాలి. అప్పుడు మనం ఆలోచించి మాట్లాడతాము కాబట్టి మన మాటలు ఇతరులను బాధ పెట్టేవిధంగా ఉండవు.
శారీరిక శ్రమ మనలో ఉన్న ఒత్తిడిని(Stress) తగ్గించి కోపాన్ని పోగొడుతుంది. కాబట్టి కోపం తగ్గడానికి వేగంగా నడవడం లేదా వేగంగా పరుగెత్తడం వంటివి చేయాలి. లేదా ఏదయినా వ్యాపకాన్ని అలవాటు చేసుకోవాలి. అప్పుడే కోపాన్ని తగ్గించుకోగలుగుతారు. మీరు ప్రశాంతంగా ఉన్న సమయంలో మీ ఆందోళనను అవతలి వ్యక్తికి వారికి బాధ కలుగకుండా తెలియజేయాలి. అప్పుడే మీరు ఆ కోపం నుండి బయటపడతారు. మీకు ఉన్న సమయాన్ని ఇల్లు, పిల్లలు అంతే కాకుండా మీ గురించి కూడా మీరు టైమ్ స్పెండ్ చేయాలి.
మనం మన కోసం కొంత సమయాన్ని కేటాయించి మనకు నచ్చిన పనిని, మనసుకి ప్రశాంతతని కలిగించే పని చేయాలి. అప్పుడే మనం ఒత్తిడి నుండి దూరం అవుతాము. కోపాన్ని కంట్రోల్ చేసుకోగలుగుతాము. మనం ఏదయినా విషయాన్ని మార్చలేకపోతే దాని గురించి కోపం తెచ్చుకొని ఎటువంటి ప్రయోజనం లేదు. ఎందుకంటే మనం కోపంగా ఉన్నంత మాత్రాన మనం ఆ విషయాన్ని మార్చలేము అని తెలుసుకోవాలి. కాబట్టి కోపం ఏ సమస్యను సాల్వ్ చేయదు ఇంకా బంధాలు దూరం అవుతాయి కాబట్టి కోపాన్ని తెచ్చుకోవడం తగ్గించుకోవాలి.
మన మైండ్ ని కోపం వచ్చినప్పుడు ఏదో ఒక వ్యాపకం ద్వారా డైవర్ట్ చేసుకోవాలి. కాసేపు సైలెన్స్ మెయింటైన్ చేయాలి. కోపం మరీ ఎక్కువగా వస్తుంటే ధ్యానం, యోగా లాంటివి చేయాలి. ప్రశాంత వాతావరణంలో గడపడం, లైట్ కలర్స్ బట్టలు వేసుకోవడం లాంటివి చేయడం వలన కూడా కోపం తగ్గించుకోవచ్చు. కోపం తగ్గించుకోక పోతే బీపీ, గుండె వ్యాధులు, పలు రకాల అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది.
Also Read : Mango Rawa Pulihora: ఎంతో టేస్టీగా ఉండే మామిడి రవ్వ పులిహోర.. సింపుల్ గా ట్రై చేయండిలా?