Period Pains: పీరియడ్స్ నొప్పులు భరించలేకపోతున్నారా.. అయితే ఈ సింపుల్ చిట్కాలతో నొప్పి మాయం!
Periods Pains: మహిళలు నెలసరి సమయంలో నొప్పితో ఇబ్బంది పడుతున్న వారు ఇప్పుడు చెప్పబోయే ఈ సింపుల్ చిట్కాలను ఫాలో అయితే ఆ నొప్పి నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చు అని చెబుతున్నారు.
- By Anshu Published Date - 07:30 AM, Thu - 23 October 25

Periods Pains: మహిళలకు ప్రతినెలా పీరియడ్స్ అన్నది తప్పకుండా వస్తుంటుంది. ఇది ఒక సహజ ప్రక్రియ అని చెప్పాలి. అయితే కొంతమందిని ఈ పీరియడ్స్ సమస్య చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఆ సమయంలో నొప్పి భరించలేకపోతుంటారు. ముఖ్యంగా కడుపునొప్పి నీరసంగా అనిపించడం వంటి సమస్యలతో ఎక్కువగా బాధపడుతుంటారు. ముఖ్యంగా వారికి పీరియడ్స్ మొదటి మూడు రోజులలో కొందరు తీవ్రమైన నొప్పి, తిమ్మిరిని అనుభవిస్తారు. దీని వలన ఒక్కోసారి రోజువారీ పనులు చేయడం కూడా కష్టమవుతుంది. చాలా మంది మహిళలు నొప్పి నుండి ఉపశమనం పొందడానికి మందులను ఆశ్రయిస్తారు.
కానీ నొప్పి నివారణ మందులు శరీరంపై అనేక ప్రతికూల ప్రభావాలను చూపుతాయి. మందులకు బదులుగా, మీరు మీ పీరియడ్స్ తిమ్మిరిని ఇంటి చిట్కాలతో తగ్గించుకోవచ్చని చెబుతున్నారు. అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. యోగాతో మీ నొప్పిని తగ్గించుకోవచ్చట. మత్స్యాసనంగా పిలువబడే యోగా భంగిమ ఈ సమయంలో చాలా ప్రయోజనకరంగా పనిచేస్తుందట. ఈ యోగా భంగిమ దిగువ శరీరానికి రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడుతుందని, ఇది ఋతు ప్రవాహం సజావుగా సాగడానికి దారితీస్తుందట. అలాగే మీ ఋతు కాలంలో ఎటువంటి దూకుడు వ్యాయామాలు చేయరాదని చెబుతున్నారు.
పీరియడ్స్ సమయంలో సోంపు నీరు తాగడం వల్ల ఆ నొప్పి నుంచి తొందరగా ఉపశమనం పొందవచ్చట. అయితే సోంపు గింజలను నీటిలో మరగబెట్టి తాగాలని చెబుతున్నారు. అలాగే మెంతి గింజలను నొప్పి నుండి ఉపశమనం పొందేందుకు కూడా ఉపయోగించవచ్చట. ఒక టీ స్పూన్ మెంతి గింజలను అర టీస్పూన్ ఉప్పుతో కలిపి కొద్దిగా నీటితో మింగాలట. మెంతి గింజలు యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్, యాంటీవైరల్ లక్షణాలను కలిగి ఉంటాయని, ఇవి ఋతు తిమ్మిరిని తగ్గించడంలో సహాయపడతాయని చెబుతున్నారు.
మీరు తరచుగా మీ పీరియడ్స్ సమయంలో నొప్పితో ఇబ్బంది పడుతున్నట్టయితే, హాట్‌ప్యాక్ ఉపయోగించడం మంచిదట. దీని వల్ల మీ ఉదర ప్రాంతం చుట్టూ ఉన్న కండరాల ఉద్రిక్తతను విడుదల చేస్తుందట. మీ నాడీ వ్యవస్థను ప్రశాంతపరుస్తుందని, ఋతు తిమ్మిరిని తగ్గించవచ్చని చెబుతున్నారు. మీ పీరియడ్స్ సమయంలో పచ్చి చిలగడదుంపలు వంటి గ్రౌండింగ్ ఫుడ్స్ తినటం మేలు చేస్తుందట. వాటిని బాగా ఉడకబెట్టి, కొన్ని మూలికలు, సుగంధ ద్రవ్యాలతో వేయించాలట. అవి కండరాల తిమ్మిరిని నివారించడానికి, వాపును తగ్గించడానికి, మానసిక స్థితిని నియంత్రించడంలో సహాయపడతాయని చెబుతున్నారు. మీరు అవకాడోలను కూడా తీసుకోవచ్చట.