Dry Fruits : శరీరంలో కొవ్వు కరిగించే సూపర్ ఫ్రూట్స్.. ఇవి తింటే ఆరోగ్యమే ఆరోగ్యం!
ప్రస్తుతం చాలామంది కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నారు.
- By Anshu Published Date - 02:00 PM, Sun - 10 July 22

ప్రస్తుతం చాలామంది కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నారు. జీవనశైలి అలాగే ఆహారపు అలవాట్లు ఇందుకు గల ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. మరి ముఖ్యంగా ప్రస్తుతం సమయపాలన సరిగా లేని ఆహారపు అలవాట్ల వల్ల ఊబకాయం బారిన పడుతున్నారు. సమయానికి సరిగా ఆహారం తీసుకోకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది. అయితే కొలెస్ట్రాల్ ని తగ్గించాలి అంతే ప్రతిరోజు వ్యాయామం తో ఈ ఐదు రకాల పండ్లను తీసుకోవాలట. మరి ఆ పండ్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
స్ట్రాబెర్రీలు: స్ట్రాబెర్రీలను తినడానికి మాత్రమే కాకుండా, సౌందర్యానికి కూడా ఉపయోగిస్తూ ఉంటారు. తీయగా అత్యంత రుచికరమైన ఈ స్ట్రాబెర్రీలు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో బాగా సహాయపడతాయి. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నందువల్ల చర్మానికి మరింత గ్లో తెస్తుంది.
యాపిల్స్: యాపిల్స్ లో పోషకాలు అధికంగా ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ప్రతిరోజు ఒక యాపిల్ పండు తింటే డాక్టర్ వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదు అని అంటూ ఉంటారు. ఇది ముమ్మాటికి నిజమే ఎందుకంటే యాపిల్స్ లో పెక్టీన్ ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలోని కొలెస్ట్రాల్ ని తగ్గించడంలో సహాయపడుతుంది.
సిట్రస్ పండ్లు: నిమ్మ, నారింజ లాంటి పండ్లు సిట్రస్ జాతికి చెందినవి. ఇందులోవిటమిన్ సి అధికంగా ఉంటుంది. ఈ పండు కొలెస్ట్రాల్ తగ్గించడంలో ప్రభావంతంగా పనిచేస్తాయి.
ద్రాక్ష: ద్రాక్ష పండ్లు రుచికరమైన అలాగే ఆరోగ్యకరమైన ఆహారం అని చెప్పవచ్చు. ఇవి బరువును తగ్గించడానికి సహాయం చేయడంతో పాటు కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా తగ్గిస్తాయి.
అవకాడో: కొలెస్ట్రాల్ తో బాధపడుతున్న వ్యక్తులు తరచుగా అవకాడో తినడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయని అపోహతో దూరంగా ఉంటారు. కానీ ఇది కేవలం అపోహ మాత్రమే. కొలెస్ట్రాల్ తో బాధపడుతున్న వారు అవకాడో ఫ్రూట్ ని ఎటువంటి అనుమానం లేకుండా తినవచ్చు.