Weight Loss: ఏంటి.. బరువు తగ్గాలి అనుకునే వారు ఈ పండ్లు తింటే అంత ప్రమాదమా!
Weight Loss: పండ్లు ఆరోగ్యానికి మంచివే అయినప్పటికీ బరువు తగ్గాలి అనుకున్న వారు కొన్ని రకాల పండ్లకు దూరంగా ఉండడం మంచిదని లేదంటే ఇవి బరువును మరింత పెంచుతాయని చెబుతున్నారు.
- By Anshu Published Date - 08:00 AM, Thu - 25 September 25

Weight Loss: పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. అందుకే ప్రతిరోజు ఆకుకూరలు కాయగూరలతో పాటు పండ్లు కూడా తీసుకోవాలని చెబుతూ ఉంటారు. పండ్లను తరచుగా డైట్ లో చేర్చుకోవడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలను పొందవచ్చు. ఇవి ఆరోగ్యానికి మేలు చేయడంతో పాటు బరువు తగ్గడానికి కూడా సహాయపడతాయట. అలాగే బరువు తగ్గాలి అనుకున్న వారు కొన్ని రకాల పండ్లకు దూరంగా ఉండడం మంచిదని చెబుతున్నారు.
ఎందుకంటే ఇవి మీ బరువును మరింత పెరిగేలా చేస్తాయట. మరి బరువు తగ్గాలి అనుకున్న వారు ఎలాంటి పండ్లను తినకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. వీటిలో మొదటిది అరటిపండు. బరువు తగ్గాలనుకునేవారు అరటిపండును తినకపోవడమే మంచిదట. ఎందుకంటే ఈ పండులో కేలరీలు, కార్బోహైడ్రేట్లు, నేచురల్ షుగర్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మీ బరువును మరింత పెంచుతాయట. అలాగే బరువు తగ్గాలనుకున్న వారు ద్రాక్ష కూడా తక్కువగా తీసుకోవడం మంచిదని చెబుతున్నారు. ఎందుకంటే వీటిలో కేలరీలు, నేచురల్ షుగర్స్ ఎక్కువగా ఉంటాయట. ఇవి మీ బరువును మరింత పెంచుతాయని, అందుకే వీటిని తక్కువ మొత్తంలోనే తీసుకోవాలని చెబుతున్నారు.
బరువు తగ్గాలి అనుకున్న వారు తీసుకోకూడని పండ్లలో మామిడిపండు కూడా ఒకటి. వీటిలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయట. అయితే ఈ పండ్లలో నేచురల్ షుగర్స్ చాలా ఎక్కువగా ఉంటాయట. కాబట్టి మామిడి పండ్లను ఎక్కువగా తింటే బరువు పెరుగుతారట. కాబట్టి వీటిని ఎక్కువగా తినకూడదని చెబుతున్నారు. బరువు తగ్గాలి అనుకున్న వారు పైనాపిల్ కూడా తినకూడదట. ఈ పండులో నేచురల్ షుగర్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ పండును ఎక్కువగా తింటే మీరు బరువు తగ్గరట. అందుకే వెయిట్ లాస్ అవ్వాలనుకునేవారు పైనాపిల్ పండుకు దూరంగా ఉండటమే మంచిదని చెబుతున్నారు. అలాగే దానిమ్మ పండును కూడా బరువు తగ్గాలి అనుకున్న వారు తినకపోవడమే మంచిదని చెబుతున్నారు. వ్యాయామానికి ముందు దానిమ్మ పండును తింటే చాలా మంచిది. కానీ వ్యాయామం తర్వాత ఈ పండును తినకూడదట. ఎందుకంటే దీనిలోని నేచురల్ షుగర్స్ బ్లడ్ షుగర్ లెవెల్స్ ను పెంచుతాయని, అలాగే మీరు బరువు కూడా పెరుగుతారని చెబుతున్నారు.