HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Life Style
  • >Eating These Fruits Increases The Level Of Uric Acid In The Body

Uric Acid: ఈ పండ్లు తింటే శరీరంలో యూరిక్‌ యాసిడ్‌ లెవెల్ ఎక్కువవుతుంది

శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయి పెరిగితే అనేక వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

  • Author : Maheswara Rao Nadella Date : 24-02-2023 - 7:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Uric Acid
Eating These Fruits Increases The Level Of Uric Acid In The Body

యూరిక్‌ యాసిడ్‌ (Uric Acid) మన రక్తంలో కనిపించే వ్యర్థ పదార్థం. మనం తీసుకునే ఆహార పదార్థాల్లోని ‘ప్యూరిన్‌’ అనే రసాయనం విచ్ఛిన్నం అయినప్పుడు.. యూరిక్‌ యాసిడ్‌ ఏర్పడుతుంది. ఇది ఎప్పటికప్పుడు మూత్రం ద్వారా బయటకు వెళ్తుంది. ఒకవేళ విసర్జన సరిగా జరగకపోతే.. యూరిక్‌ యాసిడ్‌ రక్తంలోనే నిలిచిపోతుంది. క్రమంగా ఇవి స్ఫటికాలుగా మారి కీళ్లు, కీళ్ల చుట్టూ ఉండే కణజాలాల్లో పేరుకుపోతాయి. శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయి పెరిగితే అనేక వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. కిడ్నీలో రాళ్లు, మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు, డయాబెటిస్‌, హైపోథైరాయిడిజం, గౌట్, గుండె సమస్యలు, కిడ్నీ సమస్యలు, కడుపులో మంట, కొన్ని రకాల క్యాన్సర్, సోరియాసిస్ వంటి ప్రమాదకర వ్యాధులు వచ్చే ముప్పు పెరుగుతుంది.

NCBI నివేదిక ప్రకారం.. ప్యూరిన్‌’ కారణంగానే కాదు.. ఫ్రక్టోజ్‌ వల్ల కూడా మన రక్తంలో యూరిక్‌ యాసిడ్‌ స్థాయిలు పెరిగే అవకాశం ఉంది. ఫ్రక్టోజ్ జీవక్రియ జరిగినప్పుడు.. హెపాటిక్ అడెనోసిన్ ట్రైఫాస్ఫేట్‌గా క్షీణిస్తుంది. ఇది యూరిక్ యాసిడ్ (Uric Acid), న్యూక్లియోటైడ్ల విచ్ఛిన్నానికి కారణమవుతుంది. ఫ్రక్టోజ్‌ ఎక్కువగా తీసుకుంటే.. రక్తంలో యూరిక్‌యాసిడ్‌ స్థాయిలు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. యూరిక్‌ యాసిడ్‌ సమస్యతో బాధపడేవారు.. ఫ్రక్టోజ్‌ రిఛ్‌ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలని అంటున్నారు. అనేక పండ్లు, కూరగాయలలో ఫ్రక్టోజ్‌ అధికంగా ఉంటుంది. ఇవి ఎక్కువగా తీసుకుంటే.. రక్తంలో శరీరంలో యూరిక్‌ యాసిడ్‌ స్థాయిలు పెరుగుతాయని అంటున్నారు. యూరిక్‌ యాసిడ్‌ ఫేషెంట్స్‌ తినకూడని పండ్లు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

పనసపండు:

పనసపండును చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు. ఇది చాలా తియ్యాగా, టేస్టీగా ఉంటుంది. ఈ పండులో ఫ్రోక్టోజ్‌ కంటెంట్‌ చాలా ఎక్కువగా ఉంటుంది. మైఫుడ్‌డేటా నివేదిక ప్రకారం, 1 కప్పు పనసతొనల్లో.. 15.2 గ్రాముల ఫ్రక్టోజ్ ఉంటుంది. యారిక్‌ యాసిడ్‌ సమస్యతో బాధపడేవారు పనస పండు తినకపోవడమే మంచిదని నిపుణులు అంటున్నారు. దీనిలో ప్రోక్టోజ్‌ స్థాయిల కారణంగా.. యూరిక్‌ యాసిడ్‌ సమస్య తీవ్రం అయ్యే ప్రమాదం ఉంది.

ద్రాక్షపండ్లు:

ఈ సీజన్‌లో ద్రాక్షపండ్లు ఎక్కువగా దొరుకుతాయి. దీనిలో అధిక మొత్తంలో ఉండే.. విటమిన్‌ సీ, ఫైబర్‌ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే.. వీటిలో ఫ్రక్టోజ్‌ కూడా ఎక్కువగా ఉంటుంది. ఒక కప్పు ఎరుపు, ఆకుపచ్చ రంగు ద్రాక్షలో 12.3 గ్రాముల ఫ్రక్టోజ్ ఉంటుంది. ద్రాక్షలో రెస్వెరాట్రాల్‌, క్వెర్సెటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

యాపిల్‌:

రోజుకొక యాపిల్‌ తింటే.. ఆరోగ్యానికి ఎంతో మంచిదని మనకు తెలుసు. యాపిల్‌లో ఫైబర్, పాలీఫెనాల్స్, పొటాషియం వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అయితే, ఒక మీడియం సైజ్‌ యాపిల్‌ పండులో 12.5 గ్రాముల ఫ్రక్టోజ్ ఉంటుంది. గౌట్‌, యూరిక్‌ యాసిడ్‌ సమస్యతో బాధపడేవారు.. రోజూ యాపిల్‌ తింటే, వారి పరిస్థితి దిగజారే ప్రమాదం ఉంది.

పియర్‌:

మీరు యూరిక్‌ యాసిడ్ సమస్యతో ఇబ్బంది పడుతుంటే.. పియర్‌ పండు ఎక్కువగా తినకపోవడమే మంచిదని నిపుణులు అంటున్నారు. దీనిలో 11.4 గ్రాముల ఫ్రక్టోజ్ ఉంటుంది. ఇది శరీరంలో యూరిక్‌ యాసిడ్‌ స్థాయిలను పెంచుతుంది.

బ్లూ బెర్రీస్‌:

బ్లూ బెర్రీస్‌లో ఫైబర్‌, విటమిన్‌ సీ పుష్కలంగా ఉంటాయి. కానీ.. వీటిలో ఫ్రక్టోజ్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఒక కప్పు బ్లూబెర్రీస్‌లో 7.4 గ్రాముల ఫ్రక్టోజ్ ఉంటుంది. గౌట్‌, యూరిక్‌ యాసిడ్‌ సమస్య ఉన్నవారు.. బ్లూ బెర్రీస్ ఎక్కువగా తింటే మంచిది కాదని నిపుణులు అంటున్నారు.

అరటిపండు:

అరటిపండులో పొటాషియం, విటమిన్ సి, ఫైబర్‌ అధికంగా ఉంటాయి. అయితే, వీటిలో ఫ్రక్టోజ్‌ కూడా అధికంగా ఉంటుంది. ఒక మీడియం సైజ్‌ అరటిపండులో 5.7 గ్రాముల ఫ్రక్టోజ్ ఉంటుంది. ఇది గౌట్‌, యూరిక్‌ యాసిడ్‌ పేషెంట్స్‌కు మంచిది కాదు.

Also Read:  Brain: మీ పిల్లలకు ఫోన్ ఇచ్చి వారి ‘మెదడు’ ను పాడుచేస్తుంది మీరే.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • benefits
  • body
  • Eating
  • food
  • fruits
  • health
  • Life Style
  • Stop
  • tips
  • Tricks
  • uric acid

Related News

Why do Indians love spicy foods...?

Spicy Food: ఇండియన్లు స్పైసీ ఫుడ్స్‌ను ఎందుకు ఇష్టపడతారు…?

భారతీయ వంటకాలు ఎక్కువగా స్పైసీగా ఉంటాయి. ఇక్కడి వంటకాలు మసాలాతో నిండి ఉంటాయి. స్పైసీ కంటెంట్ విషయంలో అస్సలు రాజీపడరు. కారంగా ఉన్న ఆహారాన్నే భారతీయులు ఇష్టపడుతుంటారు. ఇది రుచితో పాటు ఆరోగ్యానికి కూడా మంచిది. వాస్తవానికి మసాలా పరిమాణం సాధారణం కంటే తక్కువగా ఉన్నట్లయితే… ఆహారం చప్పగా ఉంటుంది. ప్రాథమిక ప్రమాణాలతో పోల్చితే సాధారణం కంటే చాలా ఎక్కువ. అయితే స్పైసీ ఫుడ్స్ ఎక

    Latest News

    • Missing Case : ఫిన్లాండ్‌లో తెలుగు విద్యార్థి అదృశ్యం.. ఆచూకీ కోసం హైకోర్టును ఆశ్రయించిన తల్లిదండ్రులు

    • Janasena: తెలంగాణలో జనసేన పార్టీ ఆఫీస్‌ను ప్రారంభించిన పవన్ కల్యాణ్

    • Shani Anugraham: శని పీడ తొలగిపోవాలంటే శనీశ్వరుడికి.. ఈ వస్తువు సమర్పించాల్సిందే!

    • Pista: ఈ సీజన్‌లో పిస్తా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు!

    • Pregnancy: పీరియడ్స్ టైం లో శృంగారంలో పాల్గొంటే ప్రెగ్నెన్సీ వచ్చినట్లేనా..?

    Trending News

      • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

      • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

      • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd