Teeth: తళతళ మెరిసే పళ్లకోసం ఈ ఆహారాలను తినండి..!
ఉదయం, సాయంత్రం బ్రష్ చేసుకోవడం, ఫ్లాసింగ్, ఆయిల్ పుల్లింగ్‌తో మీ పళ్లను, నోటిని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. మన డైట్‌లో కొన్ని రకాల ఆహరపదార్థాలు చేర్చుకున్నా..
- Author : Maheswara Rao Nadella
Date : 11-03-2023 - 5:00 IST
Published By : Hashtagu Telugu Desk
ఆరోగ్యకరమైన శరీరంలానే.. ఆరోగ్యకరమైన పళ్లు (Teeth), నోరు కూడా చాలా ముఖ్యం. మనలో చాలా మంది నోటి ఆరోగ్యంపై అంతగా శ్రద్ధ చూపరు. ఉదయం నిద్ర లేచాక పళ్లు తోముకొని మమా అనిపించేస్తారు. పంటి నొప్పి, పంటి సమస్యలు వస్తేనే దానిని పట్టించుకుంటారు. దంతాలు, నోటి ఆరోగ్యాన్ని విస్మరిస్తే.. నోటిలో బ్యాక్టీరియా ఎక్కువగా అభివృద్ధి చెందుతుంది. నోటి నుంచి దుర్వాసన, పళ్లు పసుపుగా మారతాయి. దీంతో నవ్వాలన్నా, దగ్గరకు వెళ్లి ఎవరితోనైనా మాట్లాడాలన్నా నామోషీగా అనిపిస్తుంది. నోటి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే.. పుచ్చిపోయిన పళ్లు, చిగుళ్లు వాయటం, చిగుళ్ల నుంచి రక్తస్రావం వంటి సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుంది. స్వీట్స్ ఎక్కువగా తింటున్నా, స్మోకింగ్, ఆల్కహాల్, కాఫీ/టీ వంటి అలవాట్ల కారణంగా పళ్లు (Teeth) పసుపు పచ్చగా మారే అవకాశం ఉంది. ఉదయం, సాయంత్రం బ్రష్ చేసుకోవడం, ఫ్లాసింగ్, ఆయిల్ పుల్లింగ్‌తో మీ పళ్లను, నోటిని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. మన డైట్‌లో కొన్ని రకాల ఆహరపదార్థాలు చేర్చుకున్నా.. పుసుపు పచ్చగా మారిన పళ్లు తిరిగి.. తెల్లగా మెరిసిపోతాయి.
యాపిల్:
క్యారెట్:
స్ట్రాబెర్రీ:
పుచ్చకాయ:
ఉల్లిపాయ:
ఉల్లిపాయ (Onion) లో శక్తివంతమైన యాంటీ బాక్టీరియల్, యాంటీమైక్రోబయల్ లక్షణాలు ఉంటాయి. ఇవి దంత క్షయానికి కారణమయ్యే నోటి బ్యాక్టీరియాన్ని నాశనం చేస్తాయి. సలాడ్ రూపంలో ఉల్లిపాయ తీసుకుంటే.. నోటి ఆరోగ్యానికి మంచిది.
Also Read: Snoring Problem: గురక సమస్యకు ఈ చిట్కాలు పాటించండి..