Walnuts: వాల్ నట్స్‌తో అలాంటి సమస్యలకు చెక్.. రోజూ 5 తింటే చాలు!
Walnuts: పోషక విలువలున్న ఆహార పదార్థాల్లో వాల్ నట్స్ కు ప్రత్యేక స్థానం ఉంది. ఒక ఔన్సు వాల్ నట్ లో 4 గ్రాముల ప్రొటీన్, 2 గ్రాముల ఫైబర్, కార్బో హైడ్రేట్లు, మాంగనీస్, మెగ్నీషియం, జింక్, సెలీనియం, పాస్పరస్, విటమిన్ బీ, ఈ తో పాటు కొవ్వు పదార్థాలు ఉంటాయి
- By Anshu Published Date - 07:30 AM, Mon - 7 November 22

Walnuts: పోషక విలువలున్న ఆహార పదార్థాల్లో వాల్ నట్స్ కు ప్రత్యేక స్థానం ఉంది. ఒక ఔన్సు వాల్ నట్ లో 4 గ్రాముల ప్రొటీన్, 2 గ్రాముల ఫైబర్, కార్బో హైడ్రేట్లు, మాంగనీస్, మెగ్నీషియం, జింక్, సెలీనియం, పాస్పరస్, విటమిన్ బీ, ఈ తో పాటు కొవ్వు పదార్థాలు ఉంటాయి. దాంతో పాటు వాల్ నట్స్ తీసుకోవడం వల్ల యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ ఫ్లమేటరీ లభ్యమవుతాయి. శరీరానికి మేలు చేసే ఒమేగా3 కొవ్వులు లభిస్తాయి.
చిగుళ్ల పటిష్టతకు వాల్ నట్స్ ఉపకరిస్తాయి. వాల్ నట్స్ లోని కొవ్వు ఆమ్లాలు మనకు చాలా రకాలుగా బెనిఫిట్స్ అందిస్తాయి. ముఖ్యంగా మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకొనేందుకు ఇవి దోహదపడతాయి. వాల్ నట్స్ రోజూ తీసుకోవడం వల్ల అల్జీమర్స్ లాంటి బ్రెయిన్ సంబంధ జబ్బులు రాకుండా అరికట్టవచ్చు.
వాల్ నట్స్ లో ఉండే ఒమేగా3 ఫ్యాటీ యాసిడ్స్.. నోట్లో చిగుళ్ల సమస్యలను దూరం చేస్తాయి. వాల్ నట్స్ లోని గుణాలు మెదడు పనితీరు మెరుగుపరుస్తాయి. డిప్రెషన్ సమస్యతో బాధపడుతున్న వారు వాల్ నట్స్ తీసుకుంటే నిరాశ తగ్గి ఉత్సాహంగా ఉండగలుగుతారు. బాదం, పిస్తాతో పాటు వివిధ రకాల నట్స్, బెర్రీల కంటే వాల్ నట్స్ లో అధికంగా యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.
రోగ నిరోధక శక్తి పెరుగుతుంది..
వాల్ నట్స్ లోని పోషకాలు పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. జీర్ణక్రియ, జీర్ణ శక్తి పెరుగుతాయి. బలమైన రోగ నిరోధక శక్తిని వాల్ నట్స్ ఇస్తాయి. వీటిలోని ప్రీ బయాటిక్ గుణాలు శరీరంలోని పేగు ఆరోగ్యాన్ని రక్షిస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచే మంచి బ్యాక్టీరియాలు వృద్ధి చెందుతాయి. ఊబకాయంతో బాధ పడుతున్న వారు, అధికంగా ఆహారం తీసుకుంటున్న వారు కూడా వాల్ నట్స్ ను తినడం వల్ల అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. ఆకలిని తగ్గించి బరువును నియంత్రించడంలో తోడ్పడతాయి.