Food: ఖాళీ కడుపుతో పొరపాటున కూడా వీటిని అస్సలు తినకండి.. తిన్నారో అంతే సంగతులు!
Food: పొరపాటున కూడా కాళీ కడుపుతో కొన్నింటిని అసలు తినకూడదని, వాటి వల్ల అనేక సమస్యలు వస్తాయి అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. మరి ఖాళీ కడుపుతో ఎలాంటివి తినకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 07:00 AM, Sun - 12 October 25

Food: చాలామంది ఉదయం నిద్ర లేవగానే కొన్ని రకాల ఆహార పదార్థాలు డ్రింక్స్ వంటివి తీసుకుంటూ ఉంటారు. రాత్రంతా కడుపు ఖాళీగా ఉంటుంది కాబట్టి ఉదయం లేవగానే ఏదో ఒకటి అని తినేస్తూ ఉంటారు. కానీ ఆ అలవాటు మంచిది కాదని చెబుతున్నారు. కొన్ని రకాల ఆహార పదార్థాలను ఖాళీ కడుపుతో తీసుకుంటే అవి జీర్ణ వ్యవస్థను దెబ్బతీసి, అసిడిటీ, గ్యాస్, ఇతర అనారోగ్య సమస్యలకు దారితీస్తాయట. అందుకే పరగడుపున తినే కొన్ని రకాల ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని చెబుతున్నారు. చాలా మంది తమ రోజును టీ లేదా కాఫీలతో ప్రారంభిస్తూ ఉంటారు.
కానీ ఖాళీ కడుపుతో వీటిని తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదట. ఎందుకంటే వీటిలో ఉండే కెఫీన్, ఇతర పదార్థాలు కడుపులో హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉత్పత్తిని పెంచుతాయట. దీనివల్ల అసిడిటీ, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయట. జీర్ణవ్యవస్థపై ఒత్తిడి పెరుగుతుందని చెబుతున్నారు. అందుకే ఉదయం లేవగానే ముందుగా ఒక గ్లాసు గోరు వెచ్చని నీళ్లు తాగడం మంచిది అని చెబుతున్నారు. నారింజ, నిమ్మ, ద్రాక్ష వంటి సిట్రస్ పండ్లు ఆరోగ్యానికి మంచివే అయినా, వాటిలో సిట్రిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుందట. ఖాళీ కడుపుతో వీటిని తింటే లేదా జ్యూస్ రూపంలో తాగితే కడుపులో యాసిడ్ ఉత్పత్తి మరింత పెరిగి, గుండెల్లో మంట, గ్యాస్ట్రిక్ సమస్యలు, అల్సర్ వంటివి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.
అలాగే వీటిలో అధికంగా ఉండే ఫైబర్, ఫ్రక్టోజ్ ఖాళీ కడుపుపై ఒత్తిడిని పెంచుతాయని చెబుతున్నారు. ఉదయం పూట ఖాళీ కడుపుతో కారం, మసాలాలు ఎక్కువగా ఉండే ఆహారాలు తినడం అస్సలు మంచిది కాదని చెబుతున్నారు. ఇవి కడుపు పొరను చికాకు పెట్టి, యాసిడ్ రిఫ్లెక్స్, కడుపులో మంట, అజీర్ణం వంటి సమస్యలకు దారితీస్తాయట. ఖాళీ కడుపుతో కూల్ డ్రింక్స్ లేదా కార్బోనేటేడ్ పానీయాలు వంటివి తాగితే వాటిలోని కార్బన్ డయాక్సైడ్ కారణంగా కడుపులో ఒత్తిడి పెరిగి గ్యాస్, ఉబ్బరం, యాసిడ్ రిఫ్లెక్స్ వంటి సమస్యలు వస్తాయని చెబుతున్నారు. అలాగే ఇవి శ్లేష్మ పొరను కూడా దెబ్బతీసే అవకాశం ఉందని చెబుతున్నారు. అదేవిధంగా అరటిపండులో మెగ్నీషియం అధికంగా ఉంటుందట.
ఖాళీ కడుపుతో అరటిపండు తింటే, రక్తంలో మెగ్నీషియం స్థాయిలు అకస్మాత్తుగా పెరుగుతాయట. గుండెపై ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉందని చెబుతున్నారు. పెరుగు ఆరోగ్యకరమైనదే అయినప్పటికీ ఖాళీ కడుపుతో తింటే,దానిలోని లాక్టిక్ యాసిడ్ కారణంగా కడుపులోని ఆమ్లత్వం పెరిగి అందులోని మంచి బ్యాక్టీరియా కూడా నాశనం అవుతుందని చెబుతున్నారు. పచ్చి కూరగాయల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. వీటిని ఖాళీ కడుపుతో తింటే జీర్ణం కావడం కష్టమై, కడుపు నొప్పి, అజీర్తి వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం కూడా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఖాళీ కడుపుతో ఆరోగ్యానికి మంచిది కదా అని పచ్చి కూరగాయలు తినడం మానుకోవాలి అని చెబుతున్నారు.