Daughter’s Wedding: మీ కూతురి పెళ్లిలో పొరపాటున కూడా ఈ వస్తువులను బహుమతిగా ఇవ్వకండి!
కూతురి పెళ్లిలో మొదటి నుంచి వీడ్కోలు వరకు ఎన్నో సంప్రదాయాలు పాటిస్తారు. ఇందులో తండ్రి, కుటుంబసభ్యులు కూడా తమ తమ సామర్థ్యం, ఇష్టానుసారంగా కూతురికి బహుమతులు అందజేస్తారు.
- By Gopichand Published Date - 10:23 AM, Sat - 21 December 24

Daughter’s Wedding: పెళ్లి అనేది రెండు కుటుంబాల కలయిక. మూడు ముళ్ల బంధంతో (Daughter’s Wedding) ఇద్దరు వ్యక్తులు జీవితాంతం కలిసి ఉండాల్సి ఉంటుంది. పెళ్లికి ముందు పెద్దలు ఎన్నో ఆలోచనలు చేస్తారు. ముఖ్యంగా అమ్మాయి తరపున వాళ్లు తమ కూతురి జీవితం ఎలా ఉంటుంది? అబ్బాయికి ఎలాంటి గుణగణాలు ఉన్నాయో తెలుసుకుని ఆ తర్వాత తమ పిల్లను ఇచ్చేందుకు ఆసక్తి చూపుతారు. అయితే కొన్ని శాస్త్రాల ప్రకారం అమ్మాయికి పెళ్లి చేసిన తర్వాత కొన్ని వస్తువులను తల్లిదండ్రులు ఇవ్వకూడదు. ఆ వస్తువులు ఇస్తే కొత్త పెళ్లైన ఆ జంటలో విభేదాలు వస్తాయని అంటుంటారు.
కూతురి పెళ్లిలో మొదటి నుంచి వీడ్కోలు వరకు ఎన్నో సంప్రదాయాలు పాటిస్తారు. ఇందులో తండ్రి, కుటుంబసభ్యులు కూడా తమ తమ సామర్థ్యం, ఇష్టానుసారంగా కూతురికి బహుమతులు అందజేస్తారు. అయితే పొరపాటున కూడా కూతురికి తల్లిదండ్రులు ఈ వస్తువులు ఇవ్వకూడదు. వాటిని ఇవ్వడం ద్వారా సమస్యలను ఎదుర్కోవడమే కాదు.. కూతురితో సంబంధంలో కూడా చీలికలు వచ్చే అవకాశం ఉంటుంది.
పెద్దల ప్రకారం.. కొన్ని వస్తువులను కుమార్తెకు ఎప్పుడూ ఇవ్వకూడదు. ఇది మీ ఇంటిలోని బంధాలను విచ్ఛిన్నం చేయొచ్చు. దీనివల్ల కూతురితో సంబంధంలో కూడా చీలిక వస్తుంది. కూతురికి వీడ్కోలు పలికే సమయంలో ఎలాంటి వస్తువులు ఇవ్వకూడదో ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
Also Read: Bajaj Chetak: ఏంటి ఐఫోన్ కంటే తక్కువ ధరకే ఎలక్ట్రిక్ స్కూటరా.. బంపర్ ఆఫర్ ను ప్రకటించిన బజాజ్!
ఇలాంటి వస్తువులు ఇవ్వకండి
వీడ్కోలు సమయంలో కుమార్తెకు సూది, కత్తి లేదా ఏదైనా పదునైన వస్తువు ఇవ్వకూడదు. వాస్తు ప్రకారం ఇలా చేయడం వల్ల రెండు కుటుంబాల మధ్య బంధుత్వాలు చెడిపోతాయి.
జ్యోతిష్యుల ప్రకారం కూతురి పెళ్లి తర్వాత వీడ్కోలు సమయంలో పొరపాటున కూడా పచ్చళ్లు ఇవ్వకూడదు. దీనివల్ల సంబంధాలలో చికాకు ఏర్పడుతుంది. దీనితో పాటు ప్రారంభంలో అల్లుడికి ఊరగాయలు తినిపించకూడదు.
కూతురి పెళ్లి అయ్యాక వీడ్కోలుగా పొరపాటున కూడా గ్యాస్ స్టవ్ ఇవ్వకూడదు. ఇది సంబంధాలపై చెడు ప్రభావం చూపుతుంది. లక్ష్మిదేవి కూడా కోపం వస్తుంది.
మీ కుమార్తెకు వీడ్కోలు పలికిన తర్వాత మీరు పొరపాటున ఆమెకు చీపురు ఇవ్వకూడదు. ఇలా చేయడం వల్ల ఆమె కుటుంబ జీవితంలో ఆనందం లోపిస్తుంది.