Bald Hair : టోపీ పెట్టుకుంటే బట్టతల వస్తుందా…నిజమేనా..?
బట్టతల...నేటికాలంలో చాలామంది ఎదుర్కొంటున్న సమస్య. పదికేళ్లు నిండాయో లేదో బట్టతల వస్తుంది.
- Author : hashtagu
Date : 03-09-2022 - 7:00 IST
Published By : Hashtagu Telugu Desk
బట్టతల…నేటికాలంలో చాలామంది ఎదుర్కొంటున్న సమస్య. పదికేళ్లు నిండాయో లేదో బట్టతల వస్తుంది. తలమీద నాలుగు వెంట్రుకలు ఉంటేనే అందం. ఆ నాలుగు కాస్త ఊడుతే. ఎవరికీ చెప్పుకోలేని బాద. కొందరికి యుక్త వయస్సులోనే బట్టతల కలవరపెడుతుంది. ఇంకొంతమందికి వయస్సు ముదిరినా..జట్టు అలాగే ఉంటుంది. ఇక బట్టతల వచ్చినవాళ్లు..డబ్బు ఉంటే హెయిర్ ట్రీట్ మెంట్ చేయించుకోవడం లేదంటే ఇతర మార్గాలను అనుసరిస్తుండం చేస్తుంటారు.
కానీ చాలామందికి బట్టతల విషయంలో అపోహలెన్నో ఉన్నాయి. అందులో ఒకటి టోపీ పెట్టుకుంటే బట్టతల వస్తుందని. కానీ అందులో ఏమాత్రం నిజం లేదని నిపుణులు అంటున్నారు. టోపీ పెట్టుకోవడం వల్ల బట్టతల అస్సలే రాదట. వంశపార్యపరంగానే బట్టతల వచ్చే అవకాశం ఉంటుందట. లేదంటే మన జీవనశైలి…మనం తీసుకునే ఆహారం, కలుషిత వాతావరణం ఇవన్నీ కూడా బట్టతలకు కారణం అవుతాయంటున్నారు.
వీటితోపాటు అధిక ఒత్తిడి, పోషకారలోపం, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వంటి కారణాల వల్ల బట్టతల వచ్చే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. అంతేకానీ టోపీ పెట్టుకోవడం వల్ల బట్టతల వస్తుందనడం ఒక అపోహ మాత్రమే.
అయితే కొందరికి జుట్టులో చెమట వస్తే..దురద సమస్య వస్తుంది. చుండ్రు కూడా వస్తుంది. అలాంటివాు టోపీ ధరించకపోవడం మంచిది. మిగతావాళ్ల నిరభ్యంతరంగా టోపీని పెట్టుకోవచ్చు. బట్టతల వస్తుందని అస్సలు భయపడాల్సిన అవసరం లేదు.