Sorghum Bread Benefits : చలికాలంలో జొన్న రొట్టె తింటే ఏం జరుగుతుందో మీకు తెలుసా..?
మీరు మీ ఆహారంలో జొన్నరొట్టెలు (Sorghum Bread) తీసుకోవటం ఉత్తమం. ఇది మనల్ని ఎన్నో రోగాలకు దూరంగా ఉంచుతుంది.
- Author : Naresh Kumar
Date : 02-01-2024 - 1:20 IST
Published By : Hashtagu Telugu Desk
Benefits of Eating Sorghum Bread in Winter Season : మామూలుగా చలికాలంలో ఆరోగ్యం పై ప్రత్యేక జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే చలికాలంలో మన జీర్ణ వ్యవస్థలో ఒక నిరోధక శక్తి బలహీనపడతాయి. దాంతో అనేక రకాల అనారోగ్య సమస్యలు ఇన్ఫెక్షన్ లు వస్తాయి. అయితే మరి శీతాకాలంలో ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం తినే ఆహార పదార్థాల్లో కొన్ని రకాల మార్పులు చేసుకోవాల్సిందే. అందులో బాగంగా మీరు మీ ఆహారంలో జొన్నరొట్టెలు (Sorghum Bread) తీసుకోవటం ఉత్తమం. ఇది మనల్ని ఎన్నో రోగాలకు దూరంగా ఉంచుతుంది. చలికాలంలో ఈ జొన్న రొట్టెలు (Sorghum Bread) తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది. మరి శీతాకాలంలో జొన్న రొట్టె (Sorghum Bread) తీసుకుంటే ఇంకా ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
We’re now on WhatsApp. Click to Join.
చలికాలంలో గోధుమ రొట్టెల కంటే జొన్న రొట్టెలు తింటే ఆరోగ్యానికి మంచిది. జొన్నల్లో కాల్షియం, ఫాస్పరస్, పొటాషియం, ఐరన్, ప్రోటీన్, విటమిన్-బి, కాంప్లెక్స్ వంటి ఎన్నో పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఇలాంటి జొన్నలు మన శరీరాన్ని ఎన్నో వ్యాధుల నుంచి రక్షిస్తాయి. జొన్న రొట్టె తినడం వల్ల మన జీర్ణవ్యవస్థ బలంగా ఉంటుంది. అలాగే ఎన్నో వ్యాధుల ముప్పు తప్పుతుంది. జొన్న రొట్టెలు తీసుకోవటం వల్ల తగినంత మొత్తంలో ఫైబర్ కంటెంట్ అందుతుంది. దీంతో ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉంటుంది.
దీనివల్ల మీరు అతిగా తినలేరు. ఈ రొట్టెల్లో ఉండే ఫైబర్ కంటెంట్ కడుపు నిండుగా ఉంచి బరువును నియంత్రిస్తుంది. ఇది మన జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. జొన్న రొట్టెలను తినడం వల్ల మలబద్దకం లాంటి సమస్యలు తగ్గిపోతాయి. జొన్నలు మన గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి కూడా సహాయపడుతుంది. ఇందులో ఉండే పొటాషియం, మెగ్నీషియం మన గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే చలికాలంలో జొన్న రొట్టెను ఖచ్చితంగా తినాలి. జొన్న రొట్టె ఎముకల ఆరోగ్యానికి కూడా ప్రయోజనకరంగా పనిచేస్తుంది.
చలికాలంలో ఈ రొట్టెను తింటే మన ఎముకలు బలంగా ఉంటాయి. జొన్నల్లో ఉండే ప్రోటీన్ కండరాలు, ఎముకలను బలోపేతం చేస్తుంది. మధుమేహులకు జొన్న రొట్టెలు ఎంతో మేలు చేస్తాయి. చలికాలంలో జొన్న రొట్టెను తింటే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. కాబట్టి షుగర్ వ్యాధి ఉన్నవారు జొన్న రొట్టెలు తినడం ఆరోగ్యానికి ఇంకా మంచిది.
Also Read: Online Shopping : ఆన్ లైన్ షాపింగ్ ప్రియులకు గుడ్ న్యూస్.. జీమెయిల్ లో సరికొత్త ఫీచర్స్ మీకోసమే..