HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Life Style
  • >Do You Have A Habit Of Drinking Alcohol If So Be Careful With Its Consumption

Alcohol: మీకు ఆల్కహాల్ తాగే అలవాటు ఉందా..? అయితే వీటి వినియోగంలో జాగ్రత్త…!!

  • Author : Vamsi Chowdary Korata Date : 29-06-2026 - 4:55 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Do you have a habit of drinking alcohol? If so, be careful with its consumption...!!
Do you have a habit of drinking alcohol? If so, be careful with its consumption...!!

మన జీవనశైలే… అనారోగ్య సమస్యలకు కారణమవుతోంది. థైరాయిడ్, మధుమేహం, రక్తపోటు, ఒత్తిడి, మానసిక కుంగుబాటు, గుండె జబ్బులు, కొలెస్ట్రాల్ ఇలా ఎన్నో సమస్యలు మనల్ని చుట్టుముడుతున్నాయి. వీటి కోసం రోజువారీగా ఔషధాలు తీసుకోవడం తప్పనిసరి అవుతోంది. అదే సమయంలో ఆల్కహాల్ సేవించే అలవాటు ఉంటే… ఈ ఔషధాలు తీసుకునే వారి పరిస్థితి ఏంటనేది ప్రశ్నార్థకం. కొన్ని రకాల ఔషధాలను ఆల్కహాల్‌తో అస్సలు తీసుకోకూడదు. అలా తీసుకుంటే వ్యతిరేక ప్రభావం జరుగుతుంది.

అలెర్జీ నివారణకు….

బెనడ్రిల్ అనేది దగ్గు మందు. దీని గురించి అందరికీ తెలుసు. దీనితో పాటు ఇతర అలెర్జీ, జలుబు నివారణకు వాడే యాంటీ హిస్టామిన్ ఔషధాలను ఆల్కహాల్‌తో కలవకుండా చూసుకోవాలి. ఇవన్నీ కలిపి తీసుకున్నట్లయితే తీవ్రమైన మగత ఆవహిస్తుంది. దీనివల్ల నిర్ణయాలను సరిగ్గా తీసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది.

ఎపిలెప్సీ మందులు…

మూర్ఛ నివారణకు వాడే మందు బిళ్లలను ఆల్కహాల్‌తో కలిపి తీసుకోకూడదు. మూర్ఛ రాకుండా చూసుకోవడం చాలా కీలకం. కాబట్టి ఈ మందులకే ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. లేదంటే మూర్ఛలు మళ్ళీ వస్తుంటాయి. ఆల్కహాల్ సేవించిన తర్వాత మూర్ఛ నివారణ ఔషధాలను తీసుకోవడం వల్ల అవి పనిచేయకుండా పోతాయి.

యాంటీ డిప్రెసెంట్స్ ..

జ్ఞాపకశక్తి కోల్పోవడం, నాడీ మండల వ్యవస్థ బలహీనత, శ్వాస నిదానంగా తీసుకోవడం అనేవి యాంటీ డిప్రెసెంట్ ఔషధాలను ఆల్కహాల్ తీసుకున్న తర్వాత వేసుకోవడం వల్ల వస్తాయి.

మధుమేహం….

మన దేశంలో షుగర్ వ్యాధిగ్రస్తుల సంఖ్య గణనీయంగా పెరిగుతోంది. గ్లూకోఫేజ్, ఒరినేస్, డయ్ బినేస్ వంటి ఔషధాలను షుగర్ నియంత్రణ కోసం వైద్యులు సూచిస్తుంటారు. వీటిని తీసుకునేటప్పుడు ఆల్కహాల్‌కు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. షుగర్ ఉన్నవారు ఆల్కహాల్ తీసుకుంటే గుండె స్పందనలు వేగంగా పెరిగి ప్రమాదం ఉంటుంది.

గుండె జబ్బుల మందులు…

ఛాతీలో నొప్పి వచ్చి, గుండె వైద్యులను సంప్రదించనట్లయితే, గుండె జబ్బులు రాకుండా నివారణ మందులు ఇస్తారు. కానీ ఇవి తీసుకునేటప్పుడు ఆల్కహాల్‌ను దూరం పెట్టాలని వైద్యులు సూచిస్తున్నారు. రక్తంలో గడ్డలు ఏర్పరకుండా వైద్యులు సూచించే మందులను కూడా ఆల్కహాల్‌తో కలిపి తీసుకోకూడదు. దీనివల్ల అంతర్గత రక్తస్రావం ఏర్పడుతుంది. ఔషధాల వల్ల దుష్ప్రభావాలు కూడా ఉంటాయి. వాటి పట్ల మరింత అవగాహన కలిగి ఉండాలి. అవసరమైతే ఔషధాలను సిఫారసు చేసిన వైద్యుడిని అడిగి వివరాలు తెలుసుకోవడం ముఖ్యం.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • alcohol
  • alcohol and health
  • Alcohol Bottle
  • Alcohol Consumption
  • Alcohol Drinking
  • Life Style
  • Medications
  • mix

Related News

Anger and irritability... which vitamin deficiency causes them?

Vitamin Deficiency: కోపం, చిరాకు.. ఏ విటమిన్ లోపం వల్ల వస్తాయి?

Vitamin Deficiency: కోపం రావడం అనేది సహజం. కానీ ఎవరైనా అకస్మాత్తుగా చాలా చిరాకుగా, కోపంగా ప్రవర్తించడం ప్రారంభిస్తే వారి శరీరంలో ఏదైనా విటమిన్ లోపం (Vitamin Deficiency) ఉండవచ్చు. కోపం అనేది మనల్ని ఎప్పుడైనా ఇబ్బందుల్లోకి నెట్టే విషయం, ఎందుకంటే ఆ సమయంలో ప్రజలు తాము సరైన పని చేస్తున్నారో లేదో కూడా అర్థం చేసుకోలేని మానసిక స్థితిలో ఉంటారు. వారికి తమకే అన్యాయం జరుగుతున్న విషయం కూడా తెలియకపోవచ్చు. క

  • Do this to sleep soundly at night!

    Sleep: రాత్రిపూట హాయిగా నిద్రపోవాలంటే ఇలా చేయండి!

Latest News

  • NTR Trivikram: ఎన్టీఆర్‌-త్రివిక్రమ్‌ మూవీ.. ఫ్యాన్స్‌కు పండగ.. పోస్టర్ అదిరిందిగా

  • DSP Transfers: తెలంగాణలో భారీగా డీఎస్పీల బదిలీలు

  • Alcohol: మీకు ఆల్కహాల్ తాగే అలవాటు ఉందా..? అయితే వీటి వినియోగంలో జాగ్రత్త…!!

  • Ashok Gajapathi Raju: నా స్థలాన్ని ప్రభుత్వ భూమిగా మార్చారు: అశోక్ గజపతిరాజు

  • Hero MotoCorp : హీరో మోటోకార్ప్ సరికొత్త ప్రయోగం.. మార్కెట్లోకి ‘ప్యాషన్+ డిస్క్’ లాంచ్!

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd