Glowing Skin: అందంగా యవ్వనంగా కనిపించాలి అంటే మీ డైట్ లో ఈ ఫుడ్స్ ని చేర్చుకోవాల్సిందే!
అందంగా యంగ్ గా కనిపించడం కోసం కేవలం బ్యూటీ ప్రొడక్ట్స్ ఉపయోగించడం మాత్రమే కాకుండా ఇప్పుడు చెప్పబోయే సూపర్ ఫుడ్స్ ని మీ డైట్ లో చేర్చుకుంటే మరిన్ని మంచి ఫలితాలు గలుగుతాయని చెబుతున్నారు.
- By Anshu Published Date - 04:00 PM, Mon - 7 April 25

చర్మం అందంగా ఆరోగ్యంగా ఉండడం కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అందుకోసం మార్కెట్లో దొరికే రకరకాల బ్యూటీ ప్రొడక్ట్స్ ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరుగుతూ వేలకు వేలు డబ్బులు ఖర్చు చేస్తూ ఉంటారు. అయితే శరీరం కొల్లాజెన్ ఉత్పత్తి తగ్గిపోతే చర్మం ఉజ్వలత కోల్పోతుందట. ముడతలు ఏర్పడుతాయట. సహజంగా కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచేందుకు కొన్ని ఇంటి చిట్కాలను పాటిస్తే చర్మం మరింత కాంతివంతంగా మారుతుందని చెబుతున్నారు. ఇంతకీ మరి కొల్లాజెన్ ను పెంచే ఆ ఫుడ్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
చర్మానికి అవసరమైన కొల్లాజెన్ స్థాయిని పెంచేందుకు విటమిన్ సి చాలా అవసరం. సిట్రస్ జాతికి చెందిన నిమ్మ, నారింజ, బత్తాయి, ఉసిరికాయ వంటి పండ్లలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుందట. ఇవి రోజూ ఆహారంలో తీసుకుంటే చర్మం ప్రకాశిస్తుందట. అలాగే నిమ్మరసం లేదా నిమ్మ తొక్కను ఫేస్ ప్యాక్ లుగా ఉపయోగిస్తే సహజంగా మెరుపు వస్తుందట. శరీరంలో కొల్లాజెన్ స్థాయిని పెంచాలంటే ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలట. అయితే మాంసాహారం తినేవారు గుడ్లు, చేపలు వంటి ఆహారాన్ని తీసుకోవడం వల్ల కొల్లాజెన్ స్థాయి పెరుగుతుందట. ఇక శాకాహారులు పనీర్, పెరుగు, పప్పులు, బీన్స్ వంటి ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ ను తినడం వల్ల సహజ కొల్లాజెన్ ఉత్పత్తి పెరుగుతుందని చెబుతున్నారు. అదేవిధంగా చర్మానికి మెరుపుని అందించేందుకు కొల్లాజెన్ సప్లిమెంట్స్ కూడా చాలా ఉపయోగపడతాయట.
అయితే ఎటువంటి సప్లిమెంట్స్ తీసుకోవాలి అనే విషయంపై వైద్యుల సలహా తీసుకోవడం మంచిది. కాగా సరైన మోతాదులో తీసుకుంటే చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని చెబుతున్నారు. కొల్లాజెన్ స్థాయి తగ్గిపోవడానికి తగినంత నిద్ర లేకపోవడం ఒక కారణం అని చెబుతున్నారు. ప్రతిరోజూ కనీసం 7 నుంచి 8 గంటలు నిద్రపోతే శరీరం కొల్లాజెన్ ఉత్పత్తిని మెరుగుపరచగలదట. నిద్ర సరిపోకపోతే చర్మం ముడతలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. కాబట్టి తగినంత విశ్రాంతిని తీసుకోవడం తప్పనిసరి అని చెబుతున్నారు. ఆరోగ్యకరమైన మానసిక స్థితి కూడా చర్మంపై ప్రభావం చూపుతుందట. స్ట్రెస్ ఎక్కువగా ఉంటే కొల్లాజెన్ ఉత్పత్తి తగ్గిపోతుందట. దీని వల్ల చర్మం మెరుపును కోల్పోతుందట. కాగా ప్రతిరోజూ ఆనందంగా, ప్రశాంతంగా ఉంటే సహజ కొల్లాజెన్ ఉత్పత్తి పెరిగి చర్మం మరింత అందంగా మారుతుందని చెబుతున్నారు. అలాగే సరైన జీవనశైలిని కూడా పాటించాలట. నీటిని ఎక్కువగా తాగడం వల్ల శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటుంది. దీంతో చర్మం కాంతివంతంగా కనిపిస్తుందట. కాబట్టి వేసవిలో వీలైనంతవరకు ఎక్కువగా ద్రవపదార్థాలు నీటిని ఎక్కువగా తీసుకోవడం మంచిదని చెబుతున్నారు. రోజూ యోగా, మెడిటేషన్ వంటి అలవాట్లను పాటిస్తే ఒత్తిడి తగ్గి చర్మం ఆరోగ్యంగా ఉంటుందట. ఫాస్ట్ ఫుడ్, షుగర్ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తగ్గించి పోషకాహారం తీసుకోవాలని చెబుతున్నారు. ఈ చిన్న చిట్కాలను పాటిస్తే సహజంగా కొల్లాజెన్ ఉత్పత్తి పెరిగి చర్మం కాంతివంతంగా, ఆరోగ్యంగా మారుతుందట.