HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Life Style
  • >Are You Tired Of White Hair If You Mix Some Ingredients With Turmeric It Will Turn Your Hair Black

Dye Hair : తెల్లజుట్టుతో విసిగిపోయారా, పసుపులో కొన్ని పదార్థాలు కలిపి రాస్తే నల్లగా నిగనిగ!

  • By Vamsi Chowdary Korata Published Date - 01:13 PM, Fri - 21 November 25
  • daily-hunt
Dye Hair
Dye Hair

జుట్టు తెల్లబడడం ఎవరికీ ఇష్టముండదు. అలాంటివారు జుట్టుని నల్లగా మార్చుకునేందుకు హెయిర్ కలర్స్, డైలు వాడుతుంటారు. దీని వల్ల జుట్టు నల్లగా మారుతుంది. కానీ, మార్కెట్లో దొరికే డైలలో ఎక్కువగా కెమికల్స్ ఉంటాయి. ఇవి అలర్జీలకి కారణమవుతాయి. దురద, కురుపులు, రాషెస్ వంటి సమస్యలొస్తాయి. అంతేకాకుండా, జుట్టు కూడా పాడవుతుంది. అలా కాకుండా జుట్టుని నేచురల్‌గానే నల్లగా మార్చుకోవాలంటే ఏం చేయాలో తెలుసుకోండి.

తెల్లజుట్టు ఉంటే ఎవరికైనా ఇబ్బందిగా ఉంటుంది. దీని వల్ల చిన్నవయసులోనే పెద్దవారిలా కనిపిస్తారు. అందుకే, జుట్టుని నల్లగా మార్చుకునేందుకు చాలా మంది అనేక ప్రయత్నాలు చేస్తారు. అయితే, అందులో కెమికల్స్‌తో కూడిన కలర్స్, డైలు కాకుండా ఇంట్లోనే ఉండే కొన్ని పదార్థాలతో జుట్టుని నల్లగా మార్చుకోవచ్చు. వీటివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. పైగా జుట్టు నల్లగా మారుతుంది. జుట్టు డ్యామేజ్ కూడా అవ్వదు. పైగా ఇవనన్నీ కూడా జుట్టు సమస్యల్ని తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి. జుట్టుని చక్కగా నల్లగా షైనీగా మారేలా చేస్తుంది.

ముందుగా సేజ్, రోజ్ మేరీ ఆకుల్ని సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి. వీటిని ఓ కప్పు వేడినీటిలో ఉంచండి. 10 నిమిషాల పాటు అలానే ఉంచండి. తర్వాత వడకట్టండి.
ఈ నీటిని మీరు స్నానం చేసేటప్పుడు వాడి తలని క్లీన్ చేసుకోండి. రెగ్యులర్‌గా చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది. ​

బ్లాక్ టీ కూడా జుట్టుని నల్లగా మార్చడంలో హెల్ప్ చేస్తుంది.దీనికోసం 3 టీ బ్యాగ్స్‌ని 2 కప్పుల మరిగే నీటిలో వేయండి.5 నిమిషాల పాటు అలానే ఉంచండి.తర్వాత నీటిలో నుంచి టీ బ్యాగ్స్ తీసేసి ఈ నీటిని జుట్టుకి అప్లై చేయండి.
అరగంట తర్వాత జుట్టుని క్లీన్ చేసుకోండి.కావాలనుకుంటే మీరు సేజ్ ఆకుల్ని కూడా కలిపి వాడొచ్చు.

కాఫీ కూడా మంచి హెయిర్ కలర్ అని చెప్పొచ్చు. అయితే, మీరు తీసుకునే కాఫీ పౌడర్ ఆర్గానిక్ అయి ఉండాలి. దీనికోసం మంచి ఆర్గానిక్ కాఫీని తీసుకోండి. దాంతో డీకాషన్ తయారు చేయండి. ఇప్పుడు ఆ కాఫీ డీకాషన్‌ని చల్లారనివ్వండి. ఓ కప్పులో మంచి కండీషనర్ వేయండి. అందులోనే కాఫీ మిక్స్ చేయండి. ఇది నాన్ మెటల్ బౌల్‌లో వేయండి. దీనిని బాగా కలపి జుట్టుకి అప్లై చేయండి. గంటపాటు ఉంచి ఆ తర్వాత జుట్టుని క్లీన్ చేయండి. దీంతో జుట్టుకి మంచి రంగు వస్తుంది.

పసుపు కూడా తెల్ల జుట్టుని నల్లగా చేయడానికి హెల్ప్ చేస్తుంది. పసుపుని కొన్ని పదార్థాలతో కలిపి జుట్టుకి రాస్తే నల్లగా మారుతుంది. 2 టీస్పూన్ల పసుపులో 1 టీస్పూన్ కొబ్బరినూనె కలిపి పేస్టులా చేయండి. దీనిని జుట్టుకి రాసి అలానే 30 నిమిషాల పాటు ఉంచండి. తర్వాత జుట్టుని గోరువెచ్చని నీటితో క్లీన్ చేసుకోండి.

టీస్పూన్ల పసుపు, 2 టీస్పూన్ల ఆవాల నూనె లేదా కొబ్బరి నూనె, 1 ప్యాకెట్ కాఫీ పౌడర్, 2 విటమిన్ ఈ క్యాప్సూల్స్, సగం చెక్క నిమ్మరసం తీసుకోండి. ఇప్పుడు ఓ పాన్‌లో నూనె వేడి చేసి అందులో పసుపు, కాఫీ పౌడర్‌లు వేసి మిశ్రమం నల్లగా మారేవరకూ వేయించాలి. తర్వాత చల్లారనివ్వండి. ఇందులోనే విటమిన్ ఈ క్యాప్సూల్ నుంచి తీసిన ఆయిల్, నిమ్మరసం కలపండి. వీటన్నింటిని బాగా కలపండి. జుట్టుకి అప్లై చేసి 20 నుంచి 30 నిమిషాల పాటు ఉంచండి.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Beauty tips
  • coffee
  • Dye Hair
  • Life Style
  • tea
  • turmeric

Related News

TEA

TEA: రోజుకు ఎన్ని కప్పుల టీ తాగాలి? ఖాళీ కడుపుతో టీ తాగవచ్చా?

ఖాళీ కడుపుతో టీ తాగే బదులు ఇంటి వద్ద తయారుచేసిన డ్రై ఫ్రూట్స్, విత్తనాల మిశ్రమంతో రోజును ప్రారంభించవచ్చు. 2 బాదం, 2 వాల్‌నట్స్, 2 కిస్‌మిస్, పిస్తా, చియా విత్తనాలు, గుమ్మడి గింజలను కలిపి తినవచ్చు.

  • Turmeric Pepper Drink

    Turmeric Pepper Drink: ‎ఖాళీ కడుపుతో ఈ మ్యాజిక్ డ్రింక్ తాగితే చాలు.. హాస్పిటల్ కి వెళ్లాల్సిన పనే లేదు?

  • Trump Tariffs

    Trump Tariffs: ఆహార ఉత్పత్తులపై టారిఫ్‌లు తగ్గిస్తూ ట్రంప్ కీలక నిర్ణయం!

Latest News

  • Madvi Hidma : హిడ్మా ఎన్‌కౌంటర్ ఓ కట్టు కథ.. నిరాయుధులుగా పట్టుకొని చంపారు.!

  • Siddaramaiah vs DK Shivakumar : సీఎం పదవి పై డీకేకు అధిష్టానం క్లారిటీ!

  • BRS Alleges : 9300 ఎకరాల కుంభకోణంలో రేవంత్‌..కేటీఆర్‌ షాకింగ్!

  • SRM University : SRM యూనివర్శిటీకి నోటీసులు..ఈ నెల 24న విచారణ!

  • Weight Loss : బరువు తగ్గడానికి ఏది మంచిది?..రన్నింగ్ లేదా వాకింగ్!

Trending News

    • Shocking Facts : జైపూర్‌లో నాలుగో తరగతి విద్యార్థిని ఆత్మ*హత్య కేసు.. వెలుగులోకి షాకింగ్ నిజాలు!

    • Earthquake : బంగ్లాదేశ్‌లో 5.7 తీవ్రత భూకంపం… కోల్కతా, దక్షిణ బెంగాల్‌లో స్పష్టంగా అనుభవించిన ప్రకంపన!

    • New Smart Ration Card : కొత్త రేషన్ కార్డు కావాలా.. కొత్తగా పెళ్లైన వారికి కూడా శుభవార్త.. చాలా సింపుల్!

    • IPL 2026: ఐపీఎల్ 2026 మినీ వేలం.. ఈ ఆట‌గాళ్ల‌పై రూ. 20 కోట్ల వర్షం కురవనుందా?

    • IND vs SA: సౌతాఫ్రికాతో రెండో టెస్టు.. టీమిండియా కెప్టెన్ ఎవ‌రంటే?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd