Tea Powder : మిగిలిన టీ పౌడర్ ని పారేస్తున్నారా.. అయితే వాటి వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే?
చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే ఈ మిగిలిన టీ పౌడర్ (Tea Powder) వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి..
- Author : Naresh Kumar
Date : 12-12-2023 - 6:00 IST
Published By : Hashtagu Telugu Desk
Benefits of Leftover Tea Powder : మామూలుగా మనం ఇంట్లో టీ చేసిన తర్వాత ఆ వడకట్టిన టీ పౌడర్ ని పారేస్తూ ఉంటాం. కానీ చాలామందికి తెలియని విషయం ఏమిటంటే ఈ మిగిలిన టీ పౌడర్ వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. మరి మిగిలిపోయిన టీ పౌడర్ వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
మిగిలిన టీ పౌడర్ (Tea Powder) సహాయంతో ఇంట్లో ఈగలను తరిమికొట్టవచ్చు. దీనికోసం మీరు ముందుగా మిగిలిన టీ పౌడర్ ను మరగబెట్టాలి. తర్వాత ఈ నీటిలో ఈగలు ఉన్న ప్రదేశాన్ని తుడుచుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల ఈగలు ను తరిమికొట్టవచ్చు. అలాగే వంట గదిలో ఉన్న పాత పెట్టల నుంచి వాసన వస్తుంటే మీరు వాటి వాసనను తొలగించడానికి ఈ చాయ్ పొడిని వాడవచ్చు. దానికోసం ముందుగా మిగిలిన టీ పొడిని (Tea Powder) బాగా ఉడకబెట్టి తర్వాత ఆ బాక్స్ లను అదే నీటిలో నానబెట్టాలి. ఈ విధంగా చేయడం వల్ల బాక్సులు నుంచి వచ్చే వాసన పోతుంది. చాలామంది ఇంట్లో మొక్కలు నాటడానికి ఇష్టపడతారు.
We’re Now on WhatsApp. Click to Join.
అయితే కొన్నిసార్లు కొన్ని కారణాలవల్లే వాటిని జాగ్రత్తగా చూసుకోలేరు. దాని వలన సరైన పోషకాహారం తీసుకోకపోవడం వలన అవి చనిపోతూ ఉంటాయి. మొక్కలను పోషించడానికి మీరు మిగిలిన ఈ చాయ్ పత్తి నీ మొక్కలకు ఎరువుగా వేసుకోవచ్చు. టీ ఆకులలో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. శరీర గాయాలను తగ్గించడానికి దీనిని ఉపయోగించుకోవచ్చు. ముందుగా మిగిలిన టీ ఆకులను శుభ్రం చేసి తర్వాత నీటిలో వేసి మరిగించి చల్లారిన తర్వాత గాయం పై నెమ్మదిగా రుద్దాలి. కొంత సమయం తర్వాత శుభ్రమైన నీటితో గాయాన్ని కడగాలి ఈ చిట్కా గాయాలను తొందరగా నయం చేయడానికి ఉపయోగపడుతుంది. కొన్ని కొన్ని నూనె పాత్రలు ఎంత కడిగినా కూడా వాటిపై ఉన్న జిడ్డు అసలు పోదు. అలాంటప్పుడు ఆ జిడ్డును తొలగించడానికి మీరు మిగిలిన టీ పొడిని బాగా మరిగించి ఆ నీటితో ఆ పాత్రలను శుభ్రం చేస్తే తొందరగా జిడ్డు వదిలిపోతుంది..
Also Read: Sweet Potatoes: ఈ చలికాలంలో చిలగడదుంపలు ఎందుకు తినాలో తెలుసా..?