Yoga In 2026 Asian Games : 2026 ఆసియా గేమ్స్‌లో యోగా.. డెమొన్‌స్ట్రేటివ్ స్పోర్ట్‌గా ఎంపిక
ఏదిఏమైనప్పటికీ మన దేశానికి చెందిన యోగాను(Yoga In 2026 Asian Games) ఆసియా క్రీడల వేదికపై ప్రదర్శించే అవకాశం దక్కడం గొప్ప విషయం.
- By Pasha Published Date - 05:31 PM, Sun - 8 September 24

Yoga In 2026 Asian Games : భారత్‌లో ఉద్భవించిన యోగాకు మరో అరుదైన గౌరవం దక్కబోతోంది. 2026 ఆసియా క్రీడల్లో యోగాను డెమొన్‌స్ట్రేటివ్ స్పోర్ట్‌గా పరిగణించనున్నారు. ఈవిషయంపై ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఏషియా ఆదివారం రోజు అధికారిక ప్రకటన విడుదల చేసింది. మరో విశేషం ఏమిటంటే.. ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఏషియా అధ్యక్షుడిగా రాజా రణ్ బీర్ సింగ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఢిల్లీలోని భారత్ మండపం వేదికగా జరిగిన 44వ ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఏషియా జనరల్ అసెంబ్లీ సమావేశంలో ఆయనను ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఏషియా అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఏదిఏమైనప్పటికీ మన దేశానికి చెందిన యోగాను(Yoga In 2026 Asian Games) ఆసియా క్రీడల వేదికపై ప్రదర్శించే అవకాశం దక్కడం గొప్ప విషయం.
Also Read :Pricey Kabul Tea : తాలిబన్లతో టీ పార్టీ మా కొంప ముంచింది.. పాక్ విదేశాంగ మంత్రి సంచలన కామెంట్స్
- ఆసియా క్రీడలను ఆసియాడ్ గేమ్స్ అని కూడా పిలుస్తుంటారు.
- ఆసియా గేమ్స్‌ను ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తుంటారు.
- 1951లో భారతదేశంలోని న్యూఢిల్లీలో తొలిసారి ఆసియా క్రీడలు జరిగాయి. 1978 వరకు జరిగిన ఆసియా క్రీడలను ఆసియా క్రీడల సమాఖ్య నియంత్రించింది .
- 1982 సంవత్సరంలో ఆసియా క్రీడల సమాఖ్య విడిపోయింది. నాటి నుంచి ఆసియా క్రీడలను ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా నిర్వహిస్తోంది.
- ఆసియా క్రీడలకు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ గుర్తింపు ఉంది.
- ఒలింపిక్ క్రీడల తర్వాత ప్రపంచంలో రెండో అతిపెద్ద క్రీడా ఈవెంట్ ఆసియా గేమ్స్.
- ఇప్పటివరకు తొమ్మిది ప్రపంచ దేశాలు ఆసియా క్రీడలకు ఆతిథ్యం ఇచ్చాయి.
- ఇజ్రాయెల్ సహా నలభై ఆరు దేశాలు ఆసియా క్రీడల్లో పాల్గొన్నాయి.
- చివరిసారిగా ఆసియా క్రీడలు చైనాలోని హాంగ్‌జౌలో 2023 సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 8 వరకు జరిగాయి.
- 2010 సంవత్సరం నుంచి ప్రతిసారి ఆసియా క్రీడలు ముగిసిన కొన్ని రోజులకే ఆసియా పారా గేమ్స్ నిర్వహిస్తున్నారు.
- పారాలింపిక్ క్రీడల మాదిరిగానే ఆసియా పారా గేమ్స్ జరుగుతుంటాయి.