Pricey Kabul Tea : తాలిబన్లతో టీ పార్టీ మా కొంప ముంచింది.. పాక్ విదేశాంగ మంత్రి సంచలన కామెంట్స్
ఆనాడు తాలిబన్లతో కలిసి ఫయాజ్ హమీద్ తాగిన టీకి పాకిస్తాన్ భారీ మూల్యాన్ని(Pricey Kabul Tea) చెల్లించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
- By Pasha Published Date - 04:58 PM, Sun - 8 September 24
Pricey Kabul Tea : పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇసాక్ దార్ శనివారం లండన్ హైకమిషన్ కార్యాలయంలో ప్రసంగిస్తూ కీలక వివరాలను వెల్లడించారు. ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్లు అధికారంలోకి రాగానే జరిగిన ఓ కీలక పరిణామం గురించి వివరించారు. అదేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
Also Read :HYDRA Clarification : ప్రజలు నివసిస్తున్న ఇళ్లను కూల్చే ప్రసక్తే లేదు : హైడ్రా కమిషనర్
‘‘ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్లు అధికారంలోకి వచ్చాక ఘోరం జరిగింది. సాక్షాత్తూ అప్పటి పాక్ ఐఎస్‌ఐ చీఫ్ ఫయాజ్ హమీద్ 2021 సంవత్సరంలో కాబూల్ పర్యటనకు వెళ్లారు. ఆయన తాలిబన్ల ఆతిథ్యం స్వీకరించారు. వాళ్లతో కలిసి టీ తాగారు. ఆనాడు ఫయాజ్ హమీద్ చేసిన తప్పు వల్లే ఇప్పుడు పాకిస్తాన్ తీవ్రంగా నష్టపోతోంది. బెలూచిస్తాన్ వేర్పాటువాదం తారస్థాయికి చేరింది. గత మూడేళ్లలో తెహ్రీక్ ఏ తాలిబన్, బెలూచ్ మిలిటెంట్ సంస్థలు పాక్ గడ్డపై దాడులకు తెగబడుతున్నాయి. తాలిబన్లు తెగబాటు వల్ల పాకిస్తాన్ బాగా నష్టపోతోంది. ఈ ప్రభావం వల్ల దాదాపు 60 బిలియన్ డాలర్ల వ్యయంతో నిర్మించిన చైనా-పాక్ ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్టు భవిష్యత్తు రిస్కులో పడింది’’ అని పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇసాక్ దార్ వెల్లడించారు.
Also Read :Rajnath Singh Questions Omar Abdullah : అఫ్జల్ గురును పూలమాలతో సన్మానించి ఉండాల్సిందా ? : రాజ్‌నాథ్‌సింగ్
అప్పట్లో తాలిబన్లకు మద్దతుగా కొందరు మిలిటెంట్లను పాకిస్తాన్ జైళ్ల నుంచి విడుదల చేయించి, ఆఫ్ఘనిస్తాన్‌కు పంపడంలో ఫయాజ్ హమీద్ పాత్ర ఉందన్నారు. అలా విడుదలైన తాలిబన్ మిలిటెంట్లే ఇప్పుడు బెలూచిస్తాన్‌లో ఉగ్రవాదానికి మాస్టర్‌మైండ్లుగా మారారని ఇసాక్ దార్ తెలిపారు. ఆనాడు తాలిబన్లతో కలిసి ఫయాజ్ హమీద్ తాగిన టీకి పాకిస్తాన్ భారీ మూల్యాన్ని(Pricey Kabul Tea) చెల్లించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. పాక్ ఐఎస్‌ఐ మాజీ చీఫ్ ఫయాజ్ హమీద్‌ను ఇటీవలే ఓ కేసులో అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆయనపై కోర్టు మార్షల్ జరుగుతోంది.