HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >What Is Happening In Madhya Pradesh

Madhya Pradesh Politics : మధ్యప్రదేశ్ లో అసలేం జరుగుతోంది?

కాంగ్రెస్ కి Madhya Pradesh లో కోల్పోయిన ప్రభుత్వాన్ని తిరిగి ప్రతిష్టించుకోవడం కేవలం ఒక ఛాలెంజ్ మాత్రమే కాదు, అది పార్టీ ప్రతిష్టకు సంబంధించిన వ్యవహారంగా మారింది.

  • Author : Hashtag U Date : 04-09-2023 - 10:08 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
What Is Happening In Madhya Pradesh
What Is Happening In Madhya Pradesh

By: డా. ప్రసాదమూర్తి

What is happening in Madhya Pradesh? : అతికీలకమైన అయిదు రాష్ట్రాల ఎన్నికలు దూసుకొచ్చేస్తున్నాయి. కాంగ్రెస్ కి మధ్యప్రదేశ్ (Madhya Pradesh) లో కోల్పోయిన ప్రభుత్వాన్ని తిరిగి ప్రతిష్టించుకోవడం కేవలం ఒక ఛాలెంజ్ మాత్రమే కాదు, అది పార్టీ ప్రతిష్టకు సంబంధించిన వ్యవహారంగా మారింది. మరోవైపు మధ్యప్రదేశ్ (Madhya Pradesh) లో అధికారం కోల్పోతే దొడ్డిదారిన వచ్చిన వారు దొడ్ద దారిన వెళ్ళిపోయారన్న నింద మోయాల్సి వస్తుంది. 2020లో యువ కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింధియా 22 మంది ఎమ్మెల్యేను తనకూడా తీసుకుని బీజేపీలోకి చెక్కేసిన తర్వాత కమల్ నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయింది. పదిహేను నెలల కాంగ్రెస్ ప్రభుత్వం పతనం తర్వాత బీజేపీ గద్దెనెక్కింది. అయితే ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కి రానురాను రాష్ట్రంలో తమ పార్టీ క్యాడర్ మీద పట్టు కోల్పోతున్నట్టు అక్కడ నుంచి దేశమంతా అందుతున్న సంకేతాలు చెప్తున్నాయి.

బీజేపీ నుంచి కీలకమైన నేతలు కాంగ్రెస్ లోకి ప్రయాణిస్తున్నారు. వీరిలో చాలామంది గ్వాలియర్, చంబల్ ప్రాంతాల నుంచి వస్తున్నారు. కేంద్ర మంత్రులైన సింధియాకి, నరేంద్ర సింగ్ తోమర్ కి సొంత ఇంటిలాంటి ఈ ప్రాంతాల నుంచి కాంగ్రెస్ లోకి వలసలు మొదలు కావడం అంటే బీజేపీకి కలవరం కలిగించే విషయమే. ఇద్దరు ఎమ్మెల్యేలు గత రెండు రోజుల్లో బీజేపీ నుంచి జెండా ఎత్తేసి కాంగ్రస్ లోకి జంప్ కొట్టేశారు. శివపురి జిల్లాలో కోలారస్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వీరేంద్ర రఘువంశి బీజేపీకి గుడ్ బై చెప్పిన 24 గంటల్లోనే రెండుసార్లు బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన గిరిజాశంకర్ శర్మ తనది కూడా అదే దారి అని కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. దశాబ్దాలుగా పార్టీకి విధేయంగా ఉన్న కుటుంబం ఆయనది. రఘువంశి ఒకప్పటి కాంగ్రెస్ విధేయుడే. 2013లో బీజేపీలో చేరాడు. 1018 లో కోలారస్ నుంచి బీజేపీ టిక్కెట్ మీద ఎన్నికయ్యాడు. వీళ్ళే కాదు, మరి కొందరు కీలక నాయకులు కూడా బీజేపీకి తిలోదకాలిచ్చి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోడానికి సిద్ధంగా ఉనట్టు కూడా వార్తలు వస్తున్నాయి. వింధ్య ప్రాంతం నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు, మహాకౌశల్, బుందేల్ ఖండ్ నుంచి మరో ఇద్దరు కాంగ్రెస్ లో ఉరకడానికి నడుం బిగిస్తున్నట్టు తెలుస్తోంది.

ఎన్నికలు నాలుగు నెలల కూడా లేని ఈ క్లిష్ట సమయంలో ముఖ్యమైన నేతలు ఎందుకు పాలక పార్టీ నుంచి పలాయనం చిత్తగిస్తున్నారన్న ప్రశ్నకు వీళ్ళందరి నుంచీ ఒకే సమాధానం వినపడుతోంది. అధికార పార్టీలో కొత్తగా చేరిన యువ నాయకత్వం పెద్దలను గౌరవించడం లేదని, నియంతృత్వ ధోరణి పెరిగిపోయిందని, ఎంతో కాలంగా పార్టీని అంటిపెట్టుకుని ఉన్న పెద్ద తలకాయలను నిర్లక్ష్యం చేస్తున్నారని పార్టీని వదులుతున్న వారు చేస్తున్న ఆరోపణ. ఇది సూటిగా జ్యోతిరాదిత్య సింధియా మీద ఎక్కుపెట్టిన బాణమే. సింధియా పార్టీలోకి చేరిన గత మూడున్నర ఏళ్ళలో పాత తరం నాయకులకు అన్నీ అవమానాలు, వేధింపులే ఎదురవుతున్నాయని, మరి ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఇదంతా కళ్ళప్పగించి ఎందుకు మిన్నకుండిపోతున్నారో అర్థం కావడం లేదని తాజాగా బీజేపీకి గుడ్ బై చెప్పిన రఘువంశి అంటున్నారు. దీనికి సింధియా ఒకటే సమాధానం చెప్తున్నారు. ఇదంతా మామూలే. పార్టీలోకి కొందరు వస్తుంటారు. కొందరు పోతుంటారు. ఇది పెద్ద విషయం ఏమీ కాదని సింధియా తేలికగా కొట్టి పారేస్తున్నారు. మరి సింధియా బలంతోనే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ అగ్ర నాయకత్వం ఆయన మీద ఇంకేం చర్యలు తీసుకోగలదు చెప్పండి? ప్రజాస్వామ్యంలో ఎవరు ఎటు పోవాలో ఎటు రావాలో తేల్చుకునే హక్కు అందరికీ వుంటుందని సింధియా లైట్ తీసుకుంటున్నారు. అయితే వాస్తవం మాత్రం పార్టీని ఆందోళనకు గురిచేసే విధంగానే వుంది.

గత మూడు నెలల్లోనే చాల మంది బీజపీ కీలక నేతలు కాంగ్రస్ లోకి దూకేశారు. వీరిలో మాజీ మంత్రి దీపక్ జోషి, మాజీ ఎమ్మెల్యేలు రఘేలాల్ బఘేల్, ధృవ్ ప్రతాప్ సింగ్,యాదవేంద్ర సింగ్, సమందర్ సింగ్, మాజీ బీజేపీ ఎం.పి. మఖన్ సింగ్ సోలంకి ..ఇలా లిస్టు చాలా వుంది. వీళ్ళంతా సామాన్యమైన నాయకులు కాదు. అంతే కాదు, చాలా చాలా మంది బీజేపీ నాయకులు తమతో టచ్ లో ఉన్నారని మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ అంటున్నారు. అయితే పార్టీ స్థానిక నాయకత్వం అంగీకారం మీరకే వీరిని తమ పార్టీలోకి తీసుకోవాలా వద్దా అన్నది నిర్ణయించుకుంటామని అంటున్నారు. దీని అర్థం బీజేపీ నుంచి వస్తున్న వలసల ప్రవాహం మామూలుగా లేదని అర్థమవుతోంది. మరి సింధియా మీద అంకుశం వేసి పార్టీని కాపాడుకుంటారా..లేక చేతులారా అధికార పగ్గాలను కాంగ్రెస్ కి అప్పజెప్పి సింధియా ఉంటే చాలని సరిపెట్టుకుంటారా..బీజేపీ అగ్రనాయకత్వం ఏం చేస్తుందో చూడాలి. వాతావరణం మాత్రం ఎంపీలో బీజేపీకి చాలా ప్రతికూలంగా మారుతోందని ఈ వలసలు చెప్తున్నాయి.

Also Read:  Delhi Liquor: ఢిల్లీ సరికొత్త రికార్డు.. ఏడాది కాలంలోనే రూ.7,285 కోట్ల మందు తాగేసిన మద్యం ప్రియులు..!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • alliance
  • bjp
  • congress
  • india
  • Madhya Pradesh
  • MP Leaders
  • pm modi
  • rahul gandhi

Related News

    Latest News

    • AP : ఐదు బోధనాసుపత్రుల్లో కృత్రిమ అవయవాల తయారీ యూనిట్లు!

    • Plants: కుబేరుడికి ఎంతో ఇష్టమైన ఈ 3 చెట్లను ఇంట్లో ఈ దిక్కున నాటితే చాలు.. కాసుల వర్షం కురుస్తుంది.

    • Stock Market: స్టాక్ మార్కెట్ జోరు..లాభాల్లో ముగిసిన మార్కెట్లు

    • Accident : విధి నిర్వహణలో విషాదం.. లారీ ఢీకొని రవాణా శాఖ అధికారి వెంకన్న మృతి

    • Keir Starmer: బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్‌ రాజీనామా..అసలు కారణాలు ఇవే!

    Trending News

      • Breaking News: అంతుపట్టని మిస్టరీగా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి క్రైమ్ టీం

      • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

      • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd