Delhi Election Results : ప్రజల తీర్పును గౌరవిస్తున్నాం..బీజేపీ నేతలకు శుభాకాంక్షలు : కేజ్రీవాల్
ఢిల్లీ ప్రజల తీర్పును శిరసావహిస్తామన్నారు. పదేళ్లలో ఢిల్లీ ప్రజల కోసం ఎంతో చేశామని చెప్పారు. విద్య, వైద్య మౌలిక సదుపాయాల కోసం ఎంతో కృషి చేసినట్లు వెల్లడించారు.
- By Latha Suma Published Date - 03:41 PM, Sat - 8 February 25

Delhi Election Results : ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం తొలిసారి స్పందించారు. తాను స్వలాభం కోసం రాజకీయాల్లోకి రాలేదని, ప్రజా సేవ చేసేందుకు వచ్చానని అన్నారు. ఎన్నికల్లో ఓడినా ప్రజల వెంటే ఉంటామని అన్నారు. ఢిల్లీ ప్రజల తీర్పును శిరసావహిస్తామన్నారు. పదేళ్లలో ఢిల్లీ ప్రజల కోసం ఎంతో చేశామని చెప్పారు. విద్య, వైద్య మౌలిక సదుపాయాల కోసం ఎంతో కృషి చేసినట్లు వెల్లడించారు. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తామన్నారు.
Read Also: Delhi Election Results : సీఎం రేసులో పర్వేశ్ వర్మ..అమిత్ షాతో భేటీ
ఎన్నికల్లో గట్టిగా పోరాడిన ఆప్ నేతలు, కార్యకర్తలకూ కేజ్రీవాల్ ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను బీజేపీఅమలు చేయాలన్నారు. గెలిచిన బీజేపీ నేతలకు ఈ సందర్భంగా కేజ్రీవాల్ శుభాకాంక్షలు తెలిపారు. ఇన్నాళ్లుగా తాము బీజేపీ గూండాగిరిని ఎదిరించి పోరాడామని, ఇక ముందు కూడా ఢిల్లీ ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటామని కేజ్రీవాల్ చెప్పారు.
కాగా, ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు బీజేపీ దాదాపుగా 47 స్థానాలను కైవసం చేసుకుంది. ఆప్ కేవలం 23 స్థానాలకే పరిమితం అయ్యింది. ఇక కాంగ్రెస్ పార్టీ గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే ఈసారి కూడా ఖాతా తెరువలేదు. అయితే ఎన్నికల ఫలితాలపై ఎన్నికల సంఘం అధికార ప్రకటన చేయాల్సి ఉంది. ఇక, కాగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఆప్ సీనియర్ నాయకులంతా ఊహించని రీతిలో ఓటమి పాలయ్యారు.
Read Also: Parvesh Verma : కేజ్రీవాల్‌ను ఓడించిన పర్వేశ్ ఎంత ఆస్తిపరుడో తెలుసా ?