HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Waqf Bill Before Lok Sabha

Waqf Amendment Bill : లోక్‌సభ ముందుకు వక్ఫ్‌ బిల్లు

అనంతరం దీని పై రిజిజు చర్చ చేపట్టారు. లోక్‌సభలో రిజిజు మాట్లాడుతూ.. ప్రతిపాదిత మార్పులను సమర్థించారు. మేము సానుకూల సంస్కరణలను ప్రవేశపెడుతున్నప్పుడు, మమ్మల్ని ఎందుకు ప్రశ్నిస్తున్నారు? బిల్లులో ప్రమేయం లేని వారిని తప్పుదారి పట్టించి, రెచ్చగొడుతున్నారు అని ప్రతిపక్షాలను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

  • Author : Latha Suma Date : 02-04-2025 - 1:09 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Waqf Bill Before Lok Sabha
Waqf Bill before Lok Sabha

Waqf Amendment Bill : కేంద్రమంత్రి కిరణ్ రిజిజు వక్ఫ్‌ సవరణ బిల్లుని లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా విపక్షాలు ఆందోళన చేపట్టాయి. వారి నిరసనల నడుమ బుధవారం మధ్యాహ్నం కిరణ్‌ రిజిజు ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. అనంతరం దీని పై రిజిజు చర్చ చేపట్టారు. లోక్‌సభలో రిజిజు మాట్లాడుతూ.. ప్రతిపాదిత మార్పులను సమర్థించారు. మేము సానుకూల సంస్కరణలను ప్రవేశపెడుతున్నప్పుడు, మమ్మల్ని ఎందుకు ప్రశ్నిస్తున్నారు? బిల్లులో ప్రమేయం లేని వారిని తప్పుదారి పట్టించి, రెచ్చగొడుతున్నారు అని ప్రతిపక్షాలను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. వక్ఫ్ సవరణ బిల్లును ప్రవేశపెట్టకపోతే, పార్లమెంటు భవనం కూడా వక్ఫ్ ఆస్తిగా పేర్కొంటారు అని కిరణ్‌ రిజిజు సంచలన ప్రకటన చేశారు.

Read Also: Allu Arjun : పేరు మార్చుకోబోతున్న అల్లు అర్జున్ ..కారణం అదేనా?

మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ బిల్లుపై లోక్‌సభలో ప్రసంగించారు. వక్ఫ్ సవరణ బిల్లుని సమర్థించారు. మా ప్రభుత్వం కాంగ్రెస్ కమిటీ లాంటిది కాదు. అది కేవలం ఓ రబ్బరు స్టాంప్. కానీ, మా కమిటీ క్షుణ్ణంగా చర్చలు జరిపింది. సూచనలు తీసుకుంది అని అమిత్ షా అన్నారు. ఈ బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) పరిశీలించిందని.. క్యాబినెట్ ఆమోదం పొందే ముందు సూచనలను చేర్చిందని చెప్పారు. ఇకపోతే, దాదాపు 8 గంటల పాటు చర్చ జరిపిన అనంతరం ఓటింగ్‌ నిర్వహించనున్నారు. ఈ బిల్లును ఆమోదింపజేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం పట్టుదలతో ఉండగా విపక్షాలన్నీ వ్యతిరేకిస్తున్నాయి.

కాగా, ఈ నేపథ్యంలో వక్ఫ్‌ బిల్లును కేంద్రం నేడు లోక్‌సభ ముందుకు తీసుకొచ్చింది. లోక్‌సభలో ఆమోదం పొందిన తర్వాత గురువారం రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. ఉభయ సభల్లో అధికార ఎన్డీయేకు మెజారిటీ ఉన్నందున బిల్లు ఆమోదానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని బీజేపీ భావిస్తోంది. క్ఫ్ సవరణ బిల్లును ఆమోదింపజేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం పట్టుదలతో ఉండగా విపక్షాలన్నీ వ్యతిరేకిస్తున్నాయి. వక్ఫ్‌ పాలకవర్గాల్లో మరింత పారదర్శకత, జవాబుదారీతనం పెంచుతూ పాలనలో మహిళల భాగస్వామ్యం తప్పనిసరి చేసేలా ఈ కొత్త బిల్లును కేంద్రం తీసుకొచ్చింది. ఈ మేరకు 1995 నాటి వక్ఫ్‌ చట్టంలో దాదాపు 40 సవరణలు జరిగాయి. అయితే, గతేడాది ఆగస్టులోనే కేంద్రం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. అప్పుడు దీనిపై విపక్షాల నుంచి తీవ్ర నిరసనలు రావడంతో జేపీసీ పరిశీలనకు ఈ బిల్లుని పంపింది.

Read Also: YS Sharmila : దేశానికి ఈరోజు బ్లాక్ డే: వక్ఫ్ బిల్లుపై షర్మిల కామెంట్స్

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • lok sabha
  • Rajya Sabha
  • Union Home Minister Amit Shah
  • Union Minister Kiren Rijiju
  • Waqf Amendment Bill

Related News

Tdp Mp Lavu Sri Krishna Devarayalu

లోక్‌సభలో తెలంగాణను కించపరచలేదు.. టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు క్లారిటీ

Mp Lavu Sri Krishna Devarayalu  ఇటీవల పార్లమెంటులో ఏపీ టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు చేసిన వ్యాఖ్యలు తెలంగాణను అవమానించేలా ఉన్నాయంటూ.. తెలంగాణ రాజకీయ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంపై మాట్లాడుతూ బ్లాక్ డే అంటూ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ వ్యవహారం కాస్తా తీవ్ర దుమారానికి కారణం కావడంతో.. ఆయన స్పందించారు. తాను తెలంగ

  • Abhishek Manu Singhvi And V

    Rajya Sabha : తెలంగాణ నుంచి రాజ్యసభకు సింఘ్వీ, నరేందర్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక!

  • Ap Mlas

    దేశంలో టాప్ 3 మహిళా బిలియనీర్ ప్రజాప్రతినిధులు.. మొదటి మూడు ప్లేసులూ ఏపీ ఎమ్మెల్యేలవే

Latest News

  • Rahul : రాహుల్ కు ఏమి తెలియదంటూ మోదీ దారుణమైన సెటైర్

  • TALRadio : ఈ రేడియో ఆన్ చేస్తే అన్ని మంచి వార్తలే! !

  • Big Shock : యూజర్లకు బిగ్ షాక్.. మొబైల్ డేటాపై ట్యాక్స్ వేయబోతున్న కేంద్రం ?

  • Gas Shortage : రైల్ ప్రయాణికులకు LPG షాక్

  • Velugumatla Demolition : కూల్చడం ఎందుకు..? మళ్లీ ఇల్లు కట్టించుడు ఎందుకు..? భూదాన్ ఘటన పై కేటీఆర్ ఫైర్

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd