YS Sharmila : దేశానికి ఈరోజు బ్లాక్ డే: వక్ఫ్ బిల్లుపై షర్మిల కామెంట్స్
300 ఏళ్ల క్రితం నాటి ఆస్తులకు ఇప్పుడు డాక్యుమెంట్లు అడగడం, వక్ఫ్ బోర్డుకి భూములు వితరణ చేయాలంటే ఐదేళ్లు ఇస్లాం ధర్మాన్ని ఆచరించాలని నిబంధన పెట్టడం అంటే ముస్లింల మనోభావాలను దెబ్బతీసే వ్యతిరేక చర్యలేనని షర్మిల ఆరోపించారు.
- Author : Latha Suma
Date : 02-04-2025 - 12:27 IST
Published By : Hashtagu Telugu Desk
YS Sharmila : పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల వక్ఫ్ చట్ట సవరణ బిల్లు పై స్పందించారు. పార్లమెంట్ ముందుకు వక్ఫ్ సవరణ బిల్లు రావడం దేశంలో ఇవాళ బ్లాక్ డే అని చరిత్రలో ఇదో మాయని మచ్చగా మిగిలిపోయే దుశ్చర్య అని ఫైర్ అయ్యారు. ఇది ముమ్మాటికీ మైనారిటీలను అణిచివేసే కుట్రేనని రాజ్యాంగ వ్యతిరేక బిల్లు అంటూ మండిపడ్డారు. దేశ వ్యాప్తంగా ముస్లింల మనోభావాలు దెబ్బతీయడమే నియంతలు చంద్రబాబు, నరేంద్ర మోడీ అజెండా అని కామెంట్ చేశారు.
Read Also: HCU Land Issue : విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జ్
వక్ఫ్ ఆస్తుల పర్యవేక్షణ కలెక్టర్లకు అప్పగించడం, వక్ఫ్ బోర్డులో అన్యమత సభ్యులను నియమించడం, వక్ఫ్ ఆస్తులు 12 ఏళ్లేగా ఎవరి అధీనంలో ఉంటే వారివే అనడం, 300 ఏళ్ల క్రితం నాటి ఆస్తులకు ఇప్పుడు డాక్యుమెంట్లు అడగడం, వక్ఫ్ బోర్డుకి భూములు వితరణ చేయాలంటే ఐదేళ్లు ఇస్లాం ధర్మాన్ని ఆచరించాలని నిబంధన పెట్టడం అంటే ముస్లింల మనోభావాలను దెబ్బతీసే వ్యతిరేక చర్యలేనని షర్మిల ఆరోపించారు. ఈ బిల్లుతో మత విద్వేషాలు రెచ్చగొట్టడం తప్పా మరొకటి కాదని అన్నారు. వక్ఫ్ ఆస్తులను అన్యాక్రాంతం చేయడం కోసమే ఈ పన్నాగమని ధ్వజమెత్తారు. దేవుడికి ఇచ్చిన ఆస్తిని కాజేసి మోడీ బినామీలు, దోస్తులకు వక్ఫ్ ఆస్తులను దారాదత్తం చేసే కుట్ర అని అన్నారు. వక్ఫ్ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ దేశంలో 20 కోట్ల మంది ముస్లింలు ఆందోళనలు చేస్తున్నా వారి వేదన వినకుండా బిల్లును చట్టసభల్లో ప్రవేశపెట్టడం ప్రజాస్వామ్య విద్రోహ చర్య అని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పక్షాన వక్ఫ్ చట్ట సవరణ బిల్లును తాము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ముస్లింల పోరాటానికి పూర్తి మద్దతు ఇస్తామని వైఎస్ షర్మిల అన్నారు. మైనారిటీల ప్రయోజనాలను దెబ్బతీసే బిల్లుకు టీడీపీ, జనసేన పార్టీలు మద్దతు పలకడం దారుణమని అన్నారు. ఎట్టకేలకు టీడీపీ సెక్యులర్ పార్టీ ముసుగు తొలిగి, మోసి బయట పడిందని కామెంట్ చేశారు.
Read Also: CBG plant : రిలయన్స్ సీబీజీ ప్లాంట్‌కు మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన