HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Want Champai Soren To Join Bjp Himanta Biswa Sarma

Champai Soren : బీజేపీ బిగ్ ఆఫర్.. చంపై సోరెన్‌ రియాక్షన్ ఇదీ

తాజాగా జార్ఖండ్ రాజధాని రాంచీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అసోం సీఎం హిమంత బిస్వశర్మ మాట్లాడారు. 

  • By Pasha Published Date - 03:26 PM, Mon - 26 August 24
  • daily-hunt
Champai Soren

Champai Soren : త్వరలోనే సొంత రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తానని జార్ఖండ్ మాజీ సీఎం చంపై సోరెన్ ఇప్పటికే ప్రకటించారు. ఆయన ఆ దిశగా ఇప్పటికే కసరత్తును మొదలుపెట్టారు. జార్ఖండ్‌లోని అన్ని జిల్లాల్లో పర్యటిస్తూ తన అభిమానులను ఏకం చేసే పనిలో చంపై సోరెన్ బిజీగా  ఉన్నారు. జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) పార్టీ నుంచి సాధ్యమైనంత ఎక్కువ మంది ఎమ్మెల్యేలను తన వైపు లాక్కునే ప్రయత్నాల్లో ఆయన నిమగ్నమై ఉన్నారు. ఈ తరుణంలో బీజేపీ వైపు నుంచి చంపై సోరెన్‌కు పెద్ద ఆఫర్ వచ్చింది. దీనికి సంబంధించి అసోం సీఎం హిమంత బిస్వ శర్మ కీలక కామెంట్స్ చేశారు. గత కొన్ని రోజులుగా అసోం సీఎం(Champai Soren) జార్ఖండ్ పర్యటనలో ఉన్నారు.

We’re now on WhatsApp. Click to Join

తాజాగా జార్ఖండ్ రాజధాని రాంచీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అసోం సీఎం హిమంత బిస్వశర్మ మాట్లాడారు.  చంపై సోరెన్ బీజేపీలో చేరి, జార్ఖండ్‌లో పార్టీని బలోపేతం చేయాలని కోరారు. ‘‘చంపై సోరెన్ రాజకీయాల్లో నాకన్నా చాలా సీనియర్. ఆయనపై ఇంకా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేను’’ అని హిమంత పేర్కొన్నారు. గత ఆరు నెలలుగా తాను చంపైతో టచ్‌లోనే ఉన్నానని వెల్లడించారు. ‘‘చంపై సోరెన్ ఢిల్లీలో ఉంటే మాట్లాడేందుకు ప్రయత్నిస్తాను. గతంలో చాలాసార్లు ఆయనతో మాట్లాడినా రాజకీయాల గురించి ప్రస్తావించుకోలేదు. ఇప్పుడు రాజకీయాల గురించి చర్చించుకోవాల్సిన సమయం వచ్చింది’’ అని అసోం సీఎం వెల్లడించారు.

Also Read :Telegram CEO : టెలిగ్రామ్ ఓనర్ పావెల్ దురోవ్ అరెస్టు వెనుక మిస్టరీ మహిళ.. ఎవరామె ?

ఈ ఏడాది చివర్లో జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈనేపథ్యంలో జార్ఖండ్ రాష్ట్ర బీజేపీ  కో ఇన్ ఛార్జిగా హిమంతను నియమించారు. అందుకే ఆయన జార్ఖండ్‌లో బీజేపీ బలోపేతం కోసం కసరత్తు చేస్తున్నారు. అందుకే గత కొన్ని నెలలుగా చంపై సోరెన్‌తో టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక తాను బీజేపీతో టచ్‌లో ఉన్నట్లు వస్తున్న వార్తలను చంపై సోరెన్ ఖండించారు. జేఎంఎం పార్టీని వదలడం ఖాయమని స్పష్టం చేశారు.కొత్త పార్టీ ఏర్పాటుకే తాను ప్రాధాన్యత ఇస్తానని వెల్లడించారు.

Also Read :Kolkata Rape Case : లై డిటెక్టర్ పరీక్షలో సంచలన విషయాలు చెప్పిన సంజయ్ రాయ్


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bjp
  • Champai Soren
  • Himanta Biswa Sarma

Related News

Rahul Vizagsteel

Rahul Gandhi : త్వరలో విశాఖ స్టీల్ ప్లాంట్ ను సందర్శించబోతున్న రాహుల్ గాంధీ!

Rahul Gandhi : ఆంధ్రప్రదేశ్‌లో వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ (విశాఖ ఉక్కు కర్మాగారం) ప్రైవేటీకరణ అంశం గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హయాం నుండి నేటి కూటమి ప్రభుత్వం వరకూ రాజకీయంగా చర్చనీయాంశమవుతూనే ఉంది.

  • PM Modi AI Video

    PM Modi AI Video: ప్ర‌ధాని మోదీ ఏఐ వీడియో.. ఇలా చేయ‌టం క‌రెక్టేనా?!

Latest News

  • Telangana Rising 2047 : రూ. లక్ష కోట్లకుపైగా ఒప్పందాలు

  • Varanasi Movie : వారణాసి మూవీ గ్లింప్స్‌లో భయంకరంగా కనిపించే ఆ దేవత ఎవరు?

  • Tirumala Darshan Tickets : ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల లెటర్లతో బ్రేక్ దర్శనం స్కాం..!

  • RBI Repo Rate : లోన్ తీసుకున్న వారికీ పండగే !!

  • Jagan : ప్రజల సొమ్మును జగన్ ఏ మేరకు వాడుకున్నాడో తెలుసా..?

Trending News

    • Akhanda 2 New Release Date : ఈరోజు రాత్రికే ‘అఖండ 2’ ప్రీమియర్ షోలు!

    • Putin India Visit: మోదీ-పుతిన్ ఒకే కారులో ఎందుకు కూర్చున్నారో తెలుసా?

    • Putin Religion: ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్ పాటించే మతం ఏమిటి? ఆయనకు దేవుడిపై విశ్వాసం ఉందా?

    • Putin Personal Toilet: పుతిన్‌కు బుల్లెట్‌ప్రూఫ్ కారు, వ్యక్తిగత టాయిలెట్.. ఎందుకంత పకడ్బందీ?

    • Retirement: క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన టీమిండియా ఆట‌గాడు!!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd