Kolkata Rape Case : లై డిటెక్టర్ పరీక్షలో సంచలన విషయాలు చెప్పిన సంజయ్ రాయ్
ఆగస్టు 9న తెల్లవారుజామున 3 గంటల తర్వాత మెడికల్ కాలేజీలోని సెమినార్ హాలులో జూనియర్ వైద్యురాలిపై హత్యాచారం జరిగింది.
- By Pasha Published Date - 02:40 PM, Mon - 26 August 24

Kolkata Rape Case : కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటనలో కీలక నిందితుడు సంజయ్ రాయ్. అతడికి సీబీఐ అధికారులు ఆదివారం రోజు దాదాపు నాలుగు గంటల పాటు లై డిటెక్టర్ పరీక్ష నిర్వహించారు. ఈక్రమంలో సీబీఐ అధికారులు అడిగిన ప్రశ్నలకు అతడు భిన్న, విభిన్న సమాధానాలు చెప్పాడంటూ జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఆ వివరాలను ఇప్పుడు మనం చూద్దాం..
We’re now on WhatsApp. Click to Join
సీబీఐకు సంజయ్ ఏం చెప్పాడంటే..
- ఆగస్టు 9న తెల్లవారుజామున 3 గంటల తర్వాత మెడికల్ కాలేజీలోని సెమినార్ హాలులో జూనియర్ వైద్యురాలిపై హత్యాచారం(Kolkata Rape Case) జరిగింది.
- మెడికల్ కాలేజీలో సంజయ్ రాయ్ సెక్యూరిటీ గార్డ్ (సివిక్ వాలంటీర్)గా పనిచేసేవాడు.
- ఆగస్టు 8న రాత్రి సంజయ్ రాయ్ డ్యూటీలోనే ఉన్నాడు.
- ఆ రోజు రాత్రి 11 గంటలకు సంజయ్ రాయ్, అతడి స్నేహితుడు కలిసి కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీకి వచ్చారు. ఆస్పత్రిలోనే చికిత్సపొందుతున్న సదరు స్నేహితుడి సోదరుడిని సంజయ్ కూడా వెళ్లి పరామర్శించాడు.
- ఆ రోజు రాత్రి 11.15 గంటలకు ఆస్పత్రి నుంచి సంజయ్ స్నేహితుడు వెళుతూ కలిసి మద్యం తాగుదామని చెప్పాడు.
- అనంతరం ఇద్దరూ కలిసి వెళ్లి మద్యం తాగారు. ఆ తర్వాత కోల్‌కతాలోని సోనాగాచి ఏరియాలో ఉన్న రెడ్ లైట్ ఏరియాకు వెళ్లాలని డిసైడయ్యారు.
- అనుకున్న విధంగానే సంజయ్ రాయ్, అతడి స్నేహితుడు కలిసి సోనాగాచి ఏరియాకు వెళ్లారు. అక్కడ తాము అనుకున్న పని కాలేదు.
- దీంతో సోనాగాచి ఏరియా నుంచి చేత్లా ప్రాంతంలో ఉన్న రెడ్ లైట్ ఏరియాకు బైక్‌ను పోనిచ్చారు.
- మార్గం మధ్యలో ఓ మహిళపై వారిద్దరూ లైంగిక దాడికి పాల్పడినట్లు లై డిటెక్టర్ పరీక్షలో తేలింది.
We’re now on WhatsApp. Click to Join
- చేత్లా ప్రాంతంలో ఉన్న రెడ్ లైట్ ఏరియాకు చేరుకున్నాక.. ఓ వ్యభిచార నివాసం వద్ద ఆగారు. సంజయ్ స్నేహితుడు మాత్రమే లోపలికి వెళ్లి ఓ మహిళతో సెక్స్‌లో పాల్గొన్నాడు.
- ఆ టైంలో చేత్లా రెడ్ లైట్ ఏరియాలోని వీధిలోనే సంజయ్ రాయ్ నిలబడ్డాడు. అటువైపుగా వెళ్తున్న ఓ మహిళపై అతడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. సీసీ కెమెరాల్లో అదంతా రికార్డయింది.
- అక్కడే నిలబడి ఓ గర్ల్ ఫ్రెండ్‌కు సంజయ్ వీడియో కాల్ చేసి నూడ్ ఫొటోలు పంపమని ఆమెను అడిగాడు.
- ఇదంతా జరిగాక సంజయ్ రాయ్ ఆగస్టు 9న తెల్లవారుజామున ఆర్జీ కర్ మెడికల్ కాలేజీకి తిరిగొచ్చాడు. తొలుత ఆస్పత్రి నాలుగో అంతస్తులోని ట్రామా సెంటరు లోపలికి వెళ్లాడు.
- అనంతరం ఆగస్టు 9న తెల్లవారుజామున 4.03 నిమిషాలకు సెమినార్ హాలు సమీపం నుంచి నడుచుకుంటూ వెళ్లాడు.
- ఈక్రమంలో సెమినార్ హాలులో గాఢనిద్రలో ఉన్న జూనియర్ వైద్యురాలిని గొంతు నులిమి చంపాడు. అనంతరం ఆమెపై హత్యాచారానికి తెగబడ్డాడు.
- అనంతరం సెమినార్ హాలు నుంచి బయటికి వెళ్లిపోయాడు. అక్కడి నుంచి నేరుగా అనుపమ్ దత్త అనే స్నేహితుడి ఇంటికి వెళ్లాడు. అనుపమ్ దత్త కోల్‌కతాలో ఓ పోలీసు అధికారి కావడం గమనార్హం.