United Nations Day 2024 : ఇండియా వాంట్ ‘వీటో పవర్’.. ఐక్యరాజ్యసమితిలో సంస్కరణలు జరిగేనా ?
ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ భారత్‌కు కూడా భద్రతా మండలిలో(United Nations Day 2024) చోటు ఇవ్వాలని మన దేశం చాలా ఏళ్లుగా కోరుతోంది.
- By Pasha Published Date - 12:40 PM, Thu - 24 October 24

United Nations Day 2024 : ఇవాళ (అక్టోబరు 24) యావత్ ప్రపంచ దేశాలకు స్పెషల్ రోజు. ఎందుకంటే ఈరోజు ఐక్యరాజ్యసమితి దినోత్సవం. 1945 సంవత్సరంలో సరిగ్గా ఇదే రోజున ఐక్యరాజ్యసమితి అనే వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. ప్రతి ఏడాది ఐక్యరాజ్యసమితి దినోత్సవానికి ఒక థీమ్ ఉంటుంది. ఈసారి థీమ్ ఏమిటంటే.. ‘‘ఉత్తమ భవిష్యత్తు కోసం అంతర్జాతీయ సహకారం’’. ప్రపంచ శాంతి భద్రతలు, అభివృద్ధి కోసం అంతర్జాతీయ సహకారం కీలకం అనే అంశాన్ని ఈరోజున అందరికీ చాటిచెప్పాలని ఐరాస లక్ష్యంగా పెట్టుకుంది. ఇవాళ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి గురించి.. అందులో భారత్‌కు వీటో పవర్ దక్కాల్సిన ఆవశ్యకత గురించి తెలుసుకుందాం..
Also Read :Three Senas Battle : ఒక్క సీటు.. మూడు ‘సేన’ల ‘మహా’ సంగ్రామం
ఐక్యరాజ్యసమితిలో భారత్ సహా ప్రపంచ దేశాలన్నింటికి శాశ్వత సభ్యత్వం ఉంది. అయితే ఐక్యరాజ్యసమితిలోని భద్రతా మండలిలో మాత్రం కొన్ని దేశాలకే శాశ్వత సభ్యత్వం ఉంది. మనదేశానికి కూడా ఇందులో శాశ్వత సభ్యత్వం లేదు. ఇది అన్యాయమని భారత్ బలంగా వాదిస్తోంది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ భారత్‌కు కూడా భద్రతా మండలిలో(United Nations Day 2024) చోటు ఇవ్వాలని మన దేశం చాలా ఏళ్లుగా కోరుతోంది. అయినా ఆ ప్రయత్నాలు ఫలించడం లేదు. ఒకవేళ మనదేశానికి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం లభిస్తే.. ‘వీటో పవర్’ వస్తుంది.
Also Read :Salman Khan : రూ.5 కోట్లు ఇవ్వు.. సల్మాన్ ఖాన్‌కు వార్నింగ్.. కూరగాయల వ్యాపారి అరెస్ట్
ఐరాస భద్రతా మండలిలో ప్రస్తుతం అమెరికా, బ్రిటన్, రష్యా, ఫ్రాన్స్, చైనా మాత్రమే ఉన్నాయి. వీటికి వీటో పవర్ ఉంది. ఐక్యరాజ్యసమితి తీసుకున్న ఏ నిర్ణయమైనా సరే.. వీటిలో ఏదైనా ఒక్క దేశం వీటో చేస్తే చాలు అమల్లోకి రాదు. అందుకే వీటో పవర్ అనేది ఒక సూపర్ పవర్. మన దేశానికి ఐరాస భద్రతా మండలిలో చోటు ఇచ్చే ప్రతిపాదనకు రష్యా, ఫ్రాన్స్, అమెరికా, బ్రిటన్ మద్దతు పలుకుతున్నాయి. మన పొరుగుదేశం చైనా మాత్రం.. భారత్‌కు ఈవిషయంలో మద్దతు పలికేందుకు సంసిద్ధంగా లేదు. దీనికి కారణంగా చైనాకు పాకిస్తాన్‌తో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మన దేశంతో పాటు బ్రెజిల్, జపాన్, జర్మనీ దేశాలు కూడా ఐరాస భద్రతా మండలి శాశ్వత సభ్యత్వం కోసం తీవ్రంగా పోటీ పడుతున్నాయి.