Salman Khan : రూ.5 కోట్లు ఇవ్వు.. సల్మాన్ ఖాన్‌కు వార్నింగ్.. కూరగాయల వ్యాపారి అరెస్ట్
ఇటీవలే ముంబైలో ఎన్‌సీపీ అజిత్ పవార్ వర్గం నేత బాబా సిద్దిఖీ(Salman Khan) దారుణ హత్యకు గురైన నేపథ్యంలో ఈ మెసేజ్‌ను ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు సీరియస్ తీసుకున్నారు.
- By Pasha Published Date - 11:24 AM, Thu - 24 October 24

Salman Khan : బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌కు బెదిరింపు మెసేజ్‌లు రావడం కంటిన్యూ అవుతోంది. తాజాగా ఓ కూరగాయల వ్యాపారి కూడా సల్లూభాయ్‌ని బెదిరిస్తూ మెసేజ్ పంపాడు. ‘‘రూ.5 కోట్లు ఇస్తే ప్రాణాలతో బతుకుతావ్’’ అంటూ సల్మాన్‌కు బెదిరింపు మెసేజ్‌ను పంపిన వ్యక్తిని 24 ఏళ్ల షేక్ హుస్సేన్ మౌసిన్‌గా ముంబై పోలీసులు గుర్తించారు. జార్ఖండ్ రాష్ట్రంలోని జంషెడ్‌పూర్‌లో అతడిని అరెస్టు చేశామని ముంబైలోని వర్లీ ఏరియా పోలీసులు వెల్లడించారు. ఇంతకీ అతగాడు మెసేజ్ ఎక్కడికి పంపాడు ? ఏమని పంపాడు ? బెదిరింపు మెసేజ్‌లో గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయి పేరును వాడాడా ? అనేది తెలియాలంటే ఈ వార్తను చదవాల్సిందే.
Also Read :BTech Management Seats : ఎంబీబీఎస్ తరహాలో బీటెక్ మేనేజ్మెంట్ కోటా సీట్ల కేటాయింపు ?
ముంబై ట్రాఫిక్ పోలీసుల వాట్సాప్ హెల్ప్‌లైన్ నంబరు అది. దానికి సాధారణంగా నగరంలోని ట్రాఫిక్ సంబంధిత అంశాలపైనే సందేహాలు, ఫిర్యాదులు, ప్రశ్నలు వస్తుంటాయి. అయితే అక్టోబరు 18న వచ్చిన మెసేజ్‌ను చూసి ముంబై ట్రాఫిక్ పోలీసు విభాగం అవాక్కైంది. ఆ మెసేజ్‌లో ఇలా రాసి ఉంది.. ‘‘సల్మాన్ ఖబడ్దార్.. ఇకనైనా నువ్వు గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయితో శత్రుత్వాన్ని ముగించుకో. ఇందుకోసం రూ.5 కోట్లు ఇచ్చుకో. నువ్వు బతికి బట్ట కట్టాలన్నా, లారెన్స్‌తో నీ శత్రుత్వం ముగిసిపోవాలన్నా రూ.5 కోట్లు వెంటనే పంపు.. లేదంటే ఎన్‌సీపీ నేత బాబా సిద్దిఖీ కంటే దారుణమైన గతి సల్మాన్‌కు పడుతుంది’’ అని ఆ వార్నింగ్ మెసేజ్‌లో 24 ఏళ్ల షేక్ హుస్సేన్ మౌసిన్ ప్రస్తావించాడు.
Also Read :India Vs New Zealand : టాస్ గెల్చి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్.. టీమిండియాలో కీలక మార్పులు
ఇటీవలే ముంబైలో ఎన్‌సీపీ అజిత్ పవార్ వర్గం నేత బాబా సిద్దిఖీ(Salman Khan) దారుణ హత్యకు గురైన నేపథ్యంలో ఈ మెసేజ్‌ను ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు సీరియస్ తీసుకున్నారు. ఈ మెసేజ్‌ను పంపిన వ్యక్తిని గుర్తించే పనిలో పడ్డారు. ఈక్రమంలో మూడు రోజుల తర్వాత (అక్టోబరు 21న).. అదే నంబరు నుంచి ముంబై ట్రాఫిక్ పోలీసుల వాట్సాప్ హెల్ప్‌లైన్ నంబరుకు మరో మెసేజ్ వచ్చింది. ‘‘మేం ఇంతకుముందు పొరపాటున ఈ నంబరుకు మెసేజ్‌ను పంపాం’’ అని అందులో దుండగుడు ప్రస్తావించాడు. చివరకు ఈ మెసేజ్ వచ్చిన లొకేషన్‌ను ముంబై పోలీసులు ట్రాక్ చేశారు. జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌కు ప్రత్యేక టీమ్‌ను పంపారు. అక్కడి పోలీసుల సాయంతో ముంబై పోలీసులు స్పెషల్ ఆపరేషన్ నిర్వహించి.. ఈ మెసేజ్‌ను పంపిన యువకుడు షేక్ హుస్సేన్ మౌసిన్‌ను అరెస్టు చేశారు. అతడు చిన్నపాటి కూరగాయల వ్యాపారం చేసుకుంటున్నట్లు గుర్తించారు. అతడిని విచారణ నిమిత్తం ముంబైకి తీసుకురానున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.