Union Minister Injured: కేంద్రమంత్రికి త్రుటిలో తప్పిన పెను ప్రమాదం
కర్ణాటకలోని విజయపుర జిల్లాలో కేంద్ర సహాయ మంత్రి (Union Minister) సాధ్వి నిరంజన్ జ్యోతి ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. మంత్రి ప్రయాణిస్తున్న కారు.. ట్రక్కును ఢీకొట్టిందని చెబుతున్నారు.
- Author : Gopichand
Date : 17-03-2023 - 6:21 IST
Published By : Hashtagu Telugu Desk
కర్ణాటకలోని విజయపుర జిల్లాలో కేంద్ర సహాయ మంత్రి (Union Minister) సాధ్వి నిరంజన్ జ్యోతి ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. మంత్రి ప్రయాణిస్తున్న కారు.. ట్రక్కును ఢీకొట్టిందని చెబుతున్నారు. ఈ ప్రమాదంలో మంత్రి, కారు డ్రైవర్‌కు గాయాలయ్యాయి. బీజేపీ మహిళా సమ్మేళనంలో పాల్గొనేందుకు సాధ్వి నిరంజన్ జ్యోతి విజయపురకు వచ్చారు.
సమాచారం ప్రకారం.. జాతీయ రహదారి 50పై గురువారం రాత్రి ప్రమాదం జరిగింది. ఆమె కారు ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మంత్రికి, కారు డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ట్రక్కు డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు సమాచారం. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేంద్ర మంత్రికి, కారు డ్రైవర్‌కు ప్రథమ చికిత్స చేశారు. మంత్రి విలేకరులతో మాట్లాడుతూ.. దేవుని దయతో నేను క్షేమంగా ఉన్నాను. డ్రైవర్ అప్రమత్తత వల్ల ట్రక్కు కిందకు వెళ్లకుండా కాపాడారు. మాకు స్వల్ప గాయాలయ్యాయి, అంతా బాగానే ఉందని వైద్యులు తెలిపారని స్పష్టం చేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: Flight Cockpit: విమానం కాక్ పిట్ లో కజ్జికాయలు… కూల్ డ్రింక్స్… పైలెట్ల పై వేటు వేసిన అధికారులు!
సాధ్వి నిరంజన్ జ్యోతి ఫతేపూర్ నుంచి వరుసగా రెండు సార్లు ఎంపీగా ఉన్నారు. నరేంద్ర మోదీ రెండు ప్రభుత్వాల్లోనూ ఆమెకు మంత్రి పదవి ఇచ్చారు. ప్రస్తుతం ఆమె కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. దీంతో పాటు 2021లో జరిగిన మంత్రివర్గ విస్తరణలో ఆమెకు మరో మంత్రివర్గం కూడా దక్కింది.