Flight Cockpit: విమానం కాక్ పిట్ లో కజ్జికాయలు… కూల్ డ్రింక్స్… పైలెట్ల పై వేటు వేసిన అధికారులు!
సాధారణంగా విమాన ప్రయాణంలో చేయాలంటే తప్పనిసరిగా కొన్ని నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. ఇలా నిబంధనలను పాటించినప్పటి విమాన ప్రయాణం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటుంది.
- By Nakshatra Published Date - 09:50 PM, Thu - 16 March 23

Flight Cockpit: సాధారణంగా విమాన ప్రయాణంలో చేయాలంటే తప్పనిసరిగా కొన్ని నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. ఇలా నిబంధనలను పాటించినప్పటి విమాన ప్రయాణం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటుంది. అయితే నిబంధనల ప్రకారం విమానంలోకి బయట నుంచి ఎలాంటి తినబండారాలు తీసుకువెళ్లడానికి అనుమతి లేదు. ఈ నియమాలను ప్రతి ఒక్కరు తప్పనిసరిగా పాటించాలి కానీ స్పైస్ జెట్ విమానంలో మాత్రం ఇద్దరు పైలెట్ లు నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించారు.
ఇలా పైలెట్లు ఎన్నో నియమాలను పాటించాల్సింది పోయి ఏకంగా కాక్ పిట్ లోకి కజ్జికాయలు కూల్ డ్రింక్స్ తీసుకువెళ్లడం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఈ విషయంపై విమానయాన సంస్థ స్పందించి సదరు పైలెట్లను విధుల నుంచి బహిష్కరించింది. హోలీ పండుగ సందర్భంగా ఆ ఇద్దరు పైలెట్లు కాక్ పిట్ లోకి కజ్జికాయలతో పాటు కూల్ డ్రింక్స్ కూడా తీసుకువెళ్లారు. అయితే వీటిని విమాన ఇంధనం కటాఫ్ లివర్ పై ఉంచారు. ఈ ఘటన ఢిల్లీ నుంచి గువహతీకీ వెళ్లే విమానంలో చోటుచేసుకుంది.
ఇక ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నేటిజన్స్ షాక్ అవుతున్నారు. ఒకవేళ కూల్ డ్రింక్ కనుక కింద పడిపోతే ఎలక్ట్రానిక్ షార్ట్ సర్క్యూట్ కి దారి తీసే ప్రమాదాలు ఉన్నాయని పలువురు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ విషయంపై విమానయాన సంస్థ దర్యాప్తుకు ఆదేశాలు జారీచేసింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతి రాదిత్య సింథియా, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కి ఈ ఫోటోలను ట్యాగ్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Related News

Cool Drinks: కూల్ డ్రింక్స్ వ్యాపారంలో స్వదేశీ విప్లవానికి రిలయన్స్ రెడీ..!
కూల్ డ్రింక్స్ (Cool Drinks) మార్కెట్ పై పట్టు సాధించాలని రిలయన్స్ ప్లాన్ చేస్తోంది. పెప్సి, కోకా కోలాలను సవాలు చేయడానికి Campa డ్రింక్స్ ను రంగంలోకి దింపేందుకు రెడీ అవుతోంది. లోకల్ బ్రాండ్ గా దీనికి ప్రజల్లో క్రేజ్ ను పెంచేందుకు ప్లాన్స్ చేస్తోంది.