Two Maoists killed: ఎదురుకాల్పులు.. ఇద్దరు మావోయిస్టులు మృతి
కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి (Two Maoists killed)చెందారని గడ్చిరోలి ఎస్పీ నీలోత్పల్ తెలిపారు. అడవుల్లో భారీగా మావోలు సమావేశమయ్యారన్న
- By Gopichand Published Date - 01:18 PM, Sat - 24 December 22

ఛత్తీస్‌గఢ్-మహారాష్ట్ర సరిహద్దుల్లో మావోయిస్టులకు భద్రతా బలగాల మధ్య శుక్రవారం ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి (Two Maoists killed)చెందారని గడ్చిరోలి ఎస్పీ నీలోత్పల్ తెలిపారు. అడవుల్లో భారీగా మావోలు సమావేశమయ్యారన్న సమాచారంతో భద్రతా సిబ్బంది రెక్కీ నిర్వహించారు. 40 నిమిషాల ఎదురు కాల్పుల అనంతరం ఘటనాస్థలంలో పోలీసులకు లింగవ్వ అలియాస్ అనిత(41)తో పాటు మరో వ్యక్తి మృతదేహం లభించింది. గాయాలపాలైన మరో మావో లచ్చమయ్య(28) ను అదుపులోకి తీసుకున్నారు. ఇక లింగవ్వపై తెలంగాణ ప్రభుత్వం రూ.5 లక్షలు, మహారాష్ట్ర ప్రభుత్వం రూ.16 లక్షల రివార్డు ప్రకటించింది.
నక్సలైట్లకు వాచర్లుగా పనిచేస్తున్న ముగ్గురు మహిళలను పోలీసులు ఈ ఆపరేషన్‌లో పట్టుకున్నారని మహారాష్ట్ర పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఎన్‌కౌంటర్‌లో హతమైన మహిళా నక్సలైట్‌ను డివిజనల్ కమిటీ ర్యాంక్ క్యాడర్ కంతి లింగవ్వ అలియాస్ అనిత(41) గా గుర్తించారు. మహారాష్ట్రలో ఆమె తలపై రూ.16 లక్షల రివార్డు తీసుకుంది. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం రూ.5 లక్షల నజరానాను ప్రకటించిందని ఛత్తీస్‌గఢ్ సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
Also Read: Fire breaks out: ఢిల్లీ వికాస్‌పురిలో భారీ అగ్నిప్రమాదం
భద్రతా బలగాలు కాల్చి చంపిన మరో నక్సలైట్, పురుషుడు ఎవరనేది ఇంకా నిర్ధారించబడలేదు. పొరుగున ఉన్న మహారాష్ట్రకు చెందిన సి-60 కమాండోలు, బీజాపూర్ నుండి డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (డిఆర్‌జి) సంయుక్త బృందం మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్‌కు బయలుదేరినప్పుడు ఫర్సెగఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని టేక్‌మెటా అడవిలో ఎదురుకాల్పులు జరిగాయని ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (బస్తర్ రేంజ్) సుందర్‌రాజ్ తెలిపారు.