Defence Budget : ఏకమైన టర్కీ, అమెరికా, పాక్.. రక్షణ బడ్జెట్‌ను పెంచేసిన భారత్
ఆపరేషన్ సిందూర్ వేళ పాకిస్తాన్‌కు అండగా ఉంటామని చైనా, తుర్కియే(Defence Budget) ఓపెన్‌గా ప్రకటించాయి.
- By Pasha Published Date - 12:51 PM, Fri - 16 May 25

Defence Budget : చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, తుర్కియేల నుంచి భద్రతా సవాళ్లు ఎదురవుతున్న ప్రస్తుత తరుణంలో భారత్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రక్షణ రంగానికి అదనంగా మరో రూ.50వేల కోట్ల బడ్జెట్‌ను కేటాయించాలని భారత సర్కారు డిసైడ్ అయినట్లు సమాచారం. ఈ ఏడాది రక్షణశాఖకు రూ.6.81 లక్షల కోట్లను కేటాయించారు. తాజాగా మరో రూ.50వేల కోట్ల పెంపుతో డిఫెన్స్‌కు కేటాయించిన నిధులు రూ.7 లక్షల కోట్లు దాటుతాయి. భారతదేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో రక్షణ కేటాయింపులు 1.91 శాతంగా ఉన్నాయి.
Also Read :Trump Asim Deal : పహల్గాం ఉగ్రదాడికి ముందు.. ట్రంప్ ఫ్యామిలీతో పాకిస్తాన్ బిగ్ డీల్ ?
భారత్‌తో కయ్యానికి చైనా, తుర్కియే రెడీ
ఆపరేషన్ సిందూర్ వేళ పాకిస్తాన్‌కు అండగా ఉంటామని చైనా, తుర్కియే(Defence Budget) ఓపెన్‌గా ప్రకటించాయి. ఆ రెండు దేశాలు భారత్‌తో శత్రుత్వానికి రెడీ అయ్యాయి. భారత్‌లో తమ సరుకులు, కార్ల అమ్మకాలను బ్యాన్ చేసినా ఫర్వా లేదని చైనా భావించింది. భారత్‌లోకి తమ ఉత్పత్తులను అనుమతించకున్నా ఫర్వాలేదు అని తుర్కియే భావించింది. అందుకే అవి పాకిస్తాన్ ఆ విధంగా గుడ్డిగా సపోర్ట్ చేశాయి. అందుకే ఆ రెండు దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలను భారత్ కట్ చేసుకుంటే బెటర్ అని పరిశీలకులు సూచిస్తున్నారు. భారతీయులంతా చైనా ఉత్పత్తులను బాయ్‌కాట్ చేయాలని పిలుపునిస్తున్నారు.
Also Read :Operation Sindoor : ‘నాగోర్నో-కారోబాఖ్’ ఫార్ములాతో భారత్ – పాక్ ఢీ.. భారతే నెగ్గింది
పాక్‌కు దగ్గరైన అమెరికా.. ట్రంప్ వల్లే ఇదంతా..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను కూడా గుడ్డిగా నమ్మడానికి వీల్లేదు. జమ్మూకశ్మీరులోని పహల్గాంలో ఉగ్రదాడి జరగడానికి కొన్ని వారాల ముందే ట్రంప్ కుమారుడికి చెందిన ఒక కంపెనీతో పాకిస్తాన్ ప్రభుత్వం భారీ ఒప్పందం కుదుర్చుకుంది. అందుకు ప్రతిగా ఇప్పుడు పాకిస్తాన్‌కు సపోర్ట్ చేసే మూడ్‌లో ట్రంప్ ఉన్నారు. పాకిస్తాన్‌కు ఆయుధాలను అమ్మేందుకు కూడా ట్రంప్ రెడీ అవుతున్నారని సమాచారం. చైనాకు బదులుగా అమెరికా నుంచే ఆయుధాలను కొనమని పాకిస్తాన్‌పై ఆయన ఒత్తిడి తెస్తున్నారట. చైనాపై పాకిస్తాన్ ఆధారపడకుండా ఉండాలనే ఉద్దేశంతో.. అమెరికా రికమెండేషన్ చేసి మరీ అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) నుంచి ఇటీవలే పాకిస్తాన్‌కు భారీ లోన్ ఇప్పించిందట. అంటే అమెరికా కూడా పాకిస్తాన్‌కే దగ్గరవుతోంది. ఈ పరిస్థితుల్లో సైనికంగా బలోపేతం కావాలనే లక్ష్యంతో భారత్ రక్షణ బడ్జెట్‌ను మరో రూ.50వేల కోట్లు పెంచినట్లు తెలిసింది. ఈ డబ్బులతో రష్యా, ఇజ్రాయెల్, ఫ్రాన్స్ నుంచి అధునాతన ఆయుధాలను భారత్ కొనబోతోందని సమాచారం.