Thane : బ్రిడ్జ్‌పై నుండి పడ్డ ట్రక్కు..5 గంటల పాటు ట్రాఫిక్ జామ్
34 టన్నుల కెమికల్‌తో కూడిన ట్రక్కు హర్యానా నుంచి బవాల్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని థానే పౌరసంఘం విపత్తు నిర్వహణ సెల్ చీఫ్ యాసిన్ తాడ్వి తెలిపారు. ట్రక్కు డ్రైవర్‌కు స్వల్ప గాయాలు కాగా స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు అధికారి తెలిపారు.
- By Latha Suma Published Date - 07:09 PM, Wed - 4 September 24
Thane: మహారాష్ట్రలోని థానేలోని ఘోడ్‌బందర్ రోడ్డులో ఫ్లైఓవర్‌పై నుంచి ట్రక్కు పడిపోయింది. దీంతో బుధవారం ఉదయం కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దాదాపు 5 గంటల పాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో వాహనదారులు, సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ట్రక్కు డ్రైవర్‌కు స్వల్ప గాయాలు కాగా స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు అధికారి తెలిపారు. కెమికల్ పదార్ధాలు తరలిస్తుండగా ట్రక్కు పడిపోయింది. అయితే స్థానికులు భయాందోళనకు గురికావడంతో పోలీసులకు సమచారం అందించారు. సంఘటనాస్థలికి చేరుకుని ప్రమాద స్థలిని పరిశీలించి ఎలాంటి ఇబ్బంది లేదని అధికారులు తెలిపారు.
We’re now on WhatsApp. Click to Join.
Traffic on Godbunder road in Thane today afternoon pic.twitter.com/7JhUpF9gfI
— Richa Pinto (@richapintoi) September 4, 2024
34 టన్నుల కెమికల్‌తో కూడిన ట్రక్కు హర్యానా నుంచి బవాల్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని థానే పౌరసంఘం విపత్తు నిర్వహణ సెల్ చీఫ్ యాసిన్ తాడ్వి తెలిపారు. ట్రక్కు డ్రైవర్‌కు స్వల్ప గాయాలు కాగా స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు అధికారి తెలిపారు. స్థానిక అగ్నిమాపక సిబ్బంది, పౌర రక్షకులు రహదారిని క్లియర్ చేయడానికి సంఘటనా స్థలానికి చేరుకున్నారని చెప్పారు. ఈ ప్రమాదంతో ఘోడ్‌బందర్ వైపు ఐదు గంటలకు పైగా ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిందని ఆయన చెప్పారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా, ట్రాఫిక్ జామ్ వాహనదారులకు నరకం చూపించింది. గంట కాదు.. రెండు గంటలు కాదు.. ఏకంగా 5 గంటలకు పైగా ట్రాఫిక్ నిలిచిపోవడంతో ప్రజలకు చుక్కలు కనిపించాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Read Also: Akhilesh vs Yogi : “బుల్డోజర్” వివాదం..అఖిలేష్ vs యోగి
Tags
Related News
PM Modi : వద్వాన్ పోర్టుకు ప్రధాని మోడీ శంకుస్థాపన
ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం సుమారు రూ. 76 వేల కోట్లు ఖర్చుపెట్టబోతున్నారట. వీటితోపాటు 1560 కోట్ల విలువైన 218 ఫిషరీస్ ప్రాజెక్టులను కూడా ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు.