Odisha Train Accident: రైలు టికెట్లను రద్దు చేసుకుంటున్న ప్రయాణికులు
ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాదంపై అనేక అనుమానాలు రేకిత్తిస్తున్నాయి. 21వ శతాబ్దంలో జరిగిన అతిపెద్ద రైలు ప్రమాదం ఇదేనంటూ చెప్తున్నారు అధికారులు.
- By Praveen Aluthuru Published Date - 05:07 PM, Tue - 6 June 23

Odisha Train Accident: ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాదంపై అనేక అనుమానాలు రేకిత్తిస్తున్నాయి. 21వ శతాబ్దంలో జరిగిన అతిపెద్ద రైలు ప్రమాదం ఇదేనంటూ చెప్తున్నారు అధికారులు. ఈ ప్రమాదంలో కుట్ర కోణం కూడా తెరపైకి రావడంతో నిజానిజాలు తేల్చేందుకు సీబీఐ రంగంలోకి దిగింది. ఈ ప్రమాదంపై సీబీఐ ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించింది. 10 మంది సభ్యులతో కూడిన సీబీఐ బృందం సోమవారం బాలాసోర్ రైలు ప్రమాద స్థలాన్ని సందర్శించి దర్యాప్తు ప్రారంభించింది.
రైలు ప్రమాదం తరువాత వందలాది మంది ప్రయాణికులు తమ టికెట్లను రద్దు చేసుకున్నారని తెలిపారు కాంగ్రెస్ మాజీ మంత్రి భక్త చరణ్ దాస్. ఒడిశా కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి భక్త చరణ్ దాస్ మీడియా సమావేశంలో మోదీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. ఇలాంటి రైలు ప్రమాదం గతంలో ఎన్నడూ జరగలేదని, వందలాది మంది ప్రాణాలు కోల్పోయారని, వెయ్యి మందికి పైగా గాయపడ్డారని చెప్పారు. ఈ ఘటన అందరినీ బాధించింది.ఈ ప్రమాదం తర్వాత వేలాది మంది తమ టిక్కెట్లను రద్దు చేసుకున్నారని ఆయన పేర్కొన్నారు. రైలులో ప్రయాణం సురక్షితం కాదని వారు భావిస్తున్నారని, అందుకే వారందరూ రైలు ప్రయాణాన్ని నమ్మడం లేదని చెప్పారు.
Read More: Prince Harry: మొదటిసారి ఆ విషయంపై కోర్టు మెట్లెక్కిన ప్రిన్స్ హ్యారీ.. అసలేం జరిగిందంటే?