Cough syrup : ఈ మూడు దగ్గు సిరప్లు డేంజర్ – WHO
Cough syrup : ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తాజాగా భారత్‌లో తయారవుతున్న మూడు కంపెనీల కఫ్ సిరప్లను వాడొద్దని హెచ్చరిక జారీ చేసింది
- By Sudheer Published Date - 08:34 AM, Tue - 14 October 25

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తాజాగా భారత్‌లో తయారవుతున్న మూడు కంపెనీల కఫ్ సిరప్లను వాడొద్దని హెచ్చరిక జారీ చేసింది. వీటిలో ప్రధానంగా ఇటీవల 22 మంది పిల్లల మరణానికి కారణమైన శ్రేసన్ ఫార్మా తయారు చేసిన “కోల్డిఫ్” సిరప్ కూడా ఉంది. దాంతో పాటు రెడ్నేక్స్ ఫార్మా తయారు చేసిన “రెస్పిఫ్రెష్ TR” మరియు షేప్ ఫార్మా యొక్క “రీలైఫ్” సిరప్ ఆరోగ్యానికి తీవ్ర హానికరమని WHO స్పష్టంగా పేర్కొంది. ల్యాబ్ పరీక్షల్లో ఈ సిరప్లలో డయెథిలీన్ గ్లైకాల్, ఎథిలీన్ గ్లైకాల్ అనే ప్రమాదకర కెమికల్‌లు గుర్తించబడటంతో సంస్థ ఈ హెచ్చరికను జారీ చేసింది. ఈ రసాయనాలు శరీరంలోని కిడ్నీలను దెబ్బతీసి మరణానికి దారితీసే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
Vastu Tips: మీ ఇంట్లో దక్షిణ దిశలో ఈ నాలుగు వస్తువులు ఉంచితే చాలు.. డబ్బు సమస్యలు పరార్!
ఈ సిరప్ల వాడకం వల్ల తలనొప్పి, వాంతులు, చూపు తగ్గడం, మూత్రపిండాల వైఫల్యం వంటి తీవ్రమైన దుష్ప్రభావాలు సంభవించవచ్చని WHO వివరించింది. అంతేకాక, పిల్లల్లో వీటి ప్రభావం మరింత వేగంగా ఉంటుందని పేర్కొంది. శ్రేసన్ ఫార్మా ఉత్పత్తి చేసిన “కోల్డిఫ్” సిరప్ వల్ల గత నెలలో కొన్ని రాష్ట్రాల్లో పిల్లల మరణాలు నమోదవడంతో WHO వెంటనే విచారణ చేపట్టింది. ల్యాబ్ ఫలితాలు అందిన వెంటనే ప్రజలను అప్రమత్తం చేస్తూ ఈ సిరప్లను మార్కెట్ నుండి ఉపసంహరించుకోవాలని ఆదేశించింది.
మరోవైపు, ఇండియన్ సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) WHOకు పంపిన నివేదికలో ఈ మందులు భారతదేశంలో మాత్రమే విక్రయించబడ్డాయని, ఇతర దేశాలకు ఎగుమతి కాలేదని స్పష్టం చేసింది. అయినప్పటికీ, దేశీయంగా ఈ ఉత్పత్తులు మార్కెట్లో లభ్యమవుతుంటే వాటిని తక్షణమే ఉపసంహరించి నాశనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచనలు ఇచ్చింది. ప్రజలు కఫ్ సిరప్లను కొనుగోలు చేసే ముందు కంపెనీ పేరు, తయారీ తేదీ, లాట్ నంబర్ వంటి వివరాలను తప్పక పరిశీలించాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. WHO చేసిన ఈ హెచ్చరిక మరోసారి ఫార్మా రంగంలో నాణ్యత నియంత్రణ వ్యవస్థ పటిష్టత అవసరంను స్పష్టంగా చాటింది.