PM Modi : పాక్‌లో కరెంటు లేదు..పిండి లేదు..చివరికి గాజులు కూడా లేవా?: ప్రధాని మోడీ
- By Latha Suma Published Date - 02:30 PM, Mon - 13 May 24
Prime Minister Modi: నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ నేత ఫరూక్ అబ్దులా(Farooq Abdullah)చేసిన వ్యాఖ్యలపై ప్రధాని మోడీ(PM Modi) కౌంటర్ వేశారు. పాకిస్థాన్ వద్ద కేసుకోవడానికి గాజులేమీ లేకపోతే..తాము పాకిస్థాన్(Pakistan)కు గాజులు తొడిగిస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు.
We’re now on WhatsApp. Click to Join.
సోమవారం బీహార్(Bihar) లోని ముజఫర్ పూర్(Muzaffarpur) పర్యటించిన ప్రధాని మోడీ.. ఫరూక్ అబ్దుల్లా పేరును ప్రస్తావించకుండా గట్టి కౌంటర్ ఇచ్చారు. ‘‘పాకిస్థాన్ గాజులు వేసుకుని లేకుంటే.. మనం పాకిస్థాన్ గాజులు తొడిగిద్దాం.. వాళ్లకు ఆహారమైన గోధుమ పిండి లేదు.. కరెంటు సరిగా లేదు. ఇప్పుడు వాళ్ల దగ్గర చివరికి గాజులు కూడా లేవని నాకు ఇప్పుడే తెలిసింది” అని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు.
Read Also: AP Poll : హింసాత్మక ఘటనలపై చంద్రబాబు ఆందోళన
కాగా, ఇటీవలి ఓ సభలో రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రసంగిస్తూ.. పాక్ ఆక్రమిత కశ్మీర్ ను త్వరలో స్వాధీనం చేసుకుంటామని పేర్కొన్నారు. దీనిపై ఇండియా కూటమిలో భాగస్వామ్యమైన కశ్మీర్ పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్ అగ్రనేత ఫరూక్ అబ్దుల్లా విమర్శలు గుప్పించారు. పాకిస్థాన్ చేతికి గాజులు వేసుకుని ఏమీ కూర్చోలేదని.. దాని దగ్గర అణు బాంబులు ఉన్నాయని, అవి వేస్తే భారత దేశానికి ప్రమాదమని వ్యాఖ్యానించారు.