AP Poll : హింసాత్మక ఘటనలపై చంద్రబాబు ఆందోళన
- By Sudheer Published Date - 01:44 PM, Mon - 13 May 24

రాష్ట్రంలో పోలింగ్ సందర్బంగా జరుగుతున్న హింసాత్మక ఘటనలపై చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేసారు. పలు పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలైన్లలో నిల్చున్న ఓటర్ల దగ్గరకు వెళ్లి ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని అడుగుతుండటం..పోలీసు బందోబస్తు ఉన్నప్పటికీ.. ఎన్నికల నిబంధనలను బేఖాతరు చేయడం..పలు చోట్ల వైసీపీ నేతలు దౌర్జన్యాలకు పాల్పడుతుండడం..టిడిపి ఏజెంట్ లను కిడ్నాప్ చేయడం..లైన్లో రమ్మన్నా ఓటర్ ను అధికార ఎమ్మెల్యే అయ్యి ఉండి కూడా కొట్టడం.. ఎదురుతిరిగిన టిడిపి కార్యకర్తలపై దాడులు చేయడం ఇలా ఇవన్నీ ఘటన లపై చంద్రబాబు ఈసీకి పిర్యాదు చేసారు.
We’re now on WhatsApp. Click to Join.
పోలింగ్‌ను ప్రశాంతంగా నిర్వహించడంలో పోలీసులు విఫలమయ్యారని విమర్శించారు. ఉదయం నుంచి పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఫిర్యాదులు చేస్తున్నా పట్టించుకోవడం లేదని, శాంతిభద్రతలను కాపాడలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం వెంటనే పోలింగ్‌ను సమీక్షించి పరిస్థితిని చక్కదిద్దాలని డిమాండ్ చేశారు. అలాగే కాంగ్రెస్ కడప ఎంపీ అభ్యర్థి వైస్ షర్మిల సైతం ఈసీ కి పిర్యాదు చేసింది. కడప పార్లమెంటు పరిధిలో జరుగుతున్న దాడులపై ఈసీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏ ఒక్క పార్టీ వైపు ఈసీ పక్షపాత నిర్ణయం తీసుకోకూడదన్నారు. ఈవీఎంలు ధ్వంసం చేసిన వైసీపీ అభ్యర్థిని బహిష్కరించాలని కోరారు.
Read Also : AP Poll : వైసీపీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఓటర్లు