Terror Conspiracy: ఢిల్లీలో ఉగ్రకుట్ర భగ్నం.. ఇద్దరు అరెస్ట్
దేశ రాజధాని ఢిల్లీలో ఉగ్రకుట్ర (Terror Conspiracy)ను పోలీసులు భగ్నం చేశారు. జహంగీర్ ప్రాంతంలో ఇద్దరు అనుమానితులను ఢిల్లీ పోలీస్ ప్రత్యక విభాగం గురువారం అదుపులోకి తీసుకున్నది. వీరిద్దరు గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముందు దేశ రాజధానిలో పెద్ద కుట్రకు ప్లాన్ చేసినట్లు సమాచారం.
- Author : Gopichand
Date : 13-01-2023 - 10:05 IST
Published By : Hashtagu Telugu Desk
దేశ రాజధాని ఢిల్లీలో ఉగ్రకుట్ర (Terror Conspiracy)ను పోలీసులు భగ్నం చేశారు. జహంగీర్ ప్రాంతంలో ఇద్దరు అనుమానితులను ఢిల్లీ పోలీస్ ప్రత్యక విభాగం గురువారం అదుపులోకి తీసుకున్నది. వీరిద్దరు గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముందు దేశ రాజధానిలో పెద్ద కుట్రకు ప్లాన్ చేసినట్లు సమాచారం. పోలీసులు అరెస్టు చేసిన ఇద్దరిలో ఒకరికి కెనడాలో ఉన్న ఖలీస్థానీ ఉగ్రవాది అర్హ్‌దీప్ దల్లాతో సంబంధం ఉన్నట్లు తెలిసింది.
దేశ రాజధాని ఢిల్లీలో ఉగ్ర కుట్రను పోలీసులు భగ్నం చేశారు. జహంగీర్ ప్రాంతంలో ఇద్దరు అనుమానితులను ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం గురువారం అరెస్టు చేసింది. జనవరి 26న రిపబ్లిక్ డే వేడుకలు జరగనున్న నేపథ్యంలో దేశ రాజధానిలో వీరిద్దరు పెద్ద కుట్ర పన్నారని పోలీసులు చెబుతున్నారు. పోలీసులు అరెస్ట్ చేసిన ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు కెనడాకు చెందిన ఖలిస్తానీ ఉగ్రవాది అర్హదీప్ డల్లాకు చెందిన సహాయకుడు.
Also Read: Attempts Suicide: భోపాల్‌లో విషాధ ఘటన.. అప్పుల బాధతో కుటుంబం ఆత్మహత్యాయత్నం
రెండు లక్షిత దాడులకు ప్లాన్ చేసినట్లు సమాచారం. నిందితుడి మొబైల్ నుంచి ఉగ్రవాదుల ప్లాన్ బ్లూప్రింట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్‌కు చెందిన అర్ష్‌దీప్ దల్లా అనే ఉగ్రవాది. కాగా, అర్ష్‌దీప్ దల్లాను రెండు రోజుల క్రితం హోం మంత్రిత్వ శాఖ ఉగ్రవాదిగా ప్రకటించిన సంగతి తెలిసిందే.