Indian Airports Shut: భారత్ – పాక్ టెన్షన్స్.. 32 ఎయిర్‌పోర్టుల మూసివేత
ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా 32 ఎయిర్ పోర్టులను మూసివేయాలని భారత సర్కారు(Indian Airports Shut) నిర్ణయించింది.
- By Pasha Published Date - 10:35 AM, Sat - 10 May 25

Indian Airports Shut: భారత్, పాకిస్తాన్ మధ్య సైనిక ఉద్రిక్తతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తర, పశ్చిమ భారతదేశంలోని పలు విమానాశ్రయాలను మూసేశారు. మొత్తం 32 విమానాశ్రయాలను మూసివేస్తూ భారత ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 15 వరకు ఈ ఎయిర్‌పోర్టుల మూసివేత కంటిన్యూ అవుతుందని వెల్లడించింది. పాకిస్తాన్ ఆర్మీ డ్రోన్లు, మిస్సైళ్లతో దాడులకు తెగబడుతోంది. వాటి వల్ల పౌర విమానాలకు ముప్పు పొంచి ఉంది. అందుకే ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా 32 ఎయిర్ పోర్టులను మూసివేయాలని భారత సర్కారు(Indian Airports Shut) నిర్ణయించింది.
Also Read :Red Alert : పంజాబ్‌పైకి భారీగా పాక్ డ్రోన్లు.. అమృత్‌సర్, భటిండాలలో రెడ్ అలర్ట్
ఈనెల 15 వరకు మూసివేయనున్న ఎయిర్‌పోర్టులు ఇవీ..
- అధంపూర్
- అంబాలా
- అమృత్ సర్
- అవంతిపూర్
- భటిండా
- భుజ్
- బికనీర్
- చండీగఢ్
- హల్వారా
- హిండాన్
- జైసల్మేర్
- జమ్మూ
- జామ్‌నగర్
- జోధ్‌పూర్
- కాండ్లా
- కాంగ్రా (గగ్గల్)
- కేశోడ్
- కిషన్‌గఢ్
- కులూ మనాలి (భుంటార్)
- లేహ్
- లూధియానా
- ముంద్రా
- నలియా
- పఠాన్‌కోట్
- పాటియాలా
- పోర్ బందర్
- రాజ్‌కోట్ (హిరాసర్)
- సర్సావా
- సిమ్లా
- శ్రీనగర్
- థోయిసే
- ఉత్తర్ లయ్
లాంగ్ రేంజ్ మిస్సైళ్లు రంగంలోకి దిగితే డేంజరే..
శుక్రవారం అర్ధరాత్రి నుంచి భారత్‌లోని ఉత్తర, పశ్చిమ సరిహద్దుల్లో ఉన్న రాష్ట్రాలను టార్గెట్‌గా చేసుకొని పాకిస్తాన్ దాడులు చేస్తోంది. మిస్సైళ్లు, డ్రోన్లతో పాక్ ఈ ఎటాక్స్ చేస్తోంది. దీనిపై వెంటనే అలర్ట్ అయిన భారత్ శనివారం తెల్లవారుజామున కీలక ప్రకటన విడుదల చేసింది. ఉత్తర, పశ్చిమ సరిహద్దుల్లోని రాష్ట్రాల్లో ఉన్న 32 విమానాశ్రయాలను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. పాకిస్తాన్‌తో ఉద్రిక్తతలు తగ్గే వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. ఒకవేళ యుద్ధం తీవ్రరూపు దాలిస్తే.. తదుపరిగా భారత్, పాకిస్తాన్ సైన్యాలు లాంగ్ రేంజ్ మిస్సైళ్లను బయటికి తీయనున్నాయి. అదే జరిగితే.. యుద్ధం పాకిస్తాన్, భారత్‌లలోని లోపలి ప్రాంతాలకు కూడా విస్తరిస్తుంది. పాకిస్తాన్ మిస్సైళ్లు భారత్‌లోని తూర్పు రాష్ట్రాలు, దక్షిణాది రాష్ట్రాలపైనా పడే ముప్పు ఉంటుంది. అయితే యుద్ధం అక్కడి వరకు వెళ్లకుండా చూడాలని అమెరికా, సౌదీ అరేబియా భావిస్తున్నాయ. భారత్, పాక్‌లను శాంతింపజేసేందుకు ఈ రెండు దేశాలు మధ్యవర్తిత్వం వహించేందుకు రెడీ అవుతున్నాయి.